Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
Astro Tips: స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం జపిస్తే ఇంట్లో ధన వర్షం!..ఏ దిక్కు నిలబడి స్నానం చేయాలో తెలుసా?
శరీర పరిశుభ్రతకు స్నానం చాలా ముఖ్యం. కొందరు అయితే ప్రతి రోజూ ఉదయం,సాయత్రం రెండుపూటలా స్నానం చేస్తారు..చాలామంది రోజుకి ఒక పూట మాత్రమే స్నానం చేస్తుంటారు. అయితే స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడానికే కాకుండా అనేక కోణాల్లో ఇది ముఖ్యమైనది. మానసికంగా, ఆథ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఇది అవసరం. అయితే స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపిస్తూ కొన్ని సాధారణ పనులు చేయడం ద్వారా మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులను చూడవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాలు జపిస్తే మంచి ఫలితాలు
సాధారణంగా మన ఇళ్లల్లో లేదా గుడుల్లో దేవుళ్లను మంత్రాలతో ఆవాహన చేసినట్లుగానే స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని మంత్రాలను జపిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

1. గంగా మంత్రం
ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఈ మంత్రం ఏడు పవిత్ర నదులను..గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదులను స్మరిస్తూ ఆ నీటిలో వాటి పవిత్రతను ఆవాహన చేయమని కోరుతుంది. ఈ మంత్రాన్ని చదవడం వల్ల స్నానం చేసే నీరు పవిత్ర నదుల యొక్క శక్తిని పొందుతుందని నమ్ముతారు.
2. సూర్య మంత్రం
ఓం సూర్యాయ నమః
స్నానం తర్వాత సూర్యుడికి నీరు సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతారు. సూర్యుడు శక్తికి,ఆరోగ్యానికి ప్రతీక. స్నానం చేసిన వెంటనే సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం చాలా ముఖ్యం. అలా చేయకపోతే స్నానం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను పొందలేం. ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా లేదా చాలా రోజుల తర్వాత స్నానం చేస్తున్నా ప్రత్యేకమైన మంత్రం, ప్రత్యేక పద్ధతి ద్వారా దాని శక్తిని మరింత పెంచుకోవచ్చు.
స్నానం చేయడానికి ముందు ఒక బకెట్ లో నీరు నింపి మీ ఉంగరం వేలు లేదా చూపుడు వేలుతో ఆ నీటిపై ఒక త్రిభుజాన్ని గీయండి. ఆ త్రిభుజంలో శక్తివంతమైన దైవిక మంత్రాన్ని స్పష్టంగా రాయండి, దానిని మూడుసార్లు జపించండి. తర్వాత ఆ నీటితో ఆనందంగా స్నానం చేయండి. ఈ మంత్రం అద్భుతాలు చేస్తుంది. ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు దీన్ని ఆచరించడం వల్ల మీపై ధన వర్షం కురుస్తుంది, మీరు దైవిక శక్తి స్పర్శను అనుభూతి చెందుతారని పండితులు చెబుతున్నారు.
ఒకవేళ మీరు స్నానం చేయలేని పరిస్థితిలో ఉంటే దానికోసం కూడా ఒక సులువైన పరిష్కారం ఉంది. స్నానం చేయలేని సమయంలో ఒక చిన్న కప్పులో నీరు నింపి అందులో త్రిభుజం, మంత్రాన్ని రాయండి. మీరు స్నానం చేసిన వెంటనే ఆ నీటిని మీ తలపై నెమ్మదిగా పోసుకోండి. దీంతో మీ పెండింగ్ పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతుంది..మీ డబ్బు ప్రవాహం పెరుగుతుంది. మీ జీవితంలో ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది.
ఎటు వైపు తిరిగి స్నానం చేయాలి
-ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి నిలబడి స్నానం చేయడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇది మీకు పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని తెలిపారు.
-స్నానం చేసిన తర్వాత మీ బాత్రూమ్ ను శుభ్రంగా ఉంచడం మర్చిపోకూడదని.. మురికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని తెలిపారు.
ఇలా చేస్తే ఆర్థికంగా శక్తివంతం
ఈ సులువైన చిట్కా కేవలం మీ శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని పండితులు తెలిపారు. ఎక్కడో ఆగిపోయిన డబ్బును తిరిగి పొందేలా చేస్తుంది. మీ కెరీర్‌లో అద్భుతమైన పురోగతిని కలిగిస్తుందని చెబుతున్నారు. మీరు రోజూ స్నానం చేసేవారైనా లేదా అనారోగ్యం వల్ల కొంతకాలం స్నానం చేయలేని వారైనా సరే ఈ పద్ధతి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది.



Click it and Unblock the Notifications