For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bonalu Festival:తొలి బోనం గోల్కొండలో.. మరి రెండో బోనం ఎక్కడంటే...

బోనాల పండుగ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగలు.. బోనాల పండుగ, బతుకమ్మ పండుగ. బోనాల పండుగ అంటే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు.

Bonalu Festival, Telangana Date, Importance, Significance and all about festival in Telugu

ఇప్పుడంటే హైదరబాదంతా బోనాలు ఫేమస్ అయినయి గానీ.. పూర్వకాలంలో ప్రతి ఊళ్లోనూ ఈ పండుగను మస్తుగా జరుపుకునేటోళ్లట. ఇప్పుడేమో తెలంగాణ సర్కారు ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున బోనాలు పండుగ ప్రారంభమవుతుంది.

Bonalu Festival, Telangana Date, Importance, Significance and all about festival in Telugu

ఈ సమయంలో గ్రామ దేవతలైనా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్కా చెల్లెళ్లు. కాగా వీరికి తమ్ముడు పోతురాజు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో బోనాల పండుగ అంటే గోల్కొండ కోటనే అందరికీ గుర్తొస్తది. ఈ కోట నుండి అమ్మవారు ముందుగా బైలెల్లితారు. ఈడ బోనం షురు అయినంకే.. ఇతర చట్ల బోనం ఎత్తుకుంటారు. అయితే తొలి బోనాన్ని గోల్కొండ నుండే ఎత్తుకుంటారు. అయితే ఇక్కడి నుండే బోనాల పండుగ ఎందుకు ప్రారంభమవుతుంది...హైదరాబాద్ నగరంలోని నాలుగు వారాలు ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఎందుకని బోనాలు పండుగను మస్తుగా నిర్వహిస్తారనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బోనాల పండుగ...

బోనాల పండుగ...

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగలలో బోనాల పండుగ ఒకటి. ఈ బోనాల జాతరని హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో మస్తుగా జరుపుకుంటారు. మొదలు గోల్కోండలో ఉన్న జగదాంబిక ఆలయంలో మొదటి బోనం ఎత్తుతరు. ఆ తర్వాతే ఇతర చోట్ల బోనాల ఉత్సవాలు షురు అవుతాయి. ఈ ఆషాఢమంతా ఆదివారం, గురువారం నాడు బోనాల పండుగను ఒక్కోచోట ఒక్కో రకంగా జరుపుకుంటారు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించేదే బోనం.

వేల సంవత్సరాల ఏళ్ల చరిత్ర..

వేల సంవత్సరాల ఏళ్ల చరిత్ర..

గోల్కొండ కోటలో జరిగే బోనాల పండుగకు దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. చరిత్ర ప్రకారం.. కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు చెబతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం పాలకులు సైతం ఇక్కడ పూజలు జరుపుకోవడానికి అనుమతులు ఇచ్చారు. హైదరాబాద్ లోని అమ్మవారి అతి పురాతన ఆలయంగా జగందాంబిక ఆలయమని చెబుతారు. అందుకే ఇక్కడ తొలి బోనం సమర్పిస్తారు.

రెండో బోనం..

రెండో బోనం..

తొలి బోనాన్ని గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ఎత్తితే.. రెండో బోనాన్ని బల్కంపేట రేణుక ఎలమ్మ ఆలయంలో ఎత్తుతరు. మూడో వారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. బ్రిటీష్ కాలంలో ఇదే ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటీష్ సైన్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలోనే హైదరాబాదులో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఆ వార్త తెలిసిన అతను, తన సహోద్యోగులు కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకుని,అక్కడ ఆ వ్యాధి తగ్గితే.. ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు. అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆ తర్వాత 1815లో ఆయన నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటిసంది ఆషాఢ మాసంలో బోనాల జాతర మస్తుగా జరుగుతుంది.

ఇతర దేశాల్లో..

ఇతర దేశాల్లో..

తెలంగాణలో చేసుకునే ప్రతి పండగకు కూడా ఒక చార్రిత్రక నేపథ్యం ఉంటుంది. ఒక శాస్త్రీయత ఉంటుంది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే మాదిరిగానే పండుగలుంటాయి. డప్పులు, తాళాల మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆడోళ్లు. ఈ పండుగకు దేశవిదేశాల్లోనూ ఒక పేరుంది. పక్కదేశపుటోళ్లు కూడా మన బోనాలు పండుగ చేసుకుంటారు.

గోల్కొండ కోట దగ్గర మొదట బోనాలు ఎందుకు ఎత్తుతారంటే! ముస్లిం పాలకులూ గౌరవించారు, వెయ్యేళ్ల చరిత్రగోల్కొండ కోట దగ్గర మొదట బోనాలు ఎందుకు ఎత్తుతారంటే! ముస్లిం పాలకులూ గౌరవించారు, వెయ్యేళ్ల చరిత్ర

అమ్మవారు పుట్టింటికి..

అమ్మవారు పుట్టింటికి..

అమ్మవార్లు ఈ సమయంలో పుట్టిళ్లకు వస్తారని నమ్మకం. అందుకే బోనాన్ని వండి అమ్మవారికి నివేదించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనం సమర్పిస్తారు. దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆషాఢమంటేనే వానకాలం. ఈ కాలంలో ఏవేవో రోగాలు ప్రబలుతుంటాయి. అవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లంగా సూడు తల్లీ అని అమ్మకు మొక్కేందుకే బోనం పండుగ చేసుకుంటారు. బోనం కుండకు పసుపు పూస్తరు. వేప ఆకులు కడ్తరు. వీటి వల్ల బ్యాక్టీరియాను, వైరస్ ను చనిపోతాయి.

కాకతీయుల కాలం నుండి..

కాకతీయుల కాలం నుండి..

అట్ల అప్పటి నుంచి ఇప్పటి దాకా అంటువ్యాధులనేవి అమ్మవారు కోప్పడితేనే వస్తాయని ఆమెను శాంతపరచాలని బోనాల పండుగను గతంలో గోల్కొండ కోట దగ్గర మొదలుపెట్టినారంట. అట్ల అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆచారం పాటిస్తున్నారు. కాకతీయుల కాలంలో ఈ ఆచారం మొదలైంది. అమ్మవారి ఎదుట అన్నంపోసి తల్లీ ఎలాంటి రోగాలు రాకుండా మమ్మల్ని సుభిక్షింగా చూడు అని వేడుకునేటోళ్లు. అలా చేయడం వల్లే అమ్మవార్లు మనల్ని కాపాడుతున్నారని ఒక నమ్మకం. మన నమ్మకాన్ని, మన సంస్కృతిని గౌరవించుకోవాలి. ఇలాంటి పండుగలను గొప్పగా చేసుకోవాలి. తరతరాలుగా వస్తున్న ఆచారానికి కచ్చితంగా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని గుర్తించుకోవాలి.

పోతురాజు..

పోతురాజు..

ఏడుగురు అక్కాచెల్లెళ్ల అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర ప్రారంభమవుతుంది. ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి మూసీనదిలో నిమజ్జనం చేస్తారు.

చివరగా రంగం..

చివరగా రంగం..

బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా వివాహం కానీ ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది.. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

All Images Credited To Twitter

English summary

Bonalu Festival, Telangana Date, Importance, Significance and all about festival in Telugu

Here we are talking about the bonalu festival, telangan date, importance, significance and all about festival in Telugu. Have a look
Story first published:Monday, July 12, 2021, 16:12 [IST]
Desktop Bottom Promotion