Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
Benefits of Homam:ఏ హోమం వల్ల ఎలాంటి ఫలితమొస్తుందో తెలుసా...
వేర్వేరు రకాల హోమం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ మత విశ్వాసాల ప్రకారం, హోమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఎవరి జాతకంలో ఏదైనా దోషం ఉంటే హోమం చేస్తారు. అలాగే సకాలంలో వర్షాలు కురవాలని పండితులు హోమం చేస్తుంటారు.

ఈ హోమానికి మతపరంగా మాత్రమే కాదు.. శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వ కాలం నుండి ఈ హోమం నిర్వహించే సంప్రదాయం ఉంది. గ్రహాల ప్రభావంతో ఏమైనా ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటే.. వాటిని శాంత పరచేందుకు హోమం నిర్వహిస్తారు.

అలాగే హోమంలో మనం సమర్పించే వస్తువులతో, మనం కోరుకున్న కోరికలను అగ్నిదేవుడు నేరుగా దేవుళ్లకు చెబుతారని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా హోమాల్లో ఎన్ని రకాలున్నాయి? హోమం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గణపతి హోమం..
ఎవరైతే తమ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో.. వాటి నుండి బయటపడేందుకు.. వినాయకుని అనుగ్రహం పొందడానికి గణేష్ హోమం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుండి సులభంగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉందని పండితులు చెబుతున్నారు.

శివ హోమం..
ఎవరైతే పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో.. ఇరు కుటుంబాల వారు మాట్లాడుకున్న క్యాన్సిల్ అయ్యే సందర్భాలను ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో.. అలాంటి వాటి నుండి ఉపశమనం పొందడానికి సోమవారం రోజున శివుడిని స్మరించుకుంటూ నలుగురు పండితుల సమక్షంలో శివ హోమం చేస్తే పెళ్లి సంబంధిత సమస్యలకు కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది.

సరస్వతీ హోమం..
ఎవరైతే విద్యలో వెనుకబడి ఉంటారో.. వారు ఈ హోమాలను కచ్చితంగా చేయాలి. నీల సరస్వతీ దేవి హోమం, దక్షిణా మూర్తి హోమం, విద్యా గణపతి హోమం, బుద్ధి గణపతి హోమం, సిద్ధి గణపతి హోమం వంటివి చేయడం వల్ల మీరు పిల్లల విద్య సంబంధిత సమస్యల నుండి కచ్చితంగా పరిష్కారాన్ని పొందుతారు.

మహా సుదర్శన హోమం..
మనలో చాలా మందికి ప్రత్యర్థులు ఉంటారు. కొందరు ప్రత్యర్థులు నేరుగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తే.. మరి కొందరు పరోక్షంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారి నుండి రక్షణ పొందడం కోసం మహా సుదర్శన హోమం, అఘోరాష్ట హోమం, ప్రతియాంగిర హోమం, బగల ముఖ హోమం చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

కుభేర లక్ష్మీ హోమం..
ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారో.. వాటి నుండి బయటపడేందుకు లక్ష్మీ నారాయణ హ్రుదయ నిలయం, కుభేర లక్ష్మీ హోమం, చండికా హోమం వంటివి చేస్తే కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది.

ధన్వంతరీ హోమం..
ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారో.. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదో.. అలాంటి సమయంలో ఆ వ్యాధి నుండి ఉపశమనం పొందేందుకు ధన్వంతరీ హోమం, నవగ్రహ హోమం వంటివి చేస్తే కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది.



Click it and Unblock the Notifications