Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
వెండి దీపాలు ఏఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారు
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే. ప్రతి ఇంట్లో రోజూ దీపం చేస్తాం. ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం భారతీయుల సంప్రదాయం. ఏ పండుగ వచ్చినా.. ఏ శుభకార్యం జరిగినా.. దేవాలయానికి వెళ్లి దీపం పెట్టడం కూడా.. ఒక సంప్రదాయం ఉంది. అలాగే కార్తీక మాసం, మాఘమాసాలలో కూడా ఎక్కువగా దీపారాధనకు ప్రాధాన్యత ఇస్తారు. శివుడికి ఎక్కువగా దీపారాధన చేయడం ఆనవాయితీగా మారింది.
రోజూ దీపారాధన చేసినా.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి.. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే.. నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఈ ఆర్టికల్ ద్వారా నివృత్తి చేసుకుందాం...
దీపం ఎప్పుడు చేయాలి ? ఎలా చేయాలి ? పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి, మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
రాతి యుగం నుండి రాతిలో వెలిగించు,లోహతో వెలిగించు దీపాల వరకు, దీపాల అకృతులకును, వాటిని తయ్యారు చెయ్యటానికి వాడే వస్తువునకు కుడా ఎంతో ప్రాముఖ్యత మరియు చరిత్ర ఉంది. అందులో కళాత్మకతో ఒక క్రమ వికాసం కనిపిస్తుంది.
రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.అలాగే రకరకాల గుళ్ళల్లలోనూ కూడ దీపారాధన కు ఉపయోగించేవారు. ఆ తరువాత మట్టి ప్రమిదలు వాడుకలోకి వచ్చేను. మనుషులలో ఆర్ధిక,సామాజికంగా వచ్చిన మార్పుల బట్టి దీపాకృతుల్లోను వాటి పరిమాణంలోను కళత్మకతలోను మార్పులు వచ్చేసాయి. ఉదాహరణకు ఆర్ధికంగా ఉన్నవారు స్వర్ణదీపాలు,నవరత్నములు పొదిగిన దీపాల సెమ్మెలు వాడుకలో ఉన్నట్లు, మన ప్రాచీన ఇతిహాసాలలోను కావ్యాలలో ప్రస్తావనలున్నాయి. మరి వెండి దీపాలు ఏదేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయోచూద్దాం...

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
వెండి దీపాలలో నెయ్యి వేసి గణపతి ముందు వెలిగిస్తే ఇష్టకార్య సిద్ది కలుగుతుంది. మీరు ఏ కోరిక కోరుకున్న తీరుతాయి.

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
వెండి దీపాలు, సరస్వతి దేవి ముందు వెలిగిస్తే , మనలోని అజ్ఝానం పోయి సుజ్ఝానం వస్తుంది. సరస్వతి దేవి కటాక్షం కలుగుతుంది.

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
వెండి దీపాలు మహాలక్ష్మి దేవి ముందు వెలిగిస్తే దారిద్ర్యం పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
వెండి దీపాలు సూర్యునిముందు తెల్లవారుజామున , (తెల్లవారక ముందు)వెండి దీపాలు వెలిగిస్తే స్వామి నువ్వు జగత్ రక్షకుడవు అని దీపాలు చూపించాలి. అలానే సాయంత్రం అనగా సంధ్యా సమయంలో అనగా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వెలుగును ఇచ్చావు, ఇప్పుడు నీకు వెలుగు ను చూపిస్తున్నామని చెప్పాలి, ఇలా చేస్తే పేదరికం పోయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. శత్రువులు దూరమై ముఖంలో కళ వస్తుంది.

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
చంద్రుని ఎదుట వెండి దీపాలు వెలిగిస్తే ముఖంలో కాంతి వచ్చి, తేజోవంతులుగా మారుతారు. మనసు స్థిరత్వం ఉంటుంది. చంచల దోషం పోతుంది.

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
కుజగ్రహం(అంగారక గ్రహం) ముందు నెలలో ఒక మంగళవారం వెండి దీపం వెలిగించడం వల్ల లోలోలపల గొడవలు ఉంటే అవి పోతాయి. బిపి కంట్రోల్ అవుతుంది.

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
నవగ్రహాల్లో బుధగ్రహం దగ్గర ఒక బుధవారం వెండి దీపం వెలిగించడం వల్ల సత్ బుద్ది కలుగుతుంది.

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
నవగ్రహాలలో బుధగ్రహం వద్ద ఒక గురువారం వెండి దీపాలు వెలిగించడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి.

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
నవగ్రహాలలో ఒక శుక్రగ్రహం వద్ద ఒక శుక్రవారం నాడు వెండి దీపం వెలిగించడం వల్ల షుగర్ వ్యాధి నివారణ అవుతుంది.

ఏదేవుని ముందు వెండిదీపాలు వెలిగిస్తే ..ఎలాంటి లాభాలు కలుగుతాయి
.నవగ్రహాలలో శనిగ్రహం దగ్గర ఒక శనివారం వెండి దీపం వెలిగించడం వల్ల గుప్తరోగాలు నివారణ అవుతాయి.



Click it and Unblock the Notifications
