Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
Char Dham Yatra 2023: చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? ఇవి మర్చిపోతే చాలా ఇబ్బంది పడతారు జాగ్రత్త!
జీవితంలో ఒక్కసారైనా చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని చాలా మంది హిందువులు కోరుకుంటారు. హిమాలయ సానువుల్లో ఉండే ఈ నాలుగు దివ్య క్షేత్రాలకు వెళ్లి ఆధ్యాత్మికంగా తరించాలనుకుంటారు. క్లిష్టమైన వాతావరణం, ఎత్తైన కొండలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్, విరిగిపడే కొండచరియలు ఇలా ఎన్నో ప్రమాదాలను దాటుకుని ఈ నాలుగు దివ్యక్షేత్రాలను సందర్శించాల్సి ఉంటుంది.
కేదార్‌నాథ్ క్షేత్రం యాత్ర సాఫీగా సాగిపోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు. వాటి వల్ల ఈ యాత్ర ఆనందంగా మొదలై అంతే సంతోషంగా ముగుస్తుందని సూచిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ యాత్రలో పాటించాల్సిన ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా వీటిని చెక్ చేసుకోవాలి:
1. ముందుగా చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు సరిగ్గా జరిగాయో లేదో తనిఖీ చేసుకోవాలి. అన్ని రకాల అనుమతులు వచ్చాయా లేదా సరిచూసుకోవాలి.
2. కేదార్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించడానికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు అనువైనవి. కేదార్‌నాథ్ ఆలయ ప్రాంతంలో వాతావరణం అంచనాలకు అందదు. ఉన్నట్టుంది ఉష్ణోగ్రతలు పడిపోవచ్చు. అందుకే చలిని తట్టుకునే దుస్తులు తీసుకెళ్లాలి.
3. కేదార్‌నాథ్ లో పరిస్థితులు ఆరోగ్యాన్ని సవాల్ చేసేలా ఉంటాయి. మీరు ఒకవేళ కేదార్‌నాథ్ కు వెళ్లాలని ప్లాన్ వేసుకుంటే సుమారు 6 నెలల ముందు నుండే అందుకు తగ్గట్లుగా మీ శరీరాన్ని మలచుకోవాలి. అవసరమైన వ్యాయామాలు చేయాలి. ఎప్పుడూ మెడికల్ కిట్ అందుబాటులోనే ఉంచుకోవాలి.
4. ఎత్తైన కొండలు ఎక్కుతున్నప్పుడు ముఖ్యంగా ఆక్సిజన్ తక్కువగా ఉండే చోట త్వరగా అలసటకు, నీరసానికి గురవుతారు. అందుకే తక్షణ శక్తినిచ్చే చాక్లెట్లు, గ్లూకోజ్ వంటివి వెంట ఉంచుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
5. మొబైల్ ఛార్జింగ్ లో ఉండేలా చూసుకోవాలి. అదనపు పవర్ బ్యాంక్ లు వెంట తీసుకెళ్లాలి. కేదార్‌నాథ్ ప్రాంతంలో ఉండే నెట్ వర్క్‌లకు మీ సిమ్ లను పోర్టు చేసుకోవాలి.
6. ఐడీ ప్రూఫ్‌లు తీసుకెళ్లడం మర్చిపోవద్దు. నగదు, కార్డులు, ఇతర అవసరమైన వస్తువులు, మంచి చెప్పులు లేదా షూ, టార్చ్ లైట్, స్నాక్స్ వెంట ఉంచుకోవాలి.
జబ్బులు ఉన్న వారికి చిట్కాలు:
కేదార్‌నాథ్ క్షేత్రం సముద్ర మట్టానికి 11,750 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంత ఎత్తైన ప్రాంతంలో ఆరోగ్యంపై ప్రభావితం పడుతుంది. గుండె జబ్బులు ఉన్న వారు, బీపీ, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం లాంటి జబ్బులు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆక్సిజన్ తక్కువ, శ్వాస ఇబ్బంది పెడుతుంది:
కేదార్‌నాథ్ క్షేత్రం అత్యంత ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఎత్తైన ప్రాంతాలకు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మరింత సాధారణం కంటే ఎక్కువగా ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి శ్వాస తీసుకోవాడనికి 70 శాతం ఆక్సిజన్ అవసరం.
కేదార్‌నాథ్ వద్ద 57 శాతం మాత్రమే ఉంటుంది. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస ఇబ్బందులు ఉన్న వారు కేదార్‌నాథ్ లో మరింత ఇబ్బందిగా మారుతుంది.
నడక ప్రాక్టీస్ చేయాలి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి:
కేదార్‌నాథ్ కు వెళ్లాలనుకునే వారు చాలా రోజుల ముందు నుండే నడక ప్రాక్టీస్ చేస్తుండాలి. రోజూ ఎక్కువ దూరం నడవాలి. ఎత్తైన ప్రదేశాలను ఎక్కడాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కొంత స్టామినా వస్తుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉండదు. శరీరాన్ని సిద్ధం చేసుకుంటే కేదార్‌నాథ్ కు వెళ్లడం ఇబ్బంది పెట్టదు.
ఇప్పటి పలు జబ్బులతో బాధపడే వారు తప్పనిసరిగా వైద్య ముందుగా పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సిఫార్సు తర్వాతే కేదార్‌నాథ్ యాత్రకు ప్లాన్ చేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications