For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్షయ-తృతీయ వైవిధ్యాన్ని తెలుసుకొని, భాగ్యవంతులు కండి!

|

"అక్షయ" అంటే 'నిత్యమైనదని' అర్థం. భారతదేశంలో కొన్ని పండగలను చాలామంది ప్రజలు గొప్ప ఉత్సాహంతో ఆర్బాటంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ (లేదా) అఖ టీజ్ అనే పవిత్రమైన రోజును ఆరాధనాభావంతో, హిందువులు మాత్రమే కాదు, జైనులు కూడా జరుపుకుంటారు.

ఈ పవిత్రమైన రోజున వివిధ రాష్ట్రాలలో ఒక్కొక్క ప్రాముఖ్యతతో జరుపుకుంటారు. భారతదేశం గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే "భిన్నత్వంలో ఏకత్వమును" కలిగిన ఒకేఒక్క దేశం.

ఈ పండుగ విషయానికి వస్తే, ఆ పదంలో ఉన్న నిజము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో "అక్షయ తృతీయ" పేర్గాంచింది. దీనిని ఛత్తీస్ఘడ్లో - 'అక్తి' అని, గుజరాత్ & రాజస్థాన్లలో దీనిని 'అహ టీజ్' అని పిలుస్తారు.

హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాస శుక్లపక్షం నాడు ఈ పవిత్ర దినాన్ని జరుపుకుంటారు. ఈ వ్యాసంలో, అక్షయ తృతీయ నాడు నిర్వహించే పూజలకు ఉత్తమమైన సమయము గూర్చి, అలాగే దానికి సంబంధించిన ముఖ్యమైన కథల గూర్చి పూర్తిగ తెలుసుకోబోతున్నాం.

"అక్షయ తృతీయ" కోసం ఉత్తమమైన ముహూర్తం:

ఈ సంవత్సరం 'తృతీయ' తిథి, 18 ఏప్రిల్ 2018వ తేదీ ఉదయం 03:45 నుంచి ప్రారంభమయ్యి - 19 ఏప్రిల్ 2018వ తేదీ 1:29 AM వరకు కొనసాగుతుంది.

అక్షయ తృతీయ పూజ ముహూర్తం = 05:56 నుండి 12:20

వ్యవధి కాలం = 6 గంటలు 23 నిమిషాలు

పూజ కోసం ఉత్తమమైన సమయం :

ఈ తిథి శనివారం వరకూ వున్నప్పటికీ, ఈ పూజ ముహూర్తం ఏప్రిల్ 28, ఉదయం 10:29 - 12:36 వరకు అనగా 2 గంటల 6 నిమిషాల వరకూ కొనసాగుతోంది.

పరాశురాముని పుట్టుక :

ఈ అక్షయ తృతీయ ప్రాముఖ్యతను గూర్చి మనము మాట్లాడేటప్పుడు, మనకు గుర్తుకు వచ్చే మొట్టమొదటి విషయం "పరశురామును" పుట్టుక. విష్ణువు 6 అవతారం అయినా ఇయన, అనిశ్చయమైన పాలకుల నుంచి ప్రపంచాన్ని 21 సార్లు రక్షించాడు.

మహాభారత ప్రారంభం :

శ్రీ మహా గణేషుడు, వేదవ్యాసుని చేత చెప్పబడిన మహాభారతాన్ని ఈ అక్షయ-తృతీయ నాడే రచించడం ప్రారంభించాడని అందరూ నమ్ముతారు.

భారతదేశంలో నేటికీ ఆచరించబడుతున్న సనాతన సంప్రదాయాలు ఈరోజే ప్రారంభమైనదిగా ఉంది, కాబట్టి ఈ రోజును చాలా పవిత్రమైన రోజుగా ప్రజలందరూ భావిస్తారు.

పాండవుల విజయాన్ని సూచిస్తుంది :

మహాభారతానికి, అక్షయ తృతీయకు సంబంధించిన మరొక కథనం ప్రాచుర్యంలో ఉంది. పాండవులు అక్షయ తృతీయనాడే ఒక చెట్టు క్రింద కనుగొన్న ఖగోళ ఆయుధాలతోనే, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు వ్యతిరేకంగా పోరాడి గెలిచారన్న ఒక కథనం విస్తృతంగా ప్రచారంలో ఉంది

కుబేరుని ప్రాశస్త్యం :

అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు గురించి అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది. శివ పురాణం ప్రకారము, కుబేరుడు తన సంపదను అన్నింటికీ శివ భగవానుడి నుంచి అందుకుని, లక్ష్మీదేవితో పాటు అతనూ కూడా సంపదలకు అధిపతి అయ్యాడు.

బంగారం కొనుగోలుకు ప్రాముఖ్యత:

"అక్షయ తృతీయ" వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు చాలా ముఖ్యమైనది. బంగారం & వెండిని కొనుగోలు చేసేందుకు ఈ రోజునే పవిత్రమైన రోజుగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారమును కొనుగోలు చేయడం వల్ల ఆ సంవత్సరమంతా శుభదాయకం, లాభదాయకంగా ఉంటుందని ప్రజల నమ్మకం.

ఒక కొత్త సంప్రదాయం ప్రారంభమైంది :

పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ అనేది త్రేతాయుగానికి అనగా శ్రీ రాముని యుగానికి చెందినది అని కూడా సూచిస్తుంది. ప్రజలు 'ధర్మ' మార్గమును అనుసరించిన కాలం ఇది.


అందువల్ల, అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున కొత్తగా మొదలుపెట్టే ఏ పనైనా, మీకు విజయమును & శ్రేయస్సు అందించి, మీ జీవితాన్ని మరింత గొప్పగా మారుస్తోంది.

మీరు ఈ రోజున ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు జపాలు, దానాలు, పితృతర్పణం, వంటి వాటిని ఆచరించడం ద్వారా దేవుడి ఆశీర్వాదాన్ని పొందడమే కాకుండా శాంతిని కూడా పొందగలుగుతారు.

English summary

Best Time To Perform The Akshaya Tritiya Puja | Timings To Perform The Akshaya Tritiya Puja

Best Time To Perform The Akshaya Tritiya Puja | Timings To Perform The Akshaya Tritiya Puja | Best Time To Perform Akshaya Tritiya Puja | Stories Related To Akshaya Tritiya,Read to know the best time to perform the Akshaya Tritiya puja this year and also know of few of the stories associated with it.