Latest Updates
-
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.! -
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.! -
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా
Bathukamma Festival 2021: తెలంగాణ బతుకమ్మ కథ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా..
బతుకమ్మ కథ గురించి ఆసక్తికరమైన విషయాలు..
మన దేశంలో దసరా పండుగ సందర్భంగా చాలా చోట్ల దుర్గమ్మను పూజిస్తే తెలంగాణలో మాత్రం బతుకమ్మను జరుపుకునే విషయం గురించి చాలా మందికి తెలిసిందే. బతుకమ్మ పండుగ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేది పూలు. రంగు రంగుల పూలను తీసుకొచ్చి అందమైన ఆకారంలో పేర్చి ఈ పండుగను జరుపుకుంటారు.

ఇంతకీ ఈ పండుగ ఎలా వచ్చింది. ఎందుకు వచ్చింది అనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈరోజు స్టోరీలో బతుకమ్మ కథ గురించి మాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటున్నాం. ఈ బతుకమ్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ కథను మీరు కూడా తెలుసుకోవాలంటే కిందికి స్క్రోల్ చేయండి.

1) పౌరాణికం ఆధారంగా..
తెలంగాణ కథకు సంబంధించి రెండు కథలు ఉన్నాయి. ఒకటేమో పౌరాణికం ఆధారంగా, మరొకటి జానపదుల ఆధారంగా ఉన్నాయి. పౌరాణికంగా పరిశీలిస్తే పూర్వకాలంలో ధర్మాంగుడు అనే రాజు. ఆయనకు సత్యవతి అనే భార్య. ఈ దంపతులకు వంద మంది సంతానం ఉండేవారు. ఓసారి యుద్ధానికి వెళ్లి ఆ వందమంది మరణిస్తారు. ఒకేసారి ఆ వందమంది చనిపోయేసరికి ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు. దీంతో వారి దగ్గర నగదు, నగలు, ధాన్యం ఇతర వాటిని అన్నింటిని మేమిద్దరిమే ఏమి చేసుకుంటాము అని, వాటినన్నింటినీ దానం చేసేస్తారు.

2) లక్ష్మీదేవి జననం..
ఆ తర్వాత వారు అడవి బాట పడతారు. దేవుడినే తలచుకుంటూ తపస్సు చేస్తుంటారు. వీరి సాధారణ జీవితాన్ని చూసి లక్ష్మీదేవి మెచ్చుకుంటుంది. వెంటనే వారి వద్దకు వెళ్లి మీ దగ్గర ఉన్నవాటినన్నింటినీ దానం చేసేశారు. మీకు ఏదైనా వరం కావాలా అని అడిగితే, మేము సంతానం లేకుండా వచ్చాం. కాబట్టి నువ్వే నా కడుపున పుడితే బాగుంటుందని సత్యవతి కోరుకుంటుందంట. ధర్మాంగరాజు సైతం అదే కోరుకుంటాడు. దీంతో వారి కోరిక నెరవేర్చేందుకు లక్ష్మీదేవి వారికి జన్మిస్తుంది.

3) బతుకమ్మ అనే పేరు..
అయితే ఆమెను చూడటానికి మునులు, సాధువులు అందరూ వచ్చి ఆ సమయంలో ఆ తల్లిని చూసి బతుకమ్మ అని పేరు పెడతారు. అందుకనే బతుకమ్మ అంటే లక్ష్మీ అని అంటుంటారు. లక్ష్మీ ఉన్న దగ్గర అష్టఐశ్వర్యాలు వస్తాయి కాబట్టి బతుకమ్మ పెరిగి పెద్దయ్యాక చిత్రాంగుడు అనే రాజు రూపంలో విష్ణువు వచ్చి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటాడు. అలా బతుకమ్మను పేర్చిన ఇంట సకల సౌభాగ్యాలు, సంతోషం, సిరి సంపదలతో ఏదైతే మనం ధర్మంగరాజు, సత్యవతికి ఎలా వచ్చాయో మనకు అలా తిరిగి వస్తాయని పౌరాణికం ఆధారంగా తెలుస్తోంది.

4) ఇక జానపదుల విషయానికొస్తే..
పూర్వం అన్నాచెల్లెలు ఉండేవారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే వారికి మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి. ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు.వారిద్దరూ పెరిగి పెద్దయ్యాక వివాహం జరుగుతుంది. బతుకమ్మ (చెల్లెలు)కు పెళ్లి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ కూడా బతుకమ్మకు అంతా హాయిగా ఉంటుంది. కానీ ఒకరోజు చెల్లెలి వదిన బతుకమ్మపై పగ పెంచుకుంటుంది. తన భర్త తన కంటే బతుకమ్మ(చెల్లెలి)పై ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటారు. దీంతో బతుకమ్మపై కోపం పెంచుకున్న ఆమె అన్నయ్య లేనప్పుడు బతుకమ్మను చంపి సమాధి చేస్తుంది.

5) తంగెడు పువ్వు రూపంలో..
తన చెల్లెలు చనిపోయిన విషయం తెలుసుకున్న అన్నయ్య తెగ బాధపడుతుంటాడు. దీంతో బతుకమ్మ ఆ అన్నయ్య నిద్ర పోతున్న సమయంలో కలలో ఆయనకు కనిపించి నా జీవితం అప్పుడూ పూర్తవ్వలేదు. నేను తంగెడు చెట్టు అయ్యి మళ్లీ పుట్టాను. తంగెడు పువ్వు రూపంలో తిరిగి వచ్చాను అని చెబుతుంది. వెంటనే ఆయన నిద్రలోంచి లేచి తను చెప్పిన స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ తంగెడు పూలతో ఆ చెట్టు ఉంటుంది.

6) అమావాస్య తర్వాత..
దసరా నవరాత్రుల సమయంలో తొమ్మిదిరోజుల పాటు మహిళలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహాలయ అమావాస్య తర్వాత తెలంగాణ ఆడబిడ్డలంతా ఒక్కచోటకు చేరుకుంటారు. తొమ్మిదిరోజులకు గాను తొమ్మిది రకాల పూలతో పూజలు చేస్తారు. ఆ పూలల్లో మంచి ఔషధ గుణాలు సైతం ఉంటాయి.

7) బతకమ్మ పూలు - వాటి వల్ల ప్రయోజనాలు..
తంగెడు పువ్వు సూక్ష్మ జీవులను చంపుతుంది. చెరువులోని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది.
గునుగు పువ్వు జీర్ణ కోశాన్ని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటుంది.
సీత జడ పువ్వు జలుబు, ఆస్తమాను దూరం చేస్తుంది.
మందార పువ్వు చుండ్రు రాకుండా చేస్తుంది.
కట్ల పువ్వు తొడిమలు అజీర్ణం కాకుండా అరికడతాయి.
గుమ్మడి పువ్వులో ఏ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది.
ఇలా బతుకమ్మ పండుగలో ఉపయోగించే రకరకాల పూలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం అశ్వీయుజ మాసంలో వస్తుంది. భాద్రపద అమావాస్య తర్వాతి రోజు నుండి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఈనెల అంటే అక్టోబర్ 6వ తేదీ నుండి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సంబురాలు ప్రారంభమయ్యాయి.



Click it and Unblock the Notifications