Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Christmas tree vastu: క్రిస్మస్ చెట్టుని ఇంట్లో అక్కడ పెడితే కష్టాలు!..ఎక్కడ ఉంచాలో చూడండి
డిసెంబర్ ప్రారంభం కాగానే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్(Christmas 2024) సందడి నెలకొంటుంది. ఏసుక్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 25న జరుపుకునే క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండుగ. చాలాదేశాల్లో ఇప్పటికే క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అయ్యాయి. క్రిస్మస్ సమయంలో ఇళ్ల ముందు,షాపుల ముందు,ఆఫీసుల్లో క్రిస్మస్ చెట్లు కనబడుతుంటాయి. ఇప్పుడన్నీ ఆర్టిఫీషియల్ క్రిస్మస్ ట్రీలు(christmas tree) మార్కెట్లో దొరికేస్తున్నాయి కానీ అప్పట్లో సరివి చెట్ల కొమ్మలు తెచ్చి,దాన్ని క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు. క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇళ్ల ముందు, కార్యాలయాలు, వ్యాపార ప్రదేశాలలో క్రిస్మస్ చెట్లను ఉంచడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొన్ని గ్రంథాలు క్రిస్మస్ చెట్టుని 'ట్రీ ఆఫ్ హెవెన్' అని సూచిస్తాయి. క్రిస్మస్ చెట్టుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏ దిశలో పెట్టుకుంటే మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం క్రిస్మస్ చెట్టుని ఏ దిక్కులో ఉంచాలా ఇక్కడ చూడండి.

క్రిస్మస్ చెట్టును ఈ వైపు ఉంచండి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం క్రిస్మస్ చెట్టును ఇంటికి ఉత్తరం వైపున ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఉత్తర దిశలో ఉంచడం సాధ్యం కాకపోతే వాయువ్య, ఈశాన్య లేదా ఆగ్నేయ దిశలో కూడా ఉంచవచ్చు.
క్రిస్మస్ చెట్టును ఈ వైపు ఉంచవద్దు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం క్రిస్మస్ చెట్టును నైరుతి దిశలో ఉంచకూడదు. నైరుతిలో క్రిస్మస్ చెట్టును ఉంచడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. భార్య, కుటుంబానికి సంబంధించి సమస్యలు వస్తాయి.
ప్రధాన ద్వారం ముందు క్రిస్మస్ చెట్టును ఉంచకూడదు. క్రిస్మస్ చెట్టును ప్రధాన తలుపు ముందు పెడితే అది బాడ్ గా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం ప్రధాన తలుపు ముందు చెట్టును ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
క్రిస్మస్ చెట్టును ఈ దీపాలతో
మీ ఇంట్లో క్రిస్మస్ చెట్టు ఉంటే దానిని ఎరుపు, పసుపు దీపాలతో అలంకరించడం ఉత్తమంగా ఉంటుంది. ఈ రంగులు ప్రేమ, స్నేహానికి ప్రతీకగా పరిగణించబడతాయి. కాబట్టి మీరు మీ క్రిస్మస్ చెట్టును ఈ రంగులతో అలంకరించినప్పుడు మీ ఇంట్లో ప్రేమ, స్నేహపూర్వక లేదా ఫ్రెండ్లీ వాతావరణం సృష్టించబడుతుంది.



Click it and Unblock the Notifications