Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Chanakya niti: ఏ రంగంలో అయినా సరే..మీ విజయాన్ని డిసైడ్ చేసేది ఈ 7 విషయాలే
చాణక్యుడు తన నైపుణ్యాలు, వ్యూహాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. 14 ఏళ్ల బాలుడిని మౌర్యుల సామ్రాజ్యానికి అధిపతి చేసి అతడితో విజయవంతమైన పాలన అందించేలా చేశాడు. రాజకీయాలు, ఆర్థిక విషయాలు, తత్వ శాస్త్రం సహా అనేకవాటికి సంబంధించిన ఎన్నో విలువైవ విషయాలను ఈ ప్రపంచానికి చాణక్యుడు వివరించాడు. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపిన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చాణక్య నీతిలో వివరించబడింది.
ఆచార్య చాణక్య నీతి శాస్రం ప్రకారం మనిషి విజయం, వైఫల్యం అతని చర్యలు, అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.చాణక్య నీతి ప్రకారం కష్టపడి పనిచేయడమే విజయానికి మూల మంత్రం. అయితే చాణక్య నీతి ప్రకారం వ్యాపారంలో అయినా లేదా కెరీర్ లో అయినా లేదా మరే ఇతర రంగంలో అయినా సక్సెస్ అవ్వాలంటే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయాలు ఏడు ఉన్నాయి. విజయవంతమైన వ్యక్తులు చాణక్య నీతిలోని ఈ 7 విషయాలను అవలంబిస్తారు.

విజయం కోసం గుర్తుంచుకోవలసిన 7 విషయాలు ఇవే
క్రమశిక్షణ
చాణక్య నీతి ప్రకారం విజయం సాధించడానికి క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ,నియమాలతో జీవితాన్ని గడిపే వ్యక్తి పాదాలను విజయం ముద్దాడుతుంది. క్రమశిక్షణ లేకుండా జీవితంలో విజయం ఉండదు.
బలమైన ఉద్దేశాలు
చాణక్యుడు ప్రకారం బలమైన ఉద్దేశ్యంతో కష్టపడి పనిచేసేవాడే విజయవంతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులు విజయం సాధిస్తారు. ఈరోజు చేసే పనిని రేపటి కోసం వాయిదా వేసే వారికి డబ్బు ఎప్పుడూ రాదు.
ప్రవర్తన
చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడు అనేది కూడా అతని విజయాన్ని నిర్ణయిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తన ప్రవర్తన గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.
అభిరుచి
చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి విజయాన్ని సాధించాలనే అభిరుచిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. మన లక్ష్యాలను సాధించడానికి మనం ఎల్లప్పుడూ పగలు, రాత్రి కష్టపడి పనిచేయాలి. లక్ష్యాన్ని సాధించాలనే తపన మాత్రమే వ్యక్తిని విజయపథంలోకి తీసుకువెళ్తుంది
సమయాన్ని గౌరవించడం
చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి ముఖ్యమైన విషయం సమయాన్ని గౌరవించడం. సమయానికి విలువ ఇవ్వని వ్యక్తులు కష్టపడి పనిచేసినా పురోగతిని పొందలేరు.
తప్పుల నుండి నేర్చుకోవడం
ఆచార్య చాణక్య ప్రకారం మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీరు ఇతరుల తప్పుల నుండి కూడా నేర్చుకోవాలి. ఇతరుల తప్పుల నుండి పాఠాలు నేర్చుకునే వ్యక్తి తన జీవితంలో పురోగతి సాధిస్తాడని చాణక్యుడు చెప్పాడు.
నిజమైన స్నేహితుడు
చాణక్య నీతి ప్రకారం మీకు నిజమైన స్నేహితుడు ఉంటే వారిని ఎప్పుడూ మీ నుండి దూరం చేసుకోకండి. నిజమైన, మంచి స్నేహితుడి అవసరం ఎల్లప్పుడూ అనుభూతి చెందుతుంది.



Click it and Unblock the Notifications