For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛిన్నమస్తా దేవి: స్వయం శిరః ఖండిత దేవత

|

హిందూమతంలోని తాంత్రిక దేవతలలో ఛిన్నమస్తిక మరియు ప్రచండ చండికగా పిలువబడే ఛిన్నమస్త ఒక ముఖ్యమైన దేవత. తాంత్రిక బౌద్ధ మతంలో ఈమెను ఛిన్నముండ అని పిలుస్తారు. ఛిన్నమస్తా దేవిని శక్తి యొక్క రౌద్ర రూపంగా కొలుస్తారు. ఛిన్నమస్త అనగా "ఖండింపబడిన శిరస్సు " అని అర్ధం. ఈ హిందూ ఆధ్యాత్మిక అమ్మవారు భీతికరమైన ప్రతిరూపంతో చిత్రీకరింపబడినది. ఆమె జన్మదినాన్ని "ఛిన్నమస్త జయంతి"గా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్ధశి నాడు వస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ , 28వ తేదీన ఛిన్నమస్త జయంతి జరుపుకోబోతున్నారు.

హిందూమతంలో ఉన్న దేవతలలోకెల్ల అత్యంత ఉగ్రరూపంతో ఉండే దేవతలలో ఛిన్నమస్త ఒకరు. స్వీయ-శిరచ్ఛేదం చేరుకున్న ఈమె ఒక శక్తిపీఠ దేవత. ఛిన్నమస్త ప్రాణదాత మరియు ప్రాణహర్త. మహావిద్యాలలో ఒక దేవతగా కొలువబడే ఈమెను లైంగిక వాంఛపై స్వీయ నియంత్రణకు చిహ్నంగా లైంగిక శక్తిస్వరూపిణిగా భావిస్తారు.

Chinnamasta | Chinnamasta Story | Tantric Goddess

పురాణాల ప్రకారం ఆమె తన మాతృభావనలతో చేసిన త్యాగానికి,తన లైంగిక ఆధిపత్య ధోరణికి మరియు స్వీయ వినాశకారక రౌద్రానికి ప్రతీక.ఆమె తీరు రౌద్రం మరియు భీభత్సంతో కూడుకుని వుంటుంది. కనుక ఆమెను అన్ని చోట్ల పూజించరు. ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా ఉత్తర భారతం మరియు నేపాల్ లో ఉంటాయి. ఆమెను హిందువులు మరియు బౌద్ధ మతం వారు పూజిస్తారు. బౌద్ధ మతంలో ఈమెను ఛిన్నముండ అని పిలిచే దేవత ఛిన్నమస్తను పోలి ఉంటుంది. ఛిన్నముండ, వజ్రయోగిని పేరుతో టిబెట్ కు చెందిన బౌద్ధమతం వారు కొలిచే ఖండిత శిరస్సు కలిగిన దేవత.

ఛిన్నమస్త నగ్నరూపంలో చుట్టూ పరుచుకున్న కురులతో నలుపు మరియు రుధిర వర్ణ దేహం కలిగి ఉంటుంది. ఆమె పదహారేళ్ళ ప్రాయంలో నిండైన వక్షం కలిగిన బాలికగా, హృదయం వద్ద నీలి కలువ కలిగి ఉంటుంది. ఛిన్నమస్త ఒక నగ్న జంట పై నిలబడి ఉంటుంది. ఆ జంటను శృంగార దేవదంపతులైన రతిమన్మధులుగా చెప్తారు. ఛిన్నమస్త జంధ్యంగా సర్పాన్ని ధరించి, మెడలో మహాకాళి వలే కపాలాలు, ఎముకలతో కూడిన దండను ధరించి ఉంటుంది. ఆమె ఖండిత కంఠం నుండి చిమ్ముతున్న రక్తధారలను, ఆమె సేవకురాళ్ళయిన జయ మరియు విజయ నోట్లోకి ప్రవహిస్తుంటాయి.

ఆమె ఎడమచేతిలో ఆమె కపాలంతోనే చేసిన భిక్ష పాత్ర, కుడిచేతిలో ఆమె తన శిరస్సు ఖండించడానికి ఉపయోగించిన ఖడ్గం ఉంటాయి.

కధ:

ఛిన్నమస్తా దేవి జన్మకు సంబంధించిన అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి. నారద-పంచరాత్ర పురాణములలో ఈ క్రింది కధ తెలుపబడింది. ఒకసారి మందాకిని నదిలో స్నానమాచరిస్తుండగా పార్వతి దేవికి లైంగిక ఉత్తేజం కలిగి నల్లగా మారింది. ఇంతలో ఆమె సేవకురాళ్ళయిన ఢాకిని మరియు వర్ణిని(జయ మరియు విజయ)లకు ఆకలికలిగి దేవతను తమ ఆకలి తీర్చిమని అడిగారు. జగన్మాత పార్వతి చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమి దొరకలేదు. అప్పుడు ఆమె తన శిరస్సును ఖండించుకొనగా మూడు దిశలలో చిమ్మిన మూడు రక్తధారలలో ఒకటి జయ నోట్లోనికి, రెండవది విజయ నోట్లోనికి మరియు మూడవది ఖండింపబడిన పార్వతి శిరస్సు నోట్లోనికి ప్రవహించాయి.

ఇంకొక కధ ప్రకారం ఛిన్నమస్త రతిమన్మధుల నగ్న జంట పై నిలబడి ఉంటుంది. అలా నిలబడిన ఆమె తన భౌతిక శరీరంపై పూర్తి నియంత్రణతో తన శరీరం నుండి మనస్సును విముక్తం చేసుకోవడం కొరకు శిరస్సు ఖండించుకుంటుంది.

ఛిన్నమస్తను జీవితచక్రం లోని మూడు దశలైన జన్మ, రతి మరియు మృత్యువు అనే దశలకు చిహ్నాలుగా మూడు రూపాంతరాలలో సేవిస్తారు. ఛిన్నమస్త ఇంట్లో కొలుచుకునే ప్రత్యేక దేవతగా ఆంత ప్రసిద్ధి చెందలేదు. తాంత్రికులు అతీంద్రియ శక్తులు మరియు సిద్ధి ప్రాప్తి కొరకై ఈమెను ఉపాసిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి శ్రీం హ్రీం క్లిం ఐం వజ్రవైరోచనియే హం హం ఫట్ స్వాహా అనే మంత్రం పాటించాలి.

English summary

Chinnamasta | Chinnamasta Story | Tantric Goddess

Chhinamastika Jayanti is the day when Mata Chhinamastika was born. Mata Chhinamastika is the sixth among the ten Mahavidyas. Devi Chhinamastika Jayanti falls on the fourteenth day during the Shukla Pkash in the month of Vaishakh. She is also known as Mata Chintapurni. Chhinamastika puja which is usually done by the Tantriks.
Desktop Bottom Promotion