For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bhadrapada Masam 2021 : దోషాలు తొలగిపోవడానికి భాద్రపద మాసంలో ఏమి చేయాలంటే...!

భాద్రపద మాసం 2021 యొక్క ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం పూర్వభాద్ర లేక ఉత్తరాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉండే మాసాన్ని భాద్రపద మాసం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వర్షరుతువులో వస్తుంది. ఈ మాసంలో రెండు ముఖ్యమైన విశేషాలున్నాయి.

Bhadrapada Masam : Bhadrapada Amavaasya importance & significance

మొదటగా శుక్ల పక్షంలో దేవతలకు, పూజలకు, నోములకు వ్రతాలకు ప్రాధాన్యత ఇస్తే, రెండోదైన కృష్ణపక్షంలో పితృదేవతలకు అనుకూలమైన మాసంగా పరిగణిస్తారు.

Bhadrapada Masam : Bhadrapada Amavaasya importance & significance

పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు దుష్టులను శిక్షించడానికి పది అవతారాలు ఎత్తాడనే విషయం చాలా మందికి తెలుసు. అయితే అందులోని వరహా, వామన అవతారానికి ఈ మాసంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలంటారు పండితులు.

Bhadrapada Masam : Bhadrapada Amavaasya importance & significance

ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున రాధాక్రిష్ణుల ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఈరోజునే రాధాష్టమి అంటారు. ఈరోజున ప్రేమికులకు అనుకూలంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఈ సమయంలో వివాహం చేసుకున్న వారికి వైవాహిక జీవన సౌఖ్యం కూడా లభిస్తుందని, దంపతుల మధ్య అనురాగం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Bhadrapada Masam : Bhadrapada Amavaasya importance & significance

అలాగే ఈ భాద్రపద మాసంలో మహిళలు చేసే వ్రతాలు హరితాళిక, సువర్ణగౌరీ, పదహారు కుడుముల తదియ వంటి వాటితో పాటు ఇతర వ్రతాలను కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఇంకా ఏయే పనులు చేస్తారు.. ఏయే వ్రతాలు చేస్తే దోషాలు తొలగిపోతాయి.. మీకు శాంతి, విముక్తి లభించడానికి ఏమి చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సింహరాశిలోకి సూర్యుడి సంచారం.. ఈ సమయంలో 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!సింహరాశిలోకి సూర్యుడి సంచారం.. ఈ సమయంలో 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

ఈ మాసంలో

ఈ మాసంలో

భాద్రపద అమావాస్య హిందువులకు ఎంతో ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున హిందువులలో చాలా మంది తెల్లవారుజామునే స్నానం చేసి, దేవుడికి పూజలు చేసి, దానధర్మాల అనంతరం పూర్వీకులకు(తల్లిదండ్రులు, అవ్వతాతలకు) నైవేద్యం సమర్పిస్తారు.

పూర్వీకుల శాంతి కోసం..

పూర్వీకుల శాంతి కోసం..

భాద్రపద అమావాస్య రోజున ఉదయాన్నే పవిత్రమైన నది, సరస్సు లేదా చెరువులో స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయాలి. అనంతరం నది ఒడ్డున మీ పూర్వీకులకు పిండ ప్రదానం(నైవేద్యం) సమర్పించాలి. అలాగే పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులకు శాంతి, మీకు విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

శనిదేవుని పూజ..

శనిదేవుని పూజ..

ఈ అమావాస్య రోజున చాలా మంది శనిదేవుడిని కూడా పూజిస్తారు. అలాగే ఈ పవిత్రమైన రోజు సాయంత్రం వేళలో రావి చెట్టుకు కింద ఆవగింజల నూనెతో దీపం వెలిగించి, మీ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ.. ఆ చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

ధోనీ రిటైర్మెంటుకు ముందు వెళ్లిన ఈ ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసా...ధోనీ రిటైర్మెంటుకు ముందు వెళ్లిన ఈ ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసా...

చవితి ముందురోజున..

చవితి ముందురోజున..

ఈ మాసంలో స్త్రీలు హరితాళిక, సువర్ణగౌరీ, పదహారు కుడుముల తదియ వంటి నోములతో పాటు ఇతర వ్రతాలను చవితి ముందు రోజున అనగా 21.8.2020న వేర్వేరు ప్రాంతాల్లో రకరకాలుగా జరుపుకుంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున ఉండే ఉపవాసం యొక్క సారాంశం ఒక్కటే. ఈ పవిత్రమైన రోజున ముత్తైదువుకుల వాయినాలు ఇవ్వడం అనవాయితీగా జరుపుకుంటారు.

మంచి భర్త కోసం..

మంచి భర్త కోసం..

చవితి రోజు అంటే వినాయకుడి పూజ ముందు రోజున వారి తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులకు పూజచేయడం అనేది ఆనవాయితీ. ఈ పూజలను వివాహం కాకముందు కన్యలుగా ఉండే అమ్మాయిలు చేస్తే, వారికి మంచి భర్త వస్తారని చాలా మంది నమ్మకం. వివాహం అయిన ముత్తైదువులు చేయడం వల్ల వారికి కలకాలం సౌభాగ్యం ఉంటుంది.

English summary

Bhadrapada Masam : Bhadrapada Amavaasya importance & significance

Here we talking about bhadrapada masam amavasya importance & significance. Read on.
Desktop Bottom Promotion