For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భాద్రపద మాసం విశిష్టత ఏంటో తెలుసుకుందామా...

భాద్రపద మాసం 2021లో వచ్చే పండుగలు మరియు వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, భాద్ర మాసం ఎంతో విశిష్టత కలది. ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసం వర్షరుతువులో వస్తుంది.

Bhadra Mahina 2021: Dates, Festivals and Vrats in Bhadrapada Masam

ఈ నెలలో రెండు విశేషాలు ఉన్నాయి. శుక్ల పక్షంలో అంతా దేవతలకు, పూజలకు, వ్రతాలకు ప్రాధాన్యమిస్తారు. క్రిష్ణ పక్ష కాలంలో పిత్రు దేవతలకు నెలవైన మాసంగా పండితులు చెబుతారు. సాధారణంగా దుష్ట శిక్షణ చేయడానికి శిష్ట రక్షణ చేయడానికి దశావతారాలు ఎత్తాడనే విషయం అందరికీ తెలుసు.

Bhadra Mahina 2021: Dates, Festivals and Vrats in Bhadrapada Masam

ఆ దశావతరాల్లోని వరాహ అవతారం, వామన అవతార పూజలు ఈ మాసంలోనే చేస్తారు. అందుకే ఈ నెలలో దశావతార వ్రతం చేయాలంటారు. ఈ మాసంలో ముందుగా వచ్చే పండుగ వినాయక చతుర్థి. ఇదే నెలలో వామన జయంతి, రుషి పంచమి, ఉండ్రాళ్ల తద్దె, పిత్రు దేవతలకు ఉత్తమ గతులు కల్పించే మహాలయ పక్షంగా పండితులు చెబుతారు. ఇదే మాసంలో రాధా క్రిష్ఠాష్టమిని కూడా జరుపుకుంటారు.

Ganesh Chaturthi Special:వినాయక ప్రతిమలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా...Ganesh Chaturthi Special:వినాయక ప్రతిమలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా...

వినాయక చవితి..

వినాయక చవితి..

ఈ మాసంలో ముందుగా వచ్చేది వినాయక చవితి. మనం ఏ పూజ చేసినా.. తొలిగా ఆరాధించేది గణేశుడినే. వినాయకుడు పుట్టినరోజునే గణపతి పండుగ జరుపుకుంటారు. ఇప్పటికే వినాయక ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజను తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో 21 రకాల పత్రాలతో పూజించి ఉండ్రాళ్లు, కుడుములతో పాటు లడ్డూను నైవేద్యంగా పెడతారు. విద్యార్థులు పుస్తకాలను పెట్టి పూజిస్తారు.

ఏకాదశి..

ఏకాదశి..

ఈ మాసంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి నాడు అనగా ఆషాఢ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఈరోజున వేరే వైపునకు తిరుగుతాడు అనగా పరివర్తనం చెందుతాడు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కరువు కాటకాలు రావని ఒకవేళ వచ్చినా వాటి నుండి ఎలా బయటపడాలో తెలుస్తుందని పండితులు చెబుతున్నారు.

శుక్ల ద్వాదశి..

శుక్ల ద్వాదశి..

ఈ మాసంలో వామన జయంతి, దశావతారాల్లో ఒక అవతారం. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించిన అవతారం. ఈరోజున వామనపూజ చేసి నైవేద్యం పెట్టి పెరుగును దానం చేయాలని చెబుతారు. ఈరోజున విష్ణువు ఆలయంలో ప్రదక్షిణలు చేయడం, విష్ణుమూర్తికి చామంతి పువ్వులు, మల్లెపువ్వులు లేదా పసుపు పచ్చని పూలతో పూజించడం చాలా మంచిది. భూదానం వంటివి చేసుకునేవాళ్లు ఈరోజు భూదాన నిమిత్తం ధనం కూడా దానం చేసుకోవచ్చు.

<strong>Ganesh Visarjan 2021:గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేస్తారు?</strong></p><p>Ganesh Visarjan 2021:గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేస్తారు?

చతుర్దశి..

చతుర్దశి..

ఇదే నెలలో అనంత పద్మనాభ చతుర్దశి. ఇది కూడా విష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈరోజున అనంత పద్మనాభ చతుర్దశి లేదా అనంతవ్రతం అనే పేర్లతో పిలుస్తారు.

అజ ఏకాదశి..

అజ ఏకాదశి..

భాద్రపద మాసంలో వచ్చే ఈ ఏకాదశినే ధర్మ ప్రభ ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీన్ని పూర్వ కాలంలో హరిశ్చంద్రుడు ఆచరించాడని పెద్దలు చెబుతుంటారు. హరిశ్చంద్రుడు సర్వం కోల్పోయి కాటికాపరిగా ఉన్న సమయంలో ఈ ఏకాదశి రోజున వ్రతం చేయడం వల్ల తిరిగి తన ధనం, ఐశ్వర్యం, రాజ్యభోగాలు పొందాడని పండితులు చెబుతారు. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేయాలని సూచిస్తుంది.

మహాలయ పక్షం..

మహాలయ పక్షం..

ఈ మాసంలో క్రిష్ణ పక్షంలో పాడ్యమి ప్రారంభం అమావాస్య వరకు వచ్చిన కాలాన్ని మహాలయ పక్షం అంటారు. ఈ కాలంలో పిత్రు దేవతలకు పిండ ప్రదానములు, తర్పణాలు ఇవ్వడం వంటివి చేయాలి. తర్పణాలు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో విడిచిపెట్టి తర్వాత భోజనం చేయొచ్చు. ఈ మహాలయ పక్షంలో పిత్రు దేవతలను తలచుకుని నువ్వులు, బియ్యం వంటివి దానం చేస్తే మంచిది. అలాగే ప్రతి రోజూ ఏదో ఒక కూరగాయను దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

FAQ's
  • భాద్రపద మాసం ప్రత్యేకతలేంటి?

    హిందూ క్యాలెండర్ ప్రకారం, భాద్ర మాసం ఎంతో విశిష్టత కలది. ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసం వర్షరుతువులో వస్తుంది. ఈ నెలలో రెండు విశేషాలు ఉన్నాయి. శుక్ల పక్షంలో అంతా దేవతలకు, పూజలకు, వ్రతాలకు ప్రాధాన్యమిస్తారు.ఈ మాసంలో ముందుగా వచ్చే పండుగ వినాయక చతుర్థి. ఇదే నెలలో వామన జయంతి, రుషి పంచమి, ఉండ్రాళ్ల తద్దె, పిత్రు దేవతలకు ఉత్తమ గతులు కల్పించే మహాలయ పక్షంగా పండితులు చెబుతారు. ఇదే మాసంలో రాధా క్రిష్ఠాష్టమిని కూడా జరుపుకుంటారు.

English summary

Bhadra Mahina 2021: Dates, Festivals and Vrats in Bhadrapada Masam

Here we are talking bhadra masam 2021:Dates, festivals and vrats in bhadrapada masam. Read on
Desktop Bottom Promotion