For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bhogi 2022:భోగి మంటలెందుకేస్తారు? భోగి పళ్ళ ఆచారం వెనుక ఉండే రహస్యాలేంటి?

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో ఏదో ఒక పండుగ అనేది వస్తూ.. పోతూ ఉంటుంది. అయితే ఏ పండుగ అయినా ఒకట్రెండు రోజులు లేదా మూడు రోజులు మహా అయితే వారం రోజుల పాటు జరుపుకుంటారు.

కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి సంబరాలు సుమారు నెల ముందే ప్రారంభమవుతాయి. ఈ పండుగ భోగి మంటలతో.. భోగి పళ్లతో మొదలవుతుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరి లోగిల్లో రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు.. బోగి మంటలతో పండుగ శోభను సంతరించుకుంటాయి.

వీటితో పాటు హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందేలు, కొత్త అల్లుళ్ల హడావుడి వంటి విశేషాలతో సంక్రాతి కాస్త సరదాగా మారిపోతుంది.

సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి పండుగగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2022లో జనవరి 14వ తేదీ భోగి పండుగ వచ్చింది. ఈ సందర్భంగా భోగి పండుగ రోజున మంటలెందుకేస్తారు.. చిన్నారులపై భోగి పళ్లను ఎందుకు పోస్తారనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Sankranthi Pandem Kollu:సంక్రాంతి సంబురాలు 'తగ్గేదే లే'..కోడి పందెలు ఆగేదేలే...

చివరి రోజు..

చివరి రోజు..

హిందూ పురాణాల ప్రకారం, సూర్యుడి దక్షిణ యానానికి చివరి రోజుగా భావిస్తారు. దీని కంటే మందు ప్రతి ఒక్కరూ తాము ఎదుర్కొన్న కష్టనష్టాలు, బాధలన్నీ మంటల రూపంలో పూర్తిగా తొలగిపోవాలని అగ్ని దేవుడిని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే భగ అనే పదం నుండి భోగి వచ్చిందంటారు.రాబోయే ఉత్తరయాన కాలంలో తమ సంపద, ఆరోగ్యం, శ్రయేస్సు పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

ధాన్య లక్ష్మీ..

ధాన్య లక్ష్మీ..

ఈ సమయంలో పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో నాలుగురోజుల పాటు జరుపుకునే ఈ పండుగను.. తెలంగాణలో మాత్రం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని నాలుగు రోజుల పాటు ఈ పండుగ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

భోగభాగ్యాలు కలగాలని..

భోగభాగ్యాలు కలగాలని..

భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి గ్రామాల్లోని వీధులలో, కూడళ్లలో భోగి మంటలు వేస్తారు. వీటితో పాటు ఈ పవిత్రమైన రోజున తమకు భోగభాగ్యాలు కలగాలని పిల్లలపై భోగిపళ్లు, పొంగలి తయారీ వంటివి రెడీ చేస్తారు. ఇదే కాదు.. మహా శివరాత్రికి ముందురోజున శివ భోగి అంటారు. నరక చతుర్దశి రోజు దీపావళి భోగి అంటారు. నవరాత్రుల వేళ దసరా భోగి అంటారు. దీంతో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

Makar Sankranti 2022:సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ప్రధాన కారణాలేంటో తెలుసా...

బ్రహ్మ రంధ్రం..

బ్రహ్మ రంధ్రం..

మనలో చాలా మందికి కంటికి కనిపించని బ్రహ్మరంధ్రం తలపై భాగంలో ఉంటుందని.. భోగి పండుగ వేళ.. భోగి పళ్లను తలపై పోవడం వల్ల ఈ బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమవుతుంది.. దీంతో పిల్లలు చురుగ్గా మారతారని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే రేగి పళ్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి వీటిని తలమీద పోవడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి, బాడీపైనా, ఆరోగ్యంపైనా మంచి ప్రభావాన్ని చూపి.. మంచి ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే భోగి పండుగ రోజున రేగి పళ్లు, పూలు, చిల్లరపైసలు నెత్తిన పోసి ఆశీర్వదిస్తారు.

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

రేగుపళ్లను ఇండియన్ డేట్, ఇండియన్ జుజుబీ అని పిలుస్తారు. రేగుపళ్ల ప్రస్తావన పురాణాలలో ఉంది. నారాయణులు బదరీ వృక్షంగా పిలువబడే రేగు చెట్టు దగ్గరే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారని.. అందుకే ఆ ప్రాంతానికి బదరీక్షేత్రం అని పేరు వచ్చిందని ప్రతీతి. భారతీయ వాతావరణంలో.. ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని రేగుచెట్టు పెరుగుతుందట. అలాగే సంక్రాతి సమయానికి రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పులుపు, తీపి రుచి కలిగిన ఇవి.. అమోఘమైన రుచినే కాదు.. ఆరోగ్యానికి మంచిదే. అందుకే పిల్లల తలపై భోగిపళ్లు పోసే సంప్రదాయానికి రేగుపళ్లనే ఎంచుకున్నారు.

భోగి మంటల పరమార్థం

భోగి మంటల పరమార్థం

ఈ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆరోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు. ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.

2022 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడొచ్చింది?

తెలుగు క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో భోగి పండుగ జనవరి 14వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది. ఈ పండుగ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ముందురోజున వస్తుంది. ఈ పవిత్రమైన రోజున తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు వేసి సంబరాలను ప్రారంభిస్తారు.

English summary

Bhogi 2022 Date, History, Why we celebrated and Significance in Telugu

Here we are discussing about the Bhogi 2022 date, history, why we celebrated and significance in Telugu. Read on
Story first published: Wednesday, January 12, 2022, 15:04 [IST]