Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Buddha Purnima 2023: ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ తేదీ, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత
ఏటా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణిమిని బుద్ధ పూర్ణిమ, మహా పూర్ణిమగా పిలుచుకుంటాం. ఈ రోజు గౌతమ బుద్ధుని జన్మదినంగా, జ్ఞానోదయం అయిన రోజుగా భావించి స్మరించుకుంటాం. ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ మే 5వ తేదీన వస్తోంది. అలాగే ఈ రోజు చంద్రగ్రహణం కూడా సంభవించనుంది.

హిందూ సాంప్రదాయాల ప్రకారం నాలుగు పూర్ణిమలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ, మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి, వైశాఖ మాసంలో వచ్చే బుద్ధ పూర్ణిమకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఏడాదిలో వచ్చే బుద్ధ పూర్ణిమ తేదీ, సమయం, శుభ ముహూర్తం, ప్రాముఖ్యతలను ఇప్పుడు తెలుసుకుందాం.
బుద్ధ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందంటే:
* 2023 ఏడాదిలో మే 5వ తేదీన శుక్రవారం రోజు బుద్ధ పూర్ణిమ వస్తోంది.
* మే 5, 2023న ఉదయం 04.14 గంటలకు ప్రారంభం అవుతుంది.
* మే 6, 2023న తెల్లవారుజామున 03.33 గంటలకు ముగుస్తుంది.
బుద్ధ పూర్ణిమ ప్రాముఖ్యత:
బుద్ధుడు క్రీస్తు పూర్వం563లో నేపాల్ లోని లుంబినీ అనే ప్రాంతంలో జన్మించాడు. తన 29 ఏళ్ల వయస్సులో ప్రాపంచినక జీవితానికి స్వస్తి పలికి సన్యాసాన్ని స్వీకరిస్తాడు. గయలోని బోధి చెట్టు కింది 49 రోజుల పాటు నిరంతరాయంగా తపస్సు చేశాడు. 49వ రోజు జ్ఞానం పొందినట్లు చెబుతారు. అలా భోది సత్వుడిగా మారినట్లు చెబుతారు. తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా దేశాల్లో బుద్ధ పూర్ణిమను ఘనంగా జరుపుకుంటారు. అయితే బుద్ధుడి జనన మరణాల సమయాలపై చారిత్రక ఆధారాలు ఏవీ లభ్యం కాలేదు.
ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో గౌతమ బుద్ధుడిని శ్రీమహావిష్ణువు 9వ అవతారంగా కొలుస్తారు. అయితే దక్షిణ భారత దేశంలో మాత్రం బుద్ధుడిని మహావిష్ణువు అవతారంగా పరిగణించరు. అలాగే బౌద్ధులు కూడా బుద్ధుడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా చూడరు.

బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ ప్రాముఖ్యత:
బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమకు అత్యంత ప్రాముఖ్యత ఉందని చరిత్ర చెబుతోంది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మహామాయలకు ఓ వైశాఖ పూర్ణిమ నాడు సిద్ధార్థుడిగా బుద్ధుడు జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమ రోజు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు. ఇంకో వైశాఖ పూర్ణిమ రోజు బుద్ధుడు నిర్యాణం చెందాడు. బుద్ధుడి తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్థుడిని పెంచిందని, అందుకే బుద్ధుడిని గౌతమ బుద్ధుడిగా పిలుస్తారని చరిత్రకారులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications