Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బతుకమ్మ(Bathukamma): 9 రోజుల ఈ పండుగలో బతుకమ్మకు ఇష్టమైన నైవేద్యాలు..
బతుకమ్మ(Bathukamma) పండుగకు ప్రసిద్ధమైనది తెలంగాణ(Telangana) ఆశ్వయుజ(Ashwayuja) మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి ' బతుకమ్మ' వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు(Nine Days) తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను పూజిస్తారు.
బతుకమ్మ(Bathukamma) అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం(Nivedhyam) సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు (Engili Puvvu)బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల(addula Bathukamma)బతుకమ్మ అని అంటారు.

1. ఎంగిలి పూల (Engili Puvvu)బతుకమ్మ:- మహాలయ అమావాస్య రోజు. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.
2. అటుకుల (Atukula)బతుకమ్మ :- ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
3. ముద్దపప్పు (Muddapappu) బతుకమ్మ :- ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.
4. నానే బియ్యం( Nana Biyyam) బతుకమ్మ :- నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.
5. అట్ల (Atla) బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
6. అలిగిన Aliginaబతుకమ్మ :- ఆశ్వీయుజ పంచమి. ఈ రోజు నైవేద్యం సమర్పించరు.
7. వేపకాయల Vepakayalaబతుకమ్మ :- బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
8. వెన్నముద్దల Venne Muddalaబతుకమ్మ :- నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.
9.. సద్దుల Saddula బతుకమ్మ :- ఆశ్వీయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.



Click it and Unblock the Notifications