Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. మనసుకు ప్రశాంతతనిచ్చే ఈ ఆలయాలు కూడా!
హైదరాబాద్ అనగానే ఎవరికైనా ఫస్ట్ గుర్తుకొచ్చేది బిర్యానీ, చార్మినార్, ఐటీ హబ్. కానీ ఈ భాగ్యనగరంలో మనసుకు ప్రశాంతతను చేకూర్చే అనేక పురాతన ఆధునిక దేవాలయాలు కూడా ఉన్నాయి.
వీకెండ్ లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో కలిసి ఆధ్యాత్మిక విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి,హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని అద్భుతమైన ఆలయాలు స్వాగతం పలుకుతున్నాయి. మీరు తప్పక సందర్శించాల్సిన ఆ ఆలయాల వివరాలు, దర్శన సమయాలు ఇక్కడ ఉన్నాయి చూడండి.

బిర్లా మందిర్
హైదారాబద్ నగరం నడిబొడ్డున నౌబత్ పహాడ్ అనే చిన్న కొండపై పాలరాతి సౌధంగా మెరిసిపోతూ కనిపించే ఆలయమే బిర్లా మందిర్. ఇక్కడ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ గంటలు ఉండవు. కేవలం ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో ఈ ఆలయం మెరిసిపోతుంది.
దర్శన సమయాలు: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.
శ్రీ పెద్దమ్మతల్లి ఆలయం
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో వెలసిన శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా బోనాల పండుగ సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి అలంకరణ, ఆలయ ప్రాంగణం భక్తులకు ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పెద్దమ్మ తల్లి పూజలందుకుంటోంది.
దర్శన సమయాలు: ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.
జగన్నాధ ఆలయం
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయాన్ని తలపించేలా హైదరాబాద్ లో నిర్మించిన అద్భుత ఆలయం ఇది. ఐడీఏ బొల్లారం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం, తనదైన శిల్పకళతో భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు,సుభద్ర దేవిలను దర్శించుకోవడం కనుల పండుగగా ఉంటుంది. ప్రశాంతత కోరుకునే వారికి ఇది సరైన గమ్యస్థానం.
దర్శన సమయాలు: ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు.
నరసింహస్వామి ఆలయం
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరి గుట్ట క్షేత్రం ఇప్పుడు సరికొత్త హంగులతో అలరారుతోంది. నల్లరాతి శిల్పకళ, బ్రహ్మాండమైన గోపురాలు భక్తులను మైమరిపిస్తాయి. స్వయంభువుగా వెలసిన లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. హైదరాబాద్ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం తప్పక చూడాల్సిన ప్రదేశం.
దర్శన సమయాలు: ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు (నిరంతర దర్శనం).
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి
ఇటీవల కాలంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న మరో క్షేత్రం స్వర్ణగిరి. యాదాద్రికి వెళ్లే మార్గంలో భువనగిరి సమీపంలో ఈ ఆలయం ఉంది. మానేపల్లి జ్యువెలర్స్ కుటుంబం నిర్మించిన ఈ ఆలయం తన నిర్మాణ శైలితో, భారీ విగ్రహంతో భక్తులను కట్టిపడేస్తోంది. ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన ఆర్కిటెక్చర్ చూడాలనుకునే వారు ఇక్కడికి వెళ్లాల్సిందే.
దర్శన సమయాలు: ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.

సంఘీ టెంపుల్
ఎత్తైన కొండపై, పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరంగా ఉండే ఆలయం సంఘీ టెంపుల్. చోళ, చాళుక్యుల శిల్పకళా రీతిలో నిర్మించిన ఈ ఆలయంలో వేంకటేశ్వర స్వామి ప్రధాన దైవం. హైదరాబాద్ శివార్లలో ఉండే ఈ ఆలయానికి వెళ్లే దారి, అక్కడి వాతావరణం పర్యాటకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. సినిమా షూటింగ్లకు కూడా ఇది ప్రసిద్ధి.
దర్శన సమయాలు: ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.



Click it and Unblock the Notifications