Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Merry christmas: హ్యాపీ క్రిస్మస్ కి బదులుగా 'మెర్రీ క్రిస్మస్' అని ఎందుకు అంటారో తెలుసా!..కారణం ఇదే
డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ సంవత్సరం చివరిలో వస్తుంది కాబట్టి దీనిని సంవత్సరంలో అతిపెద్ద చివరి పండుగ అని కూడా అంటారు. ఈ రోజున యేసు జన్మించాడని నమ్ముతారు. అందువల్ల యేసు ప్రభువు పుట్టిన రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజలు,ముఖ్యంగా క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఒకరినొకరు అభినందించుకుంటారు.
సాధారణంగా మనం ఏదైనా పండుగకు సంతోషకరమైన పదాలను జోడించి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హోలీ ఇలా శుభాకాంక్షలు తెలుపుతాము. అయితే క్రిస్మస్ రోజున హ్యాపీ క్రిస్మస్ అని కాకుండా ఎక్కువమంది 'మెర్రీ క్రిస్మస్(merry Christmas)' అని ఎందుకు విషెస్ చెప్పుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా?

మెర్రీ అంటే ఏమిటి?
మెర్రీ అనేది..క్రిస్మస్ తో మాత్రమే ఎందుకు ఉపయోగించబడుతుందో తెలుసుకోవడం ముఖ్యం. వాస్తవానికి మెర్రీ అనే పదం జర్మన్, పాత ఇంగ్లీష్ భాషలతో రూపొందించబడింది . దాని అర్థం కూడా సంతోషమే.
చారిత్రక కారణాలు
మెర్రీ అనే పదం ఇంగ్లాండ్ కు చెందిన బిషప్ జాన్ ఫిషర్‌తో ముడిపడి ఉంది. జాన్ ఫిషర్ 1534లో హెన్రీ VIII ముఖ్యమంత్రి థామస్ క్రోమ్ వెల్ కు క్రిస్మస్ సందర్భంగా "మెర్రీ క్రిస్మస్"అని శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ రాశాడు.
సాంస్కృతిక కారణాలు
1843లో చార్లెస్ డికెన్స్ నవలలో 'వి విష్ యు ఏ మెర్రీ క్రిస్మస్(we wish you a merry Christmas)'అనే పదాలు ఉపయోగించబడ్డాయి. అప్పటి నుండి సామాన్య ప్రజలలో ఇధి చాలా ప్రసిద్ధి చెందింది. అదే సంవత్సరం నుండి ఈ పదం క్రిస్మస్ కార్డులపై కూడా కనిపించడం ప్రారంభించింది. క్రమంగా మెర్రీ అనే పదం క్రిస్మస్ తో ముడిపడిపోయింది. దీంతో మెర్రీ అనే పేరు వినగానే క్రిస్మస్ గుర్తుకు వస్తుంది.
ఇంగ్లండ్ లో ఇప్పటికీ 'హ్యాపీ క్రిస్మస్'
ఇప్పటికి కూడా ఇంగ్లండ్‌లో ప్రజలు 'మెర్రీ' కి బదులుగా 'హ్యాపీ' అనే పదాన్ని క్రిస్మస్ విషెస్ చెప్పడానికి ఉపయోగిస్తారు. అమెరికాలో 'మెర్రీ క్రిస్మస్'వాడకం ఎక్కువ. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 'హ్యాపీ క్రిస్మస్' ఉపయోగించబడుతుంది. ప్రతి సంవత్సరం ఇంగ్లండ్ క్వీన్ ఎలిజబెత్ II క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు 'హ్యాపీ క్రిస్మస్' శుభాకాంక్షలు చెబుతుంది. 'మెర్రీ' అనే పదం ఉద్వేగభరితమైన అనుభూతితో ముడిపడి ఉన్నందున క్వీన్ ఎలిజబెత్ 'మెర్రీ' కంటే 'హ్యాపీ'ని ఎంచుకున్నారని చెబుతారు.



Click it and Unblock the Notifications