Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
Chaitra Purnima 2021 : ఛైత్ర పూర్ణిమ అంటే ఏమిటి? ఈ పండుగకు ఎందుకంత ప్రాధాన్యత...
ఛైత్ర పూర్ణిమకు ఎందుకంత ప్రాధాన్యత.. దాని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది. అయితే తొలి మాసంలో వచ్చే ఛైత్ర పూర్ణిమను అదృష్ట పూర్ణిమగా పరిగణిస్తారు.

సనానత ధర్మంలో ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల మీ కోరికలు నెరవేరడంతో పాటు భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందొచ్చని పండితులు చెబుతున్నారు.

ఈరోజు చంద్రునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయని భక్తుల నమ్మకం. తెలుగు సంవత్సరంలో ఛైత్రం మొదటి ఏడాది కాబట్టి ఈ నెలను చంద్రమాసం అని కూడా అంటారు. ఈ ఏడాది ఛైత్ర పూర్ణిమ ఏప్రిల్ 27వ తేదీన మంగళవారం రానుంది. ఈ సందర్భంగా ఛైత్ర పూర్ణిమ అంటే ఏమిటి? ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

విష్ణువుకు ప్రత్యేక పూజలు..
పురాణాల ప్రకారం ఛైత్ర పూర్ణిమ రోజు శ్రీ మహా విష్ణువుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ఆ భగవంతుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. ఈ పవిత్రమైన రోజున చంద్రునికి సంబంధించిన వ్రతం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఈరోజు పేదవారికి దానం చేయడం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని నమ్ముతారు. ఈరోజు ఉదయాన్నే గంగానదిలో లేదా పారుతున్న నీటిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయట. ఈరోజున తులసి స్నానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని చాలా మంది విశ్వాసం.

ఛైత్ర పూర్ణిమ నాడు..
హిందూ పురాణాల ప్రకారం, ఎవరైనా నియమ నిష్టలతో, పూర్తి భక్తి శ్రద్ధలతో ఉపవాసముండాలి. అలా లేకపోతే దానికి సంబంధించిన ఫలితం లభించదు. ఇదే పద్ధతిని ఛైత్ర పూర్ణిమ రోజున అనుసరించాలి. ఈరోజు ఉపవాసం ఉండటంతో పాటు.. లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే కనకధర స్తోత్రం పఠించవచ్చు. అనంతరం చీకటి పడ్డాక చంద్రుడికి నీటిని సమర్పించాలి. తర్వాత బ్రహ్మాణులకు ఆహారం దానం చేయాలి. లేదా పేదలకు దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చంద్రుడు కోరికలను నెరవేరుస్తాడని పండితులు చెబుతారు.

సత్యనారాయణ స్వామి ఆరాధన..
ఛైత్ర పూర్ణిమ రోజున సత్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. రామాయణం లేదా భాగవత గురించి తెలియని వారు ఈరోజు సత్య నారాయణ స్వామిని కథను వింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున ఈ కథను ఇంట్లో వినడం వల్ల ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో సంతోషం, శ్రేయస్సుతో పాటు ఆదాయ పరంగా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి.

ఛైత్ర పూర్ణిమ ప్రాముఖ్యత..
అన్ని పౌర్ణమిల కంటే ఛైత్ర పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గగనంలో జాబిల్లి నిండుగా కనిపించడాన్నే పౌర్ణమి అంటారని మనందరికీ తెలిసిందే. అంటే చీకటిపై వెలుగు విజయం సాధించడం అనేది దీనర్థం. చెడుపై మంచి విజయం సాధించడం అని కూడా అంటారు. ఈరోజున విష్ణుమూర్తికి, చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని భక్తులు నమ్ముతారు. ఈరోజున పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

హనుమాన్ జయంతి..
ఛైత్ర పూర్ణిమ రోజునే రామునికి ఎంతో ఇష్టమైన హనుమంతుని జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఛైత్ర పూర్ణిమను భజరంగి జయంతి అని కూడా పిలుస్తారు. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రమం పొందడమే కాదు.. తమ వ్యక్తిగత జీవితంలో భయాలన్నీ తొలగిపోయి, కొండంత ధైర్యం వస్తుందని నమ్ముతారు.



Click it and Unblock the Notifications