For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chaitra Navaratri 2022: ఛైత్ర నవరాత్రుల పూజా విధానం.. విశేషాలేంటో తెలుసుకోండి...

చైత్ర నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి.. ఎన్నిరోజుల పాటు ఉంటాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ మతంలో నవరాత్రులు చాలా పవిత్రమైనవి. ఈ కాలంలో దుర్గా మాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

Chaitra Navaratri 2021 Date, Ghatsthapana Timings Ausipicious Nine Day Full List in Telugu

ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో దేవీ మంత్రాన్ని జపిస్తారు. గౌరీ పంచాక్షరీ, బాలా షడక్షరీ, సవార్ణ చండికా, పంచదశీ, షోడశీ మంత్రాలన్నీ దేవికి సంబంధించినవే. గురు ముఖతః ఉపదేశం పొంది, పూజా విధానం తెలుసుకుని, ఎంతో నియమ నిష్టలతో ఈ మంత్రాలను జపించాలి.

Chaitra Navaratri 2021 Date, Ghatsthapana Timings Ausipicious Nine Day Full List in Telugu

అమ్మవారి పూజా విధానంలో మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు విధానాలు అమ్మ వారి పూజలు ముఖ్యమైనవి. ఈ సందర్భంగా 2022లో ఛైత్ర నవరాత్రి తేదీలు, శుభ సమయాలు.. ఏ రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజిస్తారు.. పూజా పద్ధతులేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వాస్తు శాస్త్రం: ఆగ్నేయ దిశను ఎందుకు అననుకూలమైనదిగా పరిగణించబడుతుంది...వాస్తు శాస్త్రం: ఆగ్నేయ దిశను ఎందుకు అననుకూలమైనదిగా పరిగణించబడుతుంది...

ధూప, దీప నైవేద్యాలను..

ధూప, దీప నైవేద్యాలను..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర నవరాత్రి ఛైత్ర మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి రోజున ప్రారంభమవుతుంది. అంటే 2022 సంవత్సరంలో ఏప్రిల్ 02వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ నవరాత్రులు కొనసాగుతాయి. మంత్ర అనుష్టానం అయిన తర్వాత పీఠపూజతో ప్రారంభించి, షోడపశోపచారాలతో దేవిని ఆరాధించి, సహస్రనామావాళితో, అష్టోత్తర శతనామాలతో పూజించి, ధూప, దీప నైవేద్యాలను సమర్పించి, యథాశక్తిగా గీత, ఛత్ర చామరాలతో అమ్మవారికి సపర్యలు చేయాలి.

భక్తి భావనలతో..

భక్తి భావనలతో..

ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి స్తోత్రాలు, కథలతో దేవీ మయంగా భక్తి భావనతో దీక్షగా గడపాలి. ఈ తొమ్మిది రోజులలో తల్లిదండ్రుల పూజ, గురువుల పూజ, గో పూజ, కుమారీ పూజ, సువాసినీ పూజ వంటివి దేవికి ప్రీతిపాత్ర అయిన విషయాలు.

నవరాత్రుల జాబితా..

నవరాత్రుల జాబితా..

తొలి రోజు : శైలపుత్రి

రెండో రోజు : బ్రహ్మచారిణి

మూడో రోజు : చంద్ర ఘంట

నాలుగో రోజు : కుష్మాండ

ఐదో రోజు : స్కంద మాత

ఆరో రోజు : కాత్యాయని

ఏడో రోజు : కాళీ మాత

ఎనిమిదో రోజు : మహాగౌరి

తొమ్మిదో రోజు : సిద్ధిదాత్రి

ఎర్రని పువ్వులు..

ఎర్రని పువ్వులు..

నవరాత్రి పూజా వేళలో ఎర్రని పువ్వులు, ఎర్రని గంధం, ఎర్ర రంగులో ఉండే అక్షింతలు, ఎర్రని వస్త్రాలు దేవికి సమర్పించాలి. ఎర్రని కుంకుమతో అమ్మవారిని పూజించాలి. ఈ విధమైన పూజ అంటే అమ్మవారికి ప్రీతిపాత్రం. వసంత నవరాత్రులలో, శరన్నవరాత్రులలో పరాశక్తిని ఆరాధించి అబీష్టసిద్ధిని పొందిన వారు ఎందరో ఉన్నారని పండితులు చెబుతున్నారు.

FAQ's
  • ఛైత్ర నవరాత్రుల్లో అమ్మవారిని ఎన్ని రూపాల్లో కొలుస్తారు?

    తొలి రోజు : శైలపుత్రి రెండో రోజు : బ్రహ్మచారిణి మూడో రోజు : చంద్ర ఘంట నాలుగో రోజు : కుష్మాండ ఐదో రోజు : స్కంద మాత ఆరో రోజు : కాత్యాయని ఏడో రోజు : కాళీ మాత ఎనిమిదో రోజు : మహాగౌరి తొమ్మిదో రోజు : సిద్ధిదాత్రి. ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి స్తోత్రాలు, కథలతో దేవీ మయంగా భక్తి భావనతో దీక్షను చేయాలి. ఈ 9 రోజుల్లో తల్లిదండ్రుల పూజ, గురువుల పూజ, గో పూజ, కుమారీ పూజ, సువాసినీ పూజ వంటివి దేవికి ప్రీతిపాత్రమైన విషయాలు.

  • 2022లో ఛైత్ర నవరాత్రి ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి?

    హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా ఛైత్ర మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి రోజు నుండి ఛైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీ నుండి అంటే శనివారం నుండి ప్రారంభమవుతాయి. 11వ తేదీ వరకు ఈ నవరాత్రులు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు చేస్తారు. నవరాత్రుల్లో తొలిరోజున కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజుల్లో అమ్మవారు వచ్చే ప్రత్యేక వాహనాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.

English summary

Chaitra Navaratri 2022 Date, Ghatsthapana Timings Ausipicious Nine Day Full List in Telugu

Here we are talking about the Chaitra Navaratri 2021 Date, Ghatsthapana Timings Ausipicious Nine Day Full List in Telugu. Read on
Desktop Bottom Promotion