Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Christmas: క్రిస్మస్ రోజున చర్చికి వెళ్లాలా?.. అసలు కారణం ఏంటో తెలుసా?..ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు చూడండి
ప్రతి ఏటా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను(christmas festival) జరుపుకుంటారు. ఇప్పటికే ప్రపంచ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తు జన్మదినం. ఈ రోజున యేసుక్రీస్తు జన్మించాడని చెబుతారు. క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రజలు చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తారు. అయితే ప్రస్తుతం కొంతమందికి క్రిస్మస్ అనేది సరదాగా,డ్యాన్స్ పార్టీగా లేదా టైంపాస్‌గా మాత్రమే కనిపిస్తుంది. అయితే అసలు క్రిస్మస్ అంటే ఏమిటి, దానిని ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం.
క్రిస్మస్..క్రైస్తవ మతపు ప్రధాన పండుగ. ఇది యేసుక్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ రోజు నుండి క్రైస్తవ మతానికి చెందిన ప్రజలు తమ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. క్రిస్మస్ పర్వదినాన తెల్లవారుజామున నిద్రలేచి తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. వివిధ రకాల స్వీట్లు, స్నాక్స్ తయారు చేసి ప్రజలు ఒకరి ఇళ్లను మరొకరు సందర్శిస్తారు. వారి ఇళ్లను,చర్చిలను అలంకరిస్తారు. ఇంటిపైన స్టార్ వెలిగించడం, ఇంటి ముందు క్రిస్టమస్ చెట్లను పెట్టడం వంటివి చేస్తారు. క్రిస్టమస్ చెట్లను అందంగా అలంకరించి కొవ్వొత్తులు వెలిగిస్తుంటారు.

అందుకే క్రిస్మస్ చెట్టు
క్రిస్టమస్ చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని దేశాలన్నీ పరిగణిస్తుంటాయి. ఈ చెట్టుకు ఇవ్వడం మినహా తీసుకోవడం వంటివి తెలియదని చెబుతుంటారు. అసలు డిసెంబర్ ప్రారంభమవగానే చాలాదేశాల్లో ఇళ్ల ముందు,షాపుల ముందు,ఆఫీసుల్లో క్రిస్మస్ చెట్లు కనబడుతుంటాయి. ఇప్పుడన్నీ ఆర్టిఫీషియల్ క్రిస్మస్ ట్రీలు(christmas tree) మార్కెట్లో దొరికేస్తున్నాయి కానీ అప్పట్లో సరివి చెట్ల కొమ్మలు తెచ్చి,దాన్ని క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు. అలాగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి చర్చికి వెళతారు. చర్చికి వెళ్లి యేసు ఆరాధనలో మునిగిపోతారు. మోక్షాన్ని పొందడం కోసం ప్రార్థనలు చేస్తారు.
సమాజం కోసం ప్రార్థనలు
క్రిస్మస్ రోజున దేశపు శాంతి, భద్రత,అభివృద్ధి కోసం అనేక చర్చిలలో ప్రార్థనలు కూడా నిర్వహించబడతాయి. దీని తర్వాత ప్రజలు వారి కుటుంబాలకు లేదా విచారంగా ఉన్న,అనారోగ్యంతో,వృద్ధులు లేదా ఒంటరిగా ఉన్న వ్యక్తుల దగ్గరకు వెళ్లి వారితో కలిసి ఈ సంతోషకరమైన పండుగను జరుపుకుంటారు.
యేసు ప్రభువు సందేశం
ఈ మొత్తం పండుగకు ప్రధానమైనది యేసు ప్రభువు ప్రేమ,దయ, క్షమాపణ సందేశం. ఈ రోజున ప్రజలు తమ కుటుంబ సభ్యులతో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
వివక్ష లేని సందేశం
ఈ రోజు ప్రతి ఒక్కరూ కుల,మత వివక్షను మరచి,ముఖ్యంగా ఆర్థికంగా బలహీనులు,పేదలు,నిరుపేదలు,దుఃఖంలో ఉన్నవారు,నిరాశా నిస్పృహలతో ఉన్నవారు ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ఇది క్రిస్మస్ నిజమైన అర్థం. దానిని జరుపుకోవడానికి సరైన మార్గం.



Click it and Unblock the Notifications