For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bhishma Ashtami:భీష్మాష్టమి ఎప్పుడు? భీష్మ పితామహుని ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

భీష్మాష్టమి తేదీ, ఆచారాలు, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుక్ల పక్షం అష్టమి తిథి నాడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఈరోజునే భీష్మ పితామహుడు మోక్షం పొందాడని పండితులు చెబుతుంటారు.

Bhishma Ashtami Date, Rituals, Significance in Telugu

అందుకే ఈరోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ 'భీష్మాష్టమి' జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతానం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తేదీన అంటే శుక్రవారం నాడు భీష్మాష్టమి వస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం, ఏ ఒక్కరు కూడా తమ తండ్రి ఉన్నప్పుడు పిండాలు పెట్టడానికి అర్హులుగా పరిగణించబడరు.

Bhishma Ashtami Date, Rituals, Significance in Telugu

అయితే భీష్మ తర్పణం విషయంలో మాత్రం ఆ పద్ధతిని అస్సలు పాటించరు. అంతటి గొప్ప ప్రాధాన్యత భీష్ముడికి ఉంది. భీష్మ పితామహుడు గొప్ప యోధుడు. మహాభారతంలో ఈ ముఖ్యమైన పాత్ర చారిత్రాత్మకంగా కూడా ప్రసిద్ధి చెందింది. రాబోయే తరాల వారు కూడా ఈయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా భీష్ముని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ రాశిని బట్టి ఇతరులను ఇష్టపడేలా చేసే 'ఆ' గుణమేంటో తెలుసా?మీ రాశిని బట్టి ఇతరులను ఇష్టపడేలా చేసే 'ఆ' గుణమేంటో తెలుసా?

భీష్మాష్టమి రోజున..

భీష్మాష్టమి రోజున..

ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.

పూజ తర్వాత..

పూజ తర్వాత..

భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజల అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.

భీష్ముడు కోరుకున్నప్పుడు..

భీష్ముడు కోరుకున్నప్పుడు..

పురాణాల ప్రకారం, భీష్ముడు శంతనుడు మరియు గంగల కుమారుడు. భీష్మ పితామహుడు తన తండ్రి శంతనుడి నుండి ఇచ్చా-ముత్యుని వరం పొందాడని, దాని ప్రకారం అతను కోరుకున్ననాడే మరణాన్ని పొందగలడు. అంతేతప్ప తన ఇష్టానికి విరుద్ధంగా ఎవ్వరూ చంపలేరు.

భీష్మ పితామహుని ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

భీష్మ పితామహుని ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

భీష్మ పితామహుడు మహాభారతంలో కౌరవుల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తమ జ్ణానం, శక్తి మంచి మరియు చెడులను అర్థం చేసుకున్నప్పటికీ, తాను అంపశయ్యపై పడుకున్నప్పుడు తన నిర్ణయానికి గల హేతువును వివరించాడు. తాను కౌరవులతో జీవిస్తున్నానని, వారి ఉప్పును కూడా తిన్నానని, ఉప్పు రుణం తీర్చుకోవడానికే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని అప్పట్లో భీష్ముడు వివరించారు. ఈ కారణంగా మహాభారతంలో పాండవులకు వ్యతిరేకంగా నిలిచాడు.

FAQ's

English summary

Bhishma Ashtami Date, Rituals, Significance in Telugu

Here we are talking about the bhisma ashtami date, rituals, significance in Telugu. Have a look
Story first published:Wednesday, February 9, 2022, 15:59 [IST]
Desktop Bottom Promotion