Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించడంపై వివాదం.. అసలు ఆడవారు జుట్టు ఇవ్వొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిష్టర్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అలాగే స్వామి వారికి ఆమె తన తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. అయితే ఆమె తలనీలాలు సమర్పించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు.. కొత్త చర్చకు దారి తీసింది. అసలు మహిళలు తలనీలాలు సమర్పించవచ్చా? సమర్పిస్తే ప్రమాదమా అని కొంతమంది కొత్త చర్చ మొదలు పెట్టారు. అందుకే దీనిపై మేము ఈ స్టోరీలో క్లారిటీ ఇస్తున్నాము. అసలు మహిళలు తలనీలాలు సమర్పించవచ్చా? మహిళలు ఎందుకు తలనీలాలు సమర్పిస్తారు? ఇది మంచిదా కాదా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం రండి.
వెంకటేశ్వర స్వామికి మహిళలు జుట్టు సమర్పించవచ్చా?
వేంకటేశ్వరుడికి మహిళలు జుట్టు సమర్పించవచ్చని పలువురు పండిత నిపుణులు చెబుతున్నారు. మహిళలు జుట్టు సమర్పించడంలో ఎలాంటి తప్పు లేదని చెబుతున్నారు. ఎందుకంటే మహిళలకు అత్యంత ముఖ్యమైనది కట్టు బొట్టు జుట్టు. పుట్టినప్పటి నుంచి మహిళలకు సహజసిద్ధంగా వచ్చే జుట్టు ఎంతో ప్రత్యేకమైనది, ఆడవారికి గౌరవానికి నిలువెత్తు నిదర్శనం వంటిది జుట్టు. అలాంటి జుట్టును ఓ మహిళ సమర్పించుకుంటుందంటే అది చాలా గొప్ప విషయం అని చెబుతున్నారు.

మహిళలకు అహంకారం, అందం, గర్వం అన్నీ కట్టు బొట్టు జుట్టులోనే ఉంటుందని, అలాంటి జుట్టును సమర్పించుకోవడం అంటే మామూలు విషయం కాదంటున్నారు. తమ అందం, గర్వం, అహంకారం అన్నిటినీ వదిలేసి.. "స్వామి నీ కృప కోసం ఇంతకంటే ఎక్కువగా దిగజారలేను, నా అహంకారాన్ని, గర్వాన్ని వదిలేసి నీ మెప్పు కోసం, నీ కృప కోసం జుట్టు సమర్పిస్తున్నానని" చెప్పడమే మహిళలు తలనీలాలు సమర్పించడానికి అర్థం అని పేర్కొంటున్నారు. ఈ విధంగా చూస్తే మహిళలు జుట్టు సమర్పించడంలో ఎలాంటి తప్పు లేదని, అన్నా లెజినోవా సైతం తన తలనీలాలను సమర్పించడంలో ఎలాంటి తప్పు లేదని చెబుతున్నారు. ఈ మేరకు పలు గ్రంథాల్లో కూడా ఉదాహరణలు ఇచ్చారని చెబుతున్నారు.
ఎందుకు జుట్టు సమర్పించకూడదు అని అంటారంటే..
సాధారణంగా మహిళలు జుట్టు సమర్పించడంలో ఎలాంటి తప్పు లేదని చెబుతుంటారు. అయితే పూర్వకాలంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతుండేవి. ఆ సమయంలో భర్త చనిపోయిన వెంటనే భార్యలకు శిరోమండనం అంటే జుట్టు తీసేయడం వంటివి చేసేవారు. ఇది కాల క్రమేణా అలానే కొనసాగుతూ వచ్చింది. రాను రాను మహిళలు జుట్టు సమర్పించుకుంటే పాపం అనే స్థాయికి వచ్చింది. అంతే తప్పితే శాస్త్రాల ప్రకారం మహిళలు జుట్టు సమర్పిస్తే పాపం అని ఎక్కడా లేదని నిపుణుల అభిప్రాయం. అయినప్పటికీ.. అన్ని ఆచార సంప్రదాయాలను పాటిస్తూ.. ఆయా ఇంట్లో పెద్ద వాళ్ళు ఏం చెబుతారో వాటికి ఆధారంగా నడుచుకోవాలని సూచిస్తున్నారు. ఆచార సంప్రదాయాలు వేరైనప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని, పెద్దల సూచనల మేరకు నడుచుకోవాలంటున్నారు.
చివరగా..
దైవ భక్తి అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తమ తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఏదన్నా చేయవచ్చు. తన దేవుడికి సంబంధించిన మొక్కులు చెల్లించుకోవచ్చు. అంతేకాని మహిళలు చేస్తే పాపం అని ఎక్కడా చెప్పబడలేదు. దేవుడి మీద ఆమెకున్న నమ్మకం, విశ్వాసం, తన కుటుంబానికి మంచి జరగాలని ఆమె మొక్కు తీర్చుకున్నారు. ఆమె మొక్కుకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంటుంది.



Click it and Unblock the Notifications