For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామునికి హనుమంతునికి మద్య ఉన్న అవినాభావ సంబంధం

|

రామాయణం చదువుతున్న వారు ఎవరైనా రామాంజనేయుల సంబంధాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేరు. రాముడు సాధించిన అనేక విజయాలకు హనుమంతుడే ప్రధాన కారణం అని లోకవిదితమే.

అంతగా హనుమంతుడు తన యజమాని

రామునిపట్ల అంకితభావాన్ని కనపరిచాడు. రాముని భార్య సీతా దేవి గౌరవాన్ని కాపాడుటకై అనేక ఇబ్బందులను సైతం ఎదుర్కుని భక్తికే ఆదర్శప్రాయంగా నిలిచాడు హనుమంతుడు. ఇప్పటికీ లంకాదహనం వంటి ప్రసిద్దకథలు చలామణీలో ఉన్నాయి అంటే హనుమంతుని ప్రాముఖ్యత ఎంతలా హిందువులలో మమేకమై ఉందో అర్ధమవుతూనే ఉంది.

Bond Between Lord Rama And Hanuman

కానీ అనేకమందికి వీరిరువురి మద్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిపే అతి తక్కువ ప్రాచుర్యంలో ఉన్న కథలు తెలీవు. కావున ఈ కథనంలో కొన్ని కథలను పొందుపరచడం జరిగినది. ఈ కథలు రామాంజనేయుల పరిపూర్ణ అనుబంధాన్ని మరియు దైవానికి భక్తునికి ఉండే అత్యంత విశిష్టమైన సంబంధాన్ని తెలిపేవిలా ఉంటాయి. ఈ అనుభంధం కారణంగానే ప్రపంచమంతా వీరిని ఇంకనూ ఆరాధిస్తూనే ఉంది అనడం అతిశయోక్తి కాదు.
Bond Between Lord Rama And Hanuman

రామాంజనేయుల మొదటి పరిచయం:
మనందరికీ తెలిసిన విషయం ప్రకారం, మానవ జాతి ఆపదలో కూరుకున్న ప్రతి సమయాన విష్ణువు తన వేరు వేరు అవతారాలలో భూమిపై అవతరించి దుష్టులను వధించి, మానవజాతిని, మరియు భూగోళాన్ని కాపాడాడు. ఈ అవతారాల్లో ఒక ప్రసిద్దమైన అవతారం రామావతారం. ఈ రామావతారానికి ప్రధాన కారణం శివుడు, విష్ణువుని ఈ రూపంలో చూడాలని కోరుకోవడమే.

రాముడు దశరధుని కుమారుడు, దశరధుని తర్వాత రాజ్య భారం తీసుకోవలసిన వారు. ఒకనాడు శివుడు, మధారి వేషధారణలో ఒక కోతిని తీసుకుని వెళ్ళి రాముల వారి ముందు ప్రదర్శనను ఇవ్వాలని సంకల్పించాడు. శివునితో ఉన్న ఈ మారుతే అంజనా దేవి సుతుడు, అంజనీ పుత్రుడు హనుమంతుడు. అడిగిన వారు అపరశక్తి సంపూర్ణుడైన శివునిగా గుర్తించిన అంజనా దేవి తన కొడుకుని ఇచ్చుటకు మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది. రాముని ముందు చేసిన ప్రదర్శనకు ముగ్ధుడైన రాముడు ఆ మారుతిని దరికితీసి చేరదీసినాడు. అప్పటి నుండి రామునికి చిన్నతనం లో హనుమంతుడు ఒక తోడుగా నీడగా ఉండినాడు. అటుపిమ్మట రాముడు విద్యాభ్యాసం కొరకు విశ్వామిత్రుని గురుకులంలో చేరిన పిదప, హనుమంతుడు అయోద్యని వీడి కిష్కింధలోని వాలి సుగ్రీవుల చెంతకు చేరినాడు.

Bond Between Lord Rama And Hanuman


కిష్కింధలో తిరిగి రాముని కడకు:
సీతని దూరం చేసుకున్న రాముడు , లక్ష్మణునితో కలిసి సుగ్రీవ సహాయార్ధం వచ్చినప్పుడు, సుగ్రీవుడు తన అన్న వాలి తనను వధించుటకు పంపిన వారిలా భావించి, వారి గురించి తెలుసుకొనమని హనుమంతుని పంపిస్తాడు. ధుoధుభి –వాలి సంగ్రామంలో వాలి వధించబడ్డాడని అపోహపడిన సుగ్రీవుడు, తిరిగి రాజ్యానికి చేరుకుని రాజ్యపాలన నిమిత్తం సింహాసనాన్ని అధిష్టించాడు. ధుoధుభిని సంహరించి అక్కడికి వచ్చిన వాలి, సుగ్రీవుని చూచి కోపోద్రిక్తుడై సింహాసనo నుండి దింపి, సుగ్రీవుని భార్యని చెరపట్టి, సుగ్రీవుని వధింప చూడగా, అచట నుండి పారిపోయిన సుగ్రీవుడు వాలికి శాపమిచ్చిన ఋష్యముఖపర్వతంపై చేరాడు. శాపవశాత్తు వాలి ఆ పర్వతo పై అడుగు పెట్టిన వెంటనే తల వేయి వక్కలు అవుతుంది. ఈ శాపానికి భయపడిన వాలి, ఆ పర్వతం ఛాయలకు కూడా రాజాలడు. ఇందునిమిత్తం వేరే మనుషులను తనను వధించుటకు పురమాయించాడు అన్న అనుమానంతో ఆ పర్వతo కడకు వచ్చిన రామ లక్ష్మణుల వద్దకు, హనుమంతుని వివరములను తెలుసుకుని రమ్మని పంపించినాడు.

అప్పుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళిన హనుమంతుడు, వారి వివరములు అడిగి తెలుసుకుని తన దేవుడు రామునిగా గుర్తించి పాదాలపై పడి తన భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు. ఆ తర్వాత రాముల వారిని సుగ్రీవుని కడకు తీసుకుని వెళ్ళినాడు.

హనుమంతుని భక్తి ప్రపత్తులు :

14 సంవత్సరాల అరణ్య వాసమును పూర్తిచేసుకుని వచ్చిన రాముడు అయోద్య రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ప్రజలు ఆనందోత్సాహలతో పండుగలను చేసుకుంటున్న సందర్భంలో , సీతా దేవి హనుమంతునికి అందమైన తెల్లటి ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. హనుమంతుడు ఆ హారంలోని ప్రతి ముత్యాన్ని కొరికి ముక్కలు చెయ్యడం ప్రారంభించాడు. ఆగ్రహించిన సీతాదేవి కారణం అడగగా, ఆ ముత్యాలలో ఎక్కడా తనకు రాముడు కనపడలేదని బదులిచ్చాడు. అంత భక్తి కలిగి ఉన్నాడో లేదో నిరూపించుటకై తన ఛాతీ తెరిచి రాముని రూపాన్ని చూపినాడు. దీనికి సంతోషించిన రాముడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ చిరంజీవికమ్మని దీవించారు.

Bond Between Lord Rama And Hanuman,

సింధూరం కథ:
హనుమంతుని సింధూర వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాము. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సహజం అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం, హనుమంతుడు సింధూర వర్ణములో తనను తాను మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన కథ ఇలా ఉంది: ఒకరోజు హనుమంతుడు, సీతా దేవి తన నుదిటిపై సింధూరం ధరించడం చూసి, ఆమెను ఎందుకు సింధూరం వినియోగించారు అని ప్రశ్నించినప్పుడు, ఆమె రాముని పై తన ప్రేమకు గౌరవ సూచకంగా రాసుకున్నట్లు వివరించింది. రాముని పై తన భక్తిని నిరూపించడానికి, హనుమంతుడు తన శరీరo మొత్తాన్ని సింధూరంతో కప్పాడు. ఇది తెలుసుకున్న తరువాత, రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు, భవిష్యత్తులో తనను ఆరాధించే వారు, వారి వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడాన్ని చూస్తారని.

మరణ శిక్ష కూడా హనుమంతుని భక్తి ముందు తలవంచాల్సిందే :
నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరకు వెళ్ళి, విశ్వామిత్రుని తప్ప, అందరు ఋషులకు అభివాదాలు తెలుపమని చెప్పాడు. దీనికి కారణం విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న కారణాన ఋషులకు ఇవ్వవలసిన గౌరవం అతనికి లేదు అని నారదుని అభిప్రాయం. నారదుని ఆజ్ఞల మేరకు, హనుమంతుడు విశ్వాసంతో అతను చెప్పినట్లే చేశాడు. ఇది విశ్వామిత్రులని ప్రభావితం చేయలేదు. కానీ నారదుడు అదిపనిగా విశ్వామిత్రుని వద్దకి వెళ్ళి హనుమంతునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు . ఆగ్రహోజ్వాలలకు గురైన విశ్వామిత్రుడు చివరికి హనుమంతుని బాణాలచే మరణశిక్షను అమలు చేయమని రాముడిని ఆజ్ఞాపించాడు. రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపాత్రుడైన శిష్యుడు, గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేక,. హనుమంతుడికి మరణశిక్ష విధిస్తానని విశ్వామిత్రునికి చెప్పి, ఆపై మరణశిక్షను ఆదేశించారు. పరిస్థితి యొక్క ప్రభావాన్ని అర్దం చేసుకున్న నారదుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి తాను చేసిన చర్యలను అంగీకరించాడు. ఫలితంగా హనుమంతుడు రక్షింపబడ్డాడు.

English summary

Bond Between Lord Rama And Hanuman

Bond Between Lord Rama And Hanuman,Talking of the Ramayana, one cannot ignore the relationship between Lord Rama and his able disciple Lord Hanuman. In fact, it will be fair on our part to say that the battles that Lord Rama won effortlessly had a major role that was played by Lord Hanuman.This article explores some o
Desktop Bottom Promotion