For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బతుకమ్మ పండుగతో ఆడపడుచుల్లో అమితమైన ఉత్సాహం..

|

తెలంగాణలో బొనాలు తర్వాత వచ్చే పండుగ బతుకమ్మ. ఇది అచ్చమైన జానపదుల పండుగ. ప్రకృతితో మమేకమై సంస్కృతిని ఎంతో అందంగా ప్రతింబింబే అదిరిపోయే దృశ్యాలు మనల్ని కనువిందు చేస్తాయి. నిత్యం యాంత్రిక జీవనంలో పడి అలసిపోయిన ఆడబిడ్డలకు ఉల్లాసాన్ని ఇచ్చి ఉత్తేజపరిచేందుకు ఉపయోగపడే గొప్ప పండుగ. తాము నిత్య సుమంగళిగా ఉండాలని కోరుతూ గౌరమ్మకు అతివలు చేసే పూజలే బతుకమ్మ పండుగ.

Bathukamma

తెలంగాణ ఆడబిడ్డలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఇక ఇప్పటి నుంచి తెలంగాణలో ఎక్కడ చూసినా పూల జాతరే. భాద్రపద మాసం చివరిరోజు ఆశ్వీయజమాసం ప్రారంభానికి ముందు తరుణిలంతా తనువంతా కళ్లు చేసుకుని ఎదురుచూసే పర్వదినమిది. రంగు రంగుల పూలవాసనలు, కమ్మని పాటలు, అలరించే ఆటలు, ముత్తైదుతనం కోసం ప్రతీ మగువ జరుపుకునే సంబురమిది..ఓవైపు ఆంధ్రప్రదేశ్ లో తాము అమితంగా ఆరాధించే అమ్మవారి నవరాత్రి వేడుకలు ప్రారంభం కావడం, మరోవైపు తెలంగాణలో గౌరీదేవిని తమకు నిత్య సుమంగళిత్వం అందించాలంటూ బతుకమ్మగా పూజించే రోజులు రానుండటంతో ఆడపడుచుల్లో అమితమైన ఆనందం కలుగుతుంది. ప్రపంచ చరిత్రలోనే విభిన్నమైన పూలను కొలిచే సాంప్రదాయం కేవలం బతుకమ్మ పండుగలోనే ఉండటం విశేషం.

1) బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందంటే..

1) బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందంటే..

బతుకమ్మ పండుగ వెనుక ఓ పురాణ గాథ ఉంది. చోళ రాజు అయిన ధర్మాంగధునికి వంద మంది కుమారులు పుట్టి యుద్ధంలో వీరమరణం పొందుతారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆడపిల్ల పుడుతుంది. నిండు నూరేళ్లు బతుకమ్మ అంటూ అంతా ఆ శిశువును ఆశీర్వదిస్తారు. నాటి నుంచి బతుకమ్మను లక్ష్మీ స్వరూపంగా భావించి పూలతో అలంకరించి చేసుకోవడం ఒక ఆచారంగా మారింది. కాకతీయ రాణి, వీర నారీమణి రుద్రమదేవి తన మనవళ్లకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ జరిపిందని చెబుతుంటారు. అలా దాదాపు వెయ్యేళ్లుగా సజీవంగా కొనసాగుతున్న ప్రజాపండుగ బతుకమ్మ.

2) బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందంటే..

2) బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందంటే..

బతుకమ్మ అంటే తెలంగాణలో రంగు రంగుల పూలతో జరుపుకునే శక్తివంతమైన పండుగ. ఈ పండుగను కేవలం ఆడబిడ్డలు మాత్రమే అనేక రకాల పూలను పేర్చి జరుపుకుంటారు. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలనికి చివర్లో ఈ బతుకమ్మ పండుగ వస్తుంది. రుతుపవనాల వల్ల వచ్చే వర్షాలు సాధారణంగా తెలంగాణలోని చెరువుల్లోకి మంచినీటిని పుష్కలంగా తెస్తాయి. అలాగే ఈ ప్రాంతంలో సాగు చేయని మరియు బంజరు భూములలోని అడవి పువ్వులు వివిధ శక్తివంతమైన రంగులలో వికసించే సమయం కూడా ఇదే.

3) ప్రకృతిలో సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే..

3) ప్రకృతిలో సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే..

ప్రకృతి నుండి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టతకు నిదర్శనం. నిత్య నూతన తెలంగాణ లోగిళ్లలో సిరులొలికించే ప్రకృతి పండుగ బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు భక్తిపారవశ్యంతో జరుపుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. పితృ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకు పూల పండుగ. పేద, ధనిక, మధ్యతరగతి అన్న తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాలకు చెందిన ఆడబిడ్డలు ఒక్కటై ఈ పండుగను జరుపుకుంటారు.

4) రంగు రంగుల పూలల్లో ఔషధ గుణాలు..

4) రంగు రంగుల పూలల్లో ఔషధ గుణాలు..

బతుకమ్మ పేర్పులో వినియోగించే పూలన్నింటిలో ఔషధగుణాలు ఇమిడి ఉంటాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ.. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ (ప్రసాదంగా ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం), నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజున బతుకమ్మ అలిగిన రోజు కావడంతో అర్రెం అంటూ బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా కొలుస్తారు.

5) తొమ్మిది రకాల ప్రసాదాలు..

5) తొమ్మిది రకాల ప్రసాదాలు..

తెలంగాణలోని బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. దీన్నే వానయం ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. వరి, సజ్జ రొట్టెలను, ముక్కలు చేసి చక్కెర పాకంలో వేసి ముద్దలుగా చేస్తారు. వీటినే మలీద ముద్దలని, కులీదని అంటారు. వీటితో పాటు రకరకాల సద్దులు చేస్తారు. అయితే ఈ నైవేద్యాలన్నీ జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉంటాయి. వాయినాలతో తమ మధ్య మరింత బంధం పెరుగుతుందని తెలంగాణ ఆడబిడ్డలు భావిస్తారు.చివరి రోజైన తొమ్మిదో రోజు మాత్రం బతుకమ్మకు పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర సద్ది, నిమ్మకాయ పులిహోర సద్ది, కొబ్బరి తురుము సద్ది, నువ్వుల పొడి కలిపిన సద్ది చేస్తారు. కొన్ని చోట్ల ఐదు రకాల చేస్తే, మరికొన్ని చోట్ల తొమ్మిది రకాల సద్దులు చేస్తారు.

6) బతుకమ్మలో సూక్ష్మజీవులను చంపే గుణం..

6) బతుకమ్మలో సూక్ష్మజీవులను చంపే గుణం..

బతుకమ్మ పండుగలో వినియోగించే పూలన్నింటిలో అనేకరకాల ఔషధగుణాలు ఉంటాయి. తంగేడు పువ్వుకు సూక్ష్మజీవులను చంపే గుణం ఉంటుంది. చెరువులో నీరు శుద్ధి కావడానికి తంగేడు పువ్వు ఉపయోగపడుతుంది. గునుగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది. సీత జడ పువ్వు జలుబు, ఆస్తమాను దూరం చేస్తుంది. మందారపువ్వు చండ్రు రాకుండా చేస్తుంది. కట్ల పువ్వు తొడిమలు అజీర్ణం కాకుండా అరికడతాయి. గుమ్మడి పువ్వులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇలా బతుకమ్మలో ఉపయోగించే వివిధ రకాల పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. బతుకమ్మ నిమజ్జనంతో చెరువులన్నీ శుద్ధి జరిగి స్వచ్ఛమైన నీటిని కలిగి ఉంటాయి.

7) అందరూ ఒక్కచోటికే..

7) అందరూ ఒక్కచోటికే..

తెలంగాణ ఆడబిడ్డలంతా అందరూ ఒకేచోటకు చేరి, ఒకేసారి చప్పట్లు కొడుతూ, ఒక్కొక్కరూ పాడుతుంటు అందరూ వారికి గొంతులు కలుపుతుంటారు. బతుకమ్మను ఆడటంలో కులమతాలు, పేద, ధనిక తేడాలే ఉండవు. పాటల్లో పల్లవుల ప్రతీపాదం చివరన కోలు, ఉయ్యాల, చందమామ, గౌరమ్మలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. శ్రమైక్య సౌందర్యానికి నిదర్శనంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ పాటలు పాడటం ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది.

8) ఆటపాటలతో..

8) ఆటపాటలతో..

తెలంగాణ ఆడబిడ్డల్లో ఎక్కువగా వంటింటికీ పరిమితమై, రోజు వారీ లేదా ఇతర పనులతో అలసిపోయే వారంతా సాయంత్రం ఒకచోటకు చేరి ఆటపాటలతో గడుపుతారు. వివాహం చేసుకున్న వారంతా పుట్టింటికి చేరుకుంటారు. ఇలా తొమ్మిదిరోజులు వారికి విశ్రాంతి లభిస్తుంది. దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల పేరుతో దుర్గాదేవిని పూజిస్తే తెలంగాణ ఆడపడుచులు మాత్రం దుర్గామతను గౌరీదేవిగా కొలుస్తారు.

9) ఓనం కూడా కొంచెం ఇలానే..

9) ఓనం కూడా కొంచెం ఇలానే..

సందె చీకట్ల మధ్య చెరువులోని నటి అలలమీద బతుకమ్మలు ముందుకు వెనుకకు కదులుతూ ఉంటే అదొక ఉద్వేగం. పోయిరావమ్మ బతుకమ్మ.. పోయిక రావమ్మ.. మళ్లీ వచ్చే ఏడాది తిరిగి రావమ్మ అంటూ శ్రీ లక్ష్మీ నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అంటూ పాటలు పాడతారు. వారు తెచ్చిన ప్రసాదాలు, ఫలహారాలు తబకుల్లో పోసి ఒక్క దగ్గర అందరూ కలసిపోతారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ గురంచి సినిమాలు కూడా వచ్చాయి. కేరళలో ఓనం పండుగ అటూ ఇటూగా ఇలాగే ఉంటుంది. ఆడబిడ్డలు ఆడుకునే అందమైన, అద్భుతమైన పూల జాతర. ఈ రెండు సందర్భాలను మినహాయిస్తే పూల సమ్మేళనంతో కూడిన పండుగలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు.

English summary

Bathukamma Festival 2019 : Dates, History and Significance

Bathukamma is a colourful and vibrant festival of Telangana and celebrated by women, with flowers that grow exclusively in each region. This festival is a symbol of Telangana’s cultural identity. Bathukamma comes during the latter half of monsoon, before the onset of winter. The monsoon rains usually brings plenty of water into the fresh water ponds of Telangana and it is also the time when wild flowers bloom in various vibrant colors all across the uncultivated and barren plains of the region.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more