For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bathukamma Festival 2021: బతుకమ్మ పండుగ వేళ రంగురంగుల పూలను ఎందుకు కొలుస్తారంటే...

బతుకమ్మ పండుగ గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ పండుగను కేవలం ఆడబిడ్డలు మాత్రమే విభిన్న రకాల పూలను పేర్చి జరుపుకుంటారు.

Bathukamma Festival 2021 Dates, History, Why we celebrate and Significance in telugu

ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపునకు ప్రతీక. చలికాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివర్లో వచ్చే ఈ పండుగ ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ వేళ పూలతోనే ఎందుకు వేడుకలు జరుపుకుంటారు? అందుకు గల కారణాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Bathukamma Festival 2021 Dates, History, Why we celebrate and Significance in telugu

బతుకమ్మ పండుగను పూలతోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...!బతుకమ్మ పండుగను పూలతోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...!

జానపదుల పండుగ..

జానపదుల పండుగ..

తెలంగాణలో బొనాలు తర్వాత వచ్చే పండుగ బతుకమ్మ. ఇది అచ్చమైన జానపదుల పండుగ. ప్రకృతితో మమేకమై సంస్కృతిని ఎంతో అందంగా ప్రతింబింబే అదిరిపోయే దృశ్యాలు మనల్ని కనువిందు చేస్తాయి. నిత్యం యాంత్రిక జీవనంలో పడి అలసిపోయిన ఆడబిడ్డలకు ఉల్లాసాన్ని ఇచ్చి ఉత్తేజపరిచేందుకు ఉపయోగపడే గొప్ప పండుగ. తాము నిత్య సుమంగళిగా ఉండాలని కోరుతూ గౌరమ్మకు అతివలు చేసే పూజలే బతుకమ్మ పండుగ.

పూల జాతరే..

పూల జాతరే..

తెలంగాణ ఆడబిడ్డలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఇక ఇప్పటి నుంచి తెలంగాణలో ఎక్కడ చూసినా పూల జాతరే. భాద్రపద మాసం చివరిరోజు ఆశ్వీయుజమాసం ప్రారంభానికి ముందు తరుణిలంతా తనువంతా కళ్లు చేసుకుని ఎదురుచూసే పర్వదినమిది. రంగు రంగుల పూలవాసనలు, కమ్మని పాటలు, అలరించే ఆటలు, ముత్తైదుతనం కోసం ప్రతీ మగువ జరుపుకునే సంబురమిది..

ఓవైపు ఆంధ్రప్రదేశ్ లో తాము అమితంగా ఆరాధించే అమ్మవారి నవరాత్రి వేడుకలు ప్రారంభం కావడం, మరోవైపు తెలంగాణలో గౌరీదేవిని తమకు నిత్య సుమంగళిత్వం అందించాలంటూ బతుకమ్మగా పూజించే రోజులు రానుండటంతో ఆడపడుచుల్లో అమితమైన ఆనందం కలుగుతుంది. ప్రపంచ చరిత్రలోనే విభిన్నమైన పూలను కొలిచే సాంప్రదాయం కేవలం బతుకమ్మ పండుగలోనే ఉండటం విశేషం.

తెలంగాణ లోగిళ్లలో..

తెలంగాణ లోగిళ్లలో..

తెలంగాణలోని పచ్చని ప్రకృతి నుండి సేకరించిన పూలను తిరిగి అదే ప్రకృతికే సమర్పించడం ఈ బతుకమ్మ పండుగ యొక్క నిదర్శనం. నిత్య నూతన తెలంగాణ లోగిళ్లలో సిరులోలికించే ఈ ప్రకృతి పండుగ బతుకమ్మను తెలంగాణ ఆడపడుచులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. మహాలయ అమావాస్య ప్రారంభం నుండి దుర్గాష్టమి వరకు తొమ్మిదిరోజుల పాటు ఈ పూల పండుగను జరుపుకుంటారు. పేద, ధనిక అనే తేడాలు లేకుండా అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఒక్కటై ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.

9 రోజులు.. 9 రకాల పూలు..

9 రోజులు.. 9 రకాల పూలు..

బతుకమ్మ పూలను పేర్చే సమయంలో.. వాటిని వినియోగించే పూలలో కచ్చితంగా ఔషధ గుణాలు ఇమిడి ఉంటాయి. కాబట్టి 9 రోజుల పాటు 9 రకాల పూలను సేకరించి.. అందంగా పేర్చుతారు. వీటిలో తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ (ప్రసాదంగా ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం), నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజున బతుకమ్మ అలిగిన రోజు కావడంతో అర్రెం అంటూ బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా కొలుస్తారు.

చెరువులన్నీ శుద్ధి..

చెరువులన్నీ శుద్ధి..

ఈ పూలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయి. ముఖ్యంగా తంగెడు పువ్వులో సూక్ష్మక్రిములను చంపే గుణం ఎక్కువగా ఉంటుంది. చెరువులలో నీరు శుద్ధి కావడానికి ఈ పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది. గునుగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది. సీత జడ పువ్వులైతే జలుబు, ఆస్తమాను దూరం చేస్తుంది. మందారపువ్వు చుండ్రు రాకుండా నిరోధిస్తుంది. కట్ల పువ్వు తొడిమలు అజీర్ణం కాకుండా అరికడతాయి. గుమ్మడి పువ్వులో విటమిన్ఏ పుష్కలంగా ఉంటుంది. ఇలా బతుకమ్మలో వినియోగించే పూలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. బతుకమ్మ నిమజ్జనం తర్వాత చెరువులన్నీ శుద్ధి జరిగి స్వచ్ఛమైన నీటిని లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

9 రోజులు విశ్రాంతి..

9 రోజులు విశ్రాంతి..

తెలంగాణ ఆడబిడ్డల్లో ఎక్కువగా వంటింటికీ పరిమితమై, రోజు వారీ లేదా ఇతర పనులతో అలసిపోయే వారంతా సాయంత్రం ఒకచోటకు చేరి ఆటపాటలతో గడుపుతారు. వివాహం చేసుకున్న వారంతా పుట్టింటికి చేరుకుంటారు. ఇలా 9 రోజుల పాటు వారికి విశ్రాంతి లభిస్తుంది. దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల పేరిట దుర్గామాతను పూజిస్తే, తెలంగాణలో మాత్రం ఆడబిడ్డలందరూ దుర్గాదేవిని గౌరీ మాతను పూజిస్తారు.

FAQ's
  • 2021లో బతుకమ్మ పండుగ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది?

    తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ 6 అక్టోబర్ 2021 నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆడపడుచులంతా అనేక రకాల పూలను పేర్చి ఈ ఉత్సవాలను జరుపుకుంటారు.

  • బతుకమ్మ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?

    మన భారతదేశంలో బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకుంటారు. ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఓనం పండుగను పోలి ఉంటుంది.

English summary

Bathukamma Festival 2021 Dates, History, Why we celebrate and Significance in telugu

Here we are talking about the bathukamma festival 2021 dates, history, why we celebrate and significance in Telugu. Have a look
Desktop Bottom Promotion