For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణుక్యుడి అభిప్రాయం ప్రకారం ఈ నాలుగు సందర్భాల్లో తప్పనిసరిగా స్నానం చేయాలి..!?

ఓ నాలుగు పనులు చేసిన తర్వాత మాత్రం తప్పకుండా స్నానం చేయాలని సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచిన చాణక్యుడు చెబుతున్నాడు. లేదంటే ప్రాణాలకే ముప్పు అని

|

మన మనసు, శరీరం, ఆత్మ పరిశుభ్రత గురించి హిందు మతంలో ఎన్నో సూత్రాలు ఉంటాయి. నిజానికి మన పురాణాలను బట్టి చూస్తే ప్రతీ మనిషి రోజుకి కనీసం మూడు సార్లు స్నానం చేయాలి. ఉదయం 4:30-5:00 మధ్యలో ఒకసారి, మధ్యన వేల ఒకసారి, అలాగే సాయంత్రం 6:00 దాటిన తర్వాత ఒకసారి స్నానం చేయాలి. కానీ ఈ కాలంలో అంత తీరిక ఎవరికుంటుంది చెప్పండి. ఒకవేళ తీరిక ఉన్నా నీటి కొరత వల్ల అన్ని సార్లు స్నానం చేయడం కుదరదు. మగవాళ్లు ఈ పనులు చేస్తే కాలిపోతారంటున్న చాణక్యుడు..!!

Chanakya Niti: Always Take A Bath After Doing These 4 Things

కాని ఓ నాలుగు పనులు చేసిన తర్వాత మాత్రం తప్పకుండా స్నానం చేయాలని సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచిన చాణక్యుడు చెబుతున్నాడు. లేదంటే ప్రాణాలకే ముప్పు అని అంటున్నాడు. మరి ఆ నలుగు సందర్భాలు ఏంటో ఒక్కసారి చూద్దాం..!!

ఆయిల్ మసాజ్

ఆయిల్ మసాజ్

మంచి సంగీతంతో మన చెవులను, అందమైన ప్రకృతిని చూస్తూ మన కళ్ళకు, రుచికరమైన వంటకాలతో మన నోటిని ఆనందపరిచినట్టే.. వారానికొకసారి ఆయిల్ మసాజ్ చేస్తూ మన శరీరాన్ని కూడా ఆనందపరచాలి అంటున్నాడు చాణక్యుడు. మసాజ్ వల్ల మన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. వాటి ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఆయిల్ మసాజ్ చేశాక వీలైనంత త్వరగా స్నానం చేయాలి.

 శృంగారంలో పాల్గొన్నవారు

శృంగారంలో పాల్గొన్నవారు

చాణక్యుడి ప్రకారం శృంగారంలో పాల్గొన్నవారు వెంటనే మత చర్యలు చేయడానికి అర్హులు కారు. ఇలాంటి వారు తప్పకుండా వారి దేహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత స్నానం చేయకుండా ఇంటిని కూడా విడిచి వెళ్ళకూడదు. స్నానం చేసిన తర్వాతే ఇంకేపనైనా చేయాలి అని అంటున్నాడు.

జుట్టు కత్తిరించిన తర్వాత

జుట్టు కత్తిరించిన తర్వాత

మనిషి అందంగా కనిపించడానికి జుట్టు కూడా తోడ్పడుతుంది. మారుతున్న కాలానికి అనుకూలంగా జుట్టుని ఎన్నో రకాలుగా మారుస్తూ ఉంటారు. కాని జుట్టు కత్తిరించిన తర్వాత కేవలం తలని మాత్రమే కడగకుండా పూర్తి స్నానం చేయాలి. ఎందుకంటే కత్తిరించిన జుట్టు మన శరీరానికి అతుక్కుపోతుంది. సరిగ్గా స్నానం చేయకపోతే ఆ చిన్న చిన్న వెంట్రుకలు మన బ్యాడ్ స్కిన్ బాక్టీరియాకి ఆహారంగా మారుతాయి. దీని ద్వారా మన శరీరం పై తెలియకుండానే బాక్టీరియా పెరిగిపోతుంది. కాబట్టి కటింగ్, షేవింగ్ లాంటివి చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలని చాణక్యుడు అంటున్నాడు.

అంత్యక్రియలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు

అంత్యక్రియలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు

పెళ్ళికి వెళ్లకపోయినా పర్వాలేదు గాని తెలిసినవారి అంత్యక్రియలకు మాత్రం తప్పకుండా వెళ్ళాలి అంటారు. అంత్యక్రియలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయాలి. ఎందుకంటే చనిపోయినవారి శరీరంలో బాక్టీరియాతో పోరాడే శక్తి ఉండదు. దీంతో వారి శరీరంలో బాక్టీరియా పెరిగిపోతుంది. అందుకే అంత్యక్రియల నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎవరిని తాకరాదు అంటారు. ఇంట్లోకి కూడా బాక్టీరియా రాకుండా ఉండాలని ఇంటి బయటనే స్నానాలు చేయమంటారు.

English summary

Chanakya Niti: Always Take A Bath After Doing These 4 Things

Our Hindu culture holds the importance of cleanliness in the highest regards, be it physical, mental or spiritual. The religion guides its observers to shower or bath at least thrice a day; one at early morning somewhere around 4:30 am or 5 am, the second one must be taken at noon and then finally in the evening after 6 pm.
Desktop Bottom Promotion