For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lord Hanuman Birth Story:హనుమంతుని జన్మ రహస్యం గురించి తెలుసా...

|

రాముని భక్తుడైన హనుమంతుడిని హిందువులందరూ ఆదర్శనీయ దైవంగా భావిస్తారు. ఆంజనేయుడు, హనుమాన్, భజరంగబలి, మారుతీ, అంజనీసుతుడు, వానర వీరుడు, వాయుదేవుని సుతుడు, పరమ రామభక్తుడైన పవన పుత్రునికి ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి.

పురాణాల ప్రకారం శ్రీరామదాసునిగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయుడి పుట్టుక గురించి ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరికి వారే తమ ప్రాంతంలో హనుమంతుడు జన్మించారంటూ ఇతిహాసాలు, ఉపనిషనత్తులు, సంప్రదాయ గాథలు, కథలు ప్రచారంలోకి తెచ్చారు.

తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) హనుమంతునికి జన్మ రహస్యం గురించి పలు ఆధారాలను ప్రస్తావించింది. అయితే కర్నాటకలోనే హనుమంతుడు పుట్టాడని, పెరిగింది అంతా ఆ ప్రాంతంలోనే అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయుడి జన్మ రహస్యం గురించి వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Hanuman Jayanti 2021:ఆంజనేయుడిని ఎలా ఆరాధిస్తే.. ఆ స్వామి అనుగ్రహం లభిస్తుందంటే...

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

హనుమంతుని తల్లి అంజనా దేవి, కేసరి అనే జంటకు కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపస్సుకు భంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్లు ముడుచుకుని ద్యానం చేసుకుంటున్న కోతిని చూసి, ఆశ్చర్యంతో ఉత్సాహ భరితంగా, చిన్న పిల్ల అయిన అంజనా దేవి కోతిపై పండ్లు విసిరింది. దీంతో తన ధ్యానానికి భంగం కలిగిందని.. కోతి రూపంలో ఉన్న ముని నిజరూపంలో వచ్చి కోపంతో అంజనను, ఆమెతో ఎవరైనా ప్రేమలో పడినా.. పెళ్లాడినా వారు కోతిగా మారతారని శాపం ఇచ్చారు.

మునిని వేడుకొనగా..

మునిని వేడుకొనగా..

అయితే అంజనా దేవి తాను చేసిన తప్పు తెలుసుకుని తనను క్షమించమని వేడుకొనగా.. ఆ ముని శాంతించి కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో, శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు తన శాపం నుండి విముక్తి లభిస్తుందని వరమిచ్చాడు.

అడవిలో ఓ రోజు..

అడవిలో ఓ రోజు..

తన శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదకు వచ్చింది. ఓ అడవిలో నివాసముండగా.. ఓ రోజు ఒక మగాడిని చూసి ప్రేమలో పడుతుంది. ఆ క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. ఆ మనిషి తన పేరు ‘కేసరి' అని, కోతులకు రారాజు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది.

Hanuman Jayanti 2021 : ఈ ఏడాది హనుమాన్ జయంతి ప్రత్యేకమైనది.. ఎందుకో తెలుసా...

తనను పెళ్లి చేసుకోవాలని..

తనను పెళ్లి చేసుకోవాలని..

అతని శక్తులను చూసి ఆశ్చర్యపోయిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలని వేడుకొంది. ఆమె వినతితో కేసరి అంజనాను అడవిలోనే వివాహం చేసుకున్నారు. అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది. ఇందుకు సంతోషించిన శివుడు ఆమె కోరిన కోరికలను నెరవేరుస్తా అన్నాడు. అప్పుడు ఆ తల్లి ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. పరమేశ్వరుడు తన అభ్యర్థనను ఆమోదించాడు.

చరిత్రను పరిశీలిస్తే..

చరిత్రను పరిశీలిస్తే..

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఇక్కడ హనుమంతునికి ఐదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. తిరుమల కొండపై జాపాలి, కడప జిల్లా గండి, కరీంనగర్ జిల్లా కొండగట్టు, పశ్చిమ గోదావరి జిల్లా మద్ది, మద్దిమడుగు క్షేత్రాలలో హనుమంతుడు స్వయంభువుగా వెలిశాడని చాలా మంది భక్తుల నమ్మకం. అయితే తాజాగా తిరుమల గిరుల్లోనే హనుమంతుడు జన్మించాడని.. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను టిటిడి శ్రీరామ నవమి రోజున విడుదల చేసింది.

జాపాలి తీర్థంలో..

జాపాలి తీర్థంలో..

అంజనీ దేవి బాల ఆంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా జాపాలి అని చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ లోని పవిత్రమైన తిరుమల ఏడు కొండల్లో ఒక్కటైన అంజనాద్రిపై జాపాలి తీర్థంలో హనుమంతుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. పవన సుతుడు ఇక్కడే పుట్టినట్లు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తోంది. హనుమంతుడి పుట్టుక ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టే.. ఈ ప్రాంతం అంజనాద్రి అనే ప్రసిద్ధి చెందిందని ఇతి హాసాలు చెబుతున్నాయి.

ఓ గ్రంథం..

ఓ గ్రంథం..

తిరుమలలోని జాపాలి తీర్థంలోనే హనుమంతుడు జన్మించినట్లు చాలా మంది భక్తులు బలంగా నమ్ముతారు. శ్రీ హనుమ స్థలం-అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవీఎస్ జీ హనుమత్ ప్రసాద్ ఓ గ్రంథం కూడా రాశారు. హనుమంతుని చరిత్రకు శ్రీపరాశర సంహిత అనే గ్రంథం ప్రామాణికం కాగా.. స్కంద పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారని హనుమత్ ప్రసాద్ తన పుస్తకంలో వివరించారు.

కర్నాకటలోనూ..

కర్నాకటలోనూ..

ఇదిలా ఉండగా.. ఆంజనేయుడు ఆంధ్రాలో కాదు.. కర్నాటకలోనే జన్మించారనే వాదన కూడా ఉంది. హనుమంతుడు అరేబియా సముద్రం ఒడ్డున జన్మించారని, శివమొగ్గ రామంచంద్రపుర మఠం అధిపతి రాఘవేశ్వర భారతి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రామాయణంలో సీతకు ఆంజనేయుడు ఇదే విషయాన్ని వివరించారని భారతి చెబుతున్నారు. గోకర్ణను హనుమాన్ జన్మభూమి అని, కిష్కిందను తన కర్మభూమి అని కన్నడీగులు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లోనూ..

ఇతర రాష్ట్రాల్లోనూ..

మరోవైపు హనుమంతుడు తమ రాష్ట్రాలలో జన్మించాడని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆంజనేయుడికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండటంతో.. ఆ స్వామి పుట్టిన ప్రదేశం అదేనని చాలా మంది భావిస్తున్నారు.

English summary

Birth Story of Lord Hanuman in Telugu

Check out the details birth story of lord hanuman in Telugu. Read on
Story first published: Tuesday, April 27, 2021, 10:30 [IST]