Latest Updates
-
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు
పెళ్లి కావాల్సిన అమ్మాయిలంతా చేసుకునే పండుగనే తీజ్, హరియాలి తీజ్ గురించి తెలుసా
తెలంగాణలో కూడా తీజ్ ఉత్సవాలను ఏటా శ్రావణంలో లంబాడాలు నిర్వహించుకుంటారు. హరియాల్ తీజ్ కు దీనికి కాస్త వైవిధ్యం ఉంటుంది. యువతులు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు, ఆకకూరలే తింటూ పూజలు చేస్తారు. తీజ్.
హిందూ మాసాల్లో శ్రావణ మాసంలో వచ్చే పండుగలు ఇంకెప్పుడు రావేమో. ఈ మాసమంతా అంతా మంగళకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా పూజలే. ఇక శ్రావణంలోని శుక్షపక్షం మూడో రోజున ఒక పండుగ వస్తుంది. అదే హరియలీ తీజ్.
ఇది మహిళలకు సంబంధించిన పండుగ. ఆ రోజు మహిళలు తమ భర్తలు బాగుండాలని కోరుకుంటూ పూజలు చేస్తారు.

పార్వతిని పెళ్లి చేసుకున్న రోజు
దక్షుడి కుమార్తె అయిన పార్వతీ దేవిని శివుడు తన భార్యగా స్వీకరించిన రోజునే హరియాలి తీజ్ పండుగ చేసుకుంటారు. భార్య ఎంతో ప్రేమగా చూసుకున్న శివుడిని.. హరియాలి తీజ్ రోజూ అందరూ ఆరాధిస్తారు.
తనలో సగ భాగం భార్యకు ఇచ్చిన శివుడిలాగే తమ భర్త ఉండాలని కోరుకుంటారు మహిళలంతా. ఏ కష్టం వచ్చినా తన భర్త తనను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని కోరుకుంటూ పూజలు చేస్తారు.

శ్రావణ తేజ్
ఇక ఇది శ్రావణమాసంలో రావడం వల్ల దీన్ని శ్రావణ తేజ్ అని కూడా అంటారు. శివుడిని ఆరాధించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. హరియాలి తీజ్ పండుగ రోజంతా ఉపవాసం ఉండి వ్రతాలు చేస్తారు ఆడవారు. కనీసం నీళ్లు కూడా తాగరు. తీజ్ అయిపోయిన మరుసటి రోజు తింటారు.

స్నేహితురాళ్లతో కలిసి
ఇక అమ్మాయిలు హరియాలి తీజ్ రోజున తమ స్నేహితురాళ్లతో కలిసి ఆనందంగా గడుపుతారు. అందరి ఒకచోట సమావేశమై ముచ్చట్లు పెట్టుకుంటారు. పెళ్లీడుకొచ్చిన యువతులంతా పెద్దపెద్ద చెట్ల కింద సేదతీరుతూ ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతారు. తీజ్ రోజు వీధి నాటకాలు కూడా ప్రదర్శిస్తారు. పార్వతీ, శివుడుల ప్రేమగాథలను తెలిపేలా ప్రదర్శనలుంటాయి.

కొత్తపెళ్లికూతురు తన పుట్టింటికి వెళ్లి
కొత్తగా పెళ్లి చేసుకుని ఉంటే ఆ రోజు కొత్తపెళ్లికూతురు తన పుట్టింటికి వెళ్లి సరదాగా గడుపుతుంది. తీజ్ రోజు అమ్మాయిలంతా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతారు. అలాగే ఊర్లలో ఊయల్లో ఊగుతూ గడుపుతారు. పెద్దపెద్ద చెట్ల కింద ఏర్పాటు చేసిన ఊయల్లో ఊగుతూ ఆనందంగా గడపుతారు. ఈ పండుగను ఎక్కువగా ఉత్తరాదిన చేసుకుంటారు.శివపార్వతీల ప్రేమకు ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ రోజు రాత్రంతా కూడా నిద్రపోకుండా సంబురాలు చేసుకుంటూనే ఉంటారు.

లంబాడాలు నిర్వహించుకుంటారు
అయితే తెలంగాణలో కూడా తీజ్ ఉత్సవాలను ఏటా శ్రావణంలో లంబాడాలు నిర్వహించుకుంటారు. హరియాల్ తీజ్ కు దీనికి కాస్త వైవిధ్యం ఉంటుంది. యువతులు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు, ఆకకూరలే తింటూ పూజలు చేస్తారు. గోధుమలు లేదా ధాన్యాన్ని బుట్టలో వేసి రోజూ వాటికి నీళ్లు పోస్తారు. ఇక చివరి రోజు వారంతా కలిసి మొలకెత్తిన ధాన్యాలతో ఉన్న బుటలతో ఊరేగింపుగా వెళ్తూ సంబురం చేసుకుంటారు.

శివపార్వతులనే పూజిస్తారు
వీరు కూడా శివపార్వతులనే పూజిస్తారు. మన ప్రాంతంలో తీజ్ ను పెళ్లి కావాల్సిన లంబాడీ యువతులే చేసుకుంటారు. మంచి వరుడితో పెళ్లి కావాలని కోరుకుంటూ ఈ పండుగ చేసుకుంటారు. తొమ్మిది రోజుల పాట ఆటపాటలతో సంబురాలు చేసుకుంటారు. చివరి రోజు నిమజ్జనంతో ఈ పండుగ పూర్తి అవుతుంది. మొత్తానికి ఎక్కడైనా సరే తీజ్ పండుగ అమ్మాయిలు జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications
