Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! -
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే!
Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
భగవద్గీత హిందువుల పవిత్ర పుస్తకం మాత్రమే కాదు ఇది మానసిక బలానికి, వ్యక్తిత్వ వికాసానికి, ఇంకా చాలా పరిశోధనలకు ఈ పుస్తకం ఉపయోగపడుతోంది. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం సమయంలో చేసిన బోధనలుంటాయన్న విషయం మనకు తెలిసిందే. జీవితానికి అవసరమైనవన్నీ భగవద్గీతో ఉన్నాయ్. పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు మళ్లీ జన్మించక తప్పదు, అనివార్యమగు ఈ విషయము గూర్చి శోకింప తగదు అని భగవద్గీత శ్లోక అర్థాన్ని ఘంటసాల చెప్పడం అందరు తెలుగువారు తప్పకుండా విని ఉంటారు. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ఎంపిక చేసి మీకోసం అందిస్తున్నాం. వీటిని మీ శ్రేయుభిలాషులకు పంపుకోండి.
భగవద్గీత శ్లోకాలు
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||
భావము: ఆత్మను ఏదీ నాశనం చెయ్యలేదు. అగ్ని, నీరు, గాలి ఏవి కూడా ఆత్మను నశింపజేయలేవు.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే உర్థేన త్వం శోచితుమర్హసి ||
భావము: ఈ భూమిపై పుట్టిన వారు చనిపోతారు. మరణించిన వారు మళ్లీ పుడుతారు. ఈ జీవిన మరణ చక్రం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎక్కువగా చింతవద్దు.
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।।
భావము: సుఖం దుఖం, లాభం నష్టం వాటి గురించి ఆలోచించకుండా తమ పని తాము చేసుకొని పోతే వారికి ఏ పాపము అంటదని భావం.
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ।।
భావము: యుద్ధాన్ని చేయడం ఆపితే పాపం చేసిన వాడవవుతావు. యుద్ధం చేయడం నీ ధర్మం అని చెబుతున్నారు.
ధ్యాయతో విషయాన్పుంస: సఙ్గస్తేషూపజాయతే |
సఙ్గాత్సఞ్జాయతే కమ్: కామాత్క్రోధోధ్యభిజాయతే || 2.62||
ధ్యాయతో విషయాన్ పుష్పః సంఘం తేషూపజాయతే
సంగత్ సంజాయతే కామః కామత్ క్రోధో భిజాయతే
భావం : మనిషికి ఉన్న ఇంద్రియాల నుంచి కోరిక పుడుతుంది. ఆ కోరక తీరకుండా కోపంగా మిగిలిపోతుంది.

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మనః ॥ 6.5॥
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవాసదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః
భావం : ఎవరికి వారు సొంత ప్రయత్నంతో మనసును అదుపులో ఉంచుకోవాలి. ఉద్దరించుకోవాలన్నా, నాశనం కావాలన్నా అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయని భావం.



Click it and Unblock the Notifications