For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Buddha Purnima 2022:ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తాలివే...!

|

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ, మహా వైశాఖి.. బుద్ధ పూర్ణిమ అని పిలుస్తారు.

ఈ మాసంలోని వైశాఖ నక్షత్రం అంటే జ్ఞానానికి సంబంధించినది. అలాంటి పూర్ణిమ జ్ఞాన సంబంధమైన వారికి, జ్ఞాన బోధ కలిగిన వారి అవతరణకు ప్రతీకగా పండితులు చెబుతారు. అలా జ్ఞానం ఎక్కువగా వికసించిన వాడు.. తెలివి బాగా కలవాడు..బుద్ధుడు అనే గౌతమబుద్ధుడు జన్మించినటు వంటి రోజు వైశాఖ పూర్ణిమ రోజు.

ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ మే నెల 16వ తేదీన సోమవారం నాడు వచ్చింది. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం నాలుగు పూర్ణిమలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆ నాలుగు ఏంటంటే అషాడ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం, వైశాఖ మాసం.

ఇప్పుడు వైశాఖం వచ్చేసింది. ఈ నేపథ్యంలో వైశాఖ పూర్ణిమ యొక్క ప్రత్యేకతతో పాటు దీన్ని ఎందుకు బౌద్ధులు వేడుకగా జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు? ఈ ఏడాదిలో బుద్ధ పూర్ణిమను ఏ రోజున జరుపుకుంటారు? శుభ ముహుర్తం ఎప్పుడు? బుద్ధ పూర్ణిమ రోజును పవిత్రమైనదిగా ఎందుకు భావిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Chandra Grahan 2022:ఈ ఏడాది సంపూర్ణ చంద్ర గ్రహణం ఎప్పుడు? ఎక్కడ కనిపిస్తుంది?

బుద్ధ పూర్ణిమ ఎప్పుడంటే..

బుద్ధ పూర్ణిమ ఎప్పుడంటే..

2022 సంవత్సరంలో మే 16వ తేదీ అంటే సోమవారం నాడు బుద్ధ పూర్ణిమ వచ్చింది. ఈరోజు బుద్ధ దేవుని జయంతి వేడుకలను జరుపుకుంటారు. మే 15వ తేదీన అర్ధరాత్రి 12:45 నుండి మే 16వ తేదీ రాత్రి 9:45 గంటల వరకు శుభ సమయం ఉంది. ఈ పవిత్రమైన రోజున చంద్రుడిని దర్శించుకుంటే కోరికలన్నీ నెరవేరతాయని చాలా మంది నమ్ముతారు.

బుద్ధ పూర్ణిమ ప్రాముఖ్యత..

బుద్ధ పూర్ణిమ ప్రాముఖ్యత..

చరిత్రను పరిశీలిస్తే.. బుద్ధ భగవానుడు క్రీస్తు పూర్వం 563లో నేపాల్ లోని లుంబీనీ అనే ప్రాంతంలో జన్మించాడు. ప్రాపంచిక జీవితానికి దూరంగా ఉండి, గయలోని బోధి చెట్టు కింద 49 రోజుల పాటు నిరంతరాయంగా తపస్సు చేశాడు. 49వ రోజు జ్ణానం పొందడం వల్ల తనను భోది సత్వుడు అంటారు. తను జ్ణానం పొందిన తర్వాత సారనాథ్ యొక్క మ్రుగదవ్లో తన తొలి ఉపన్యాసం ఇచ్చాడు. తన మొదటి ఐదుగురు శిష్యులు కౌండచ్, వాస్పా, భద్దోడి, మహానాగ్ మరియు అర్సాజీ. వీరిని ధర్మ చక్రం అని కూడా అంటారు.

ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తాలివే...!

ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తాలివే...!

బుద్ధ భగవానుడు ప్రజలను సత్యం మరియు అహింస మార్గంలో ప్రయాణించమని ప్రేరేపించాడు. అందుకే బుద్ధ భగవానుడి జయంతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటారు. గౌతమ బౌద్ధుని పండుగ సందర్భంగా సన్యాసుల ఉపన్యాసాలను వినేందుకు, పురాతన శ్లోకాలను పఠించేందుకు బుద్ధులు ఆలయాన్ని సందర్శిస్తారు. బౌద్ధ నీతిమంతులు లేదా అంతకంటే ఎక్కువ దేవాలయాలలో గడపొచ్చు. ఇక భక్తులందరూ గౌతమ బుద్ధ విగ్రహాన్ని నీటితో నిండిన ఓ పాత్రలో ఉంచి,పూలతో అలంకరిస్తారు.

మన దేశంలో బుద్ధుని ప్రస్థానం..

మన దేశంలో బుద్ధుని ప్రస్థానం..

మరో కథనం ప్రకారం.. గౌతమ బుద్ధుడు రాజకుటుంబీకుడు అయినప్పటికీ, రాజ్యాన్ని వదిలిపెట్టి మానవ బాధలను అర్థం చేసుకోవడానికి మరియు జ్ఞానోదయం పొందటానికి 29 సంవత్సరాల వయసులో తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు.గౌతమ బుద్ధుడు మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో బోధ గయ వద్ద జ్ఞానోదయం పొందినట్లు తెలుస్తోంది. అతను తన జీవితాంతం తూర్పు భారతదేశంలో గడిపినట్లు చరిత్రకారులు చెబుతారు. అయితే బుద్ధుడు 80 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్ లోని కుషి నగర్ లో మరణించాడని చాలా మంది ప్రజల నమ్మకం.

బౌద్ధ ప్రాంతాల్లో..

బౌద్ధ ప్రాంతాల్లో..

అంతేకాదు హిందూ పురాణాల ప్రకారం బుద్ధుడు విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారం, అలాంటి సూచన కూడా గ్రంథాలలో కూడా కనిపిస్తుందట. అలా వచ్చిన ఈ గౌతమ బుద్ధుడు తన జ్ఞానంతో ప్రజలకు జ్ఞానోదయం కలిగించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పండుగను భారతదేశం అంతటా వివిధ బౌద్ధ ప్రదేశాలలో జరుపుకుంటారు, ముఖ్యంగా బోధ్ గయ మరియు సారనాథ్ (వారణాసి సమీపంలో, బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చారు) మరియు కుషినగర్. ఈ పండుగను ప్రధానంగా బౌద్ధ ప్రాంతాలైన సిక్కిం, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర బెంగాల్ (కాలింపాంగ్, డార్జిలింగ్ మరియు కుర్సియాంగ్) లో కూడా జరుపుకుంటారు.

బుద్ధుని అనుగ్రహం కోసం..

బుద్ధుని అనుగ్రహం కోసం..

భక్తులు ఆలయానికి వెళ్లి నీటితో బుద్ధ విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఇది స్వచ్ఛమైన మరియు కొత్త ప్రారంభానికి చిహ్నంగా పరిగణిస్తారు. బుద్ధుని విగ్రహం వద్ద పువ్వులు, కొవ్వొత్తులు మరియు పండ్లతో పూజిస్తారు. బౌద్ధులంతా నీతిమంతుడైన బుద్ధుని బోధనకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈరోజున పేదలు, వృద్ధులు మరియు అనారోగ్య రోగులకు సహాయపడే సంస్థలకు డబ్బు, ఆహారం మరియు అవసరమైన వస్తువులను ఇస్తారు. నీతిమంతులైన జీవుల పట్ల తమ ప్రేమను, అభిమానాన్ని చూపిస్తారు. ముఖ్యంగా తెల్లని బట్టలు ధరిస్తారు. మాంసాహారాన్ని తీసుకోరు. ఈరోజు ఖీర్ ప్రత్యేకంగా తయారు చేస్తారు.

2022లో బుద్ధ పూర్ణిమ ఎప్పుడొచ్చింది? దీని ప్రత్యేకతలేంటి?

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో పూర్ణిమ అనేది సాధారణంగా వస్తుంది. అయితే వైశాఖ మాసంలోని విశాఖ నక్షత్రం అంటే జ్ఞానానికి సంబంధించినది. అలాంటి పూర్ణిమ జ్ఞాన సంబంధమైన వారికి, జ్ఞాన బోధ కలిగిన వారి అవతరణకు ప్రతీకగా పండితులు చెబుతారు. అలా జ్ఞానం ఎక్కువగా వికసించిన వాడు.. తెలివి బాగా కలవాడు..బుద్ధుడు అనే గౌతమబుద్ధుడు జన్మించినటు వంటి రోజు వైశాఖ పూర్ణిమ రోజు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది వైశాఖ పూర్ణిమ మే నెల 16వ తేదీన సోమవారం నాడు వచ్చింది.

English summary

Buddha Purnima 2022: Date, history, significance of Buddha's Birthday in Telugu

Here we are talking about the Buddha Purnima 2022:Date, history, significance of Buddha's Birthday in Telugu. Read on
Story first published: Tuesday, May 10, 2022, 12:33 [IST]
Desktop Bottom Promotion