For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Datta Jayanti 2021:దత్త జయంతి శుభ ముహుర్తం ఎప్పుడు? దత్తాత్రేయుని విశిష్టత ఏంటి?

|

హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు అవతారాల్లో దత్తావతారం ఆరో అవతారం అని.. ఈ దత్త రూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తీభవించి ఉద్భవించినదే దత్తావతారం అని పురాణాల ద్వారా తెలుస్తోంది.

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దత్తాత్రేయ జయంతిని మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ దత్తాత్రేయుడిని శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తారు. మరోవైపు మార్గశిర పూర్ణిమ రోజునే దత్తజయంతి కూడా వస్తుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అంటారు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే కచ్చితంగా శుభఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు.

ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు దత్తాత్రేయుని ఆశీర్వాదం పొందేందుకు దత్తుడిని ఆరాధిస్తారు. మరి ఈ ఏడాది 2021లో దత్త జయంతి ఎప్పుడొచ్చింది.. శుభముహుర్తం, పూజా విధానం, దత్తా అవతారం విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

భగవద్గీతను తొలిసారి అర్జునుడితో పాటు ఇంకా ఎవరెవరు విన్నారో తెలుసా...

దత్త జయంతి ఎప్పుడంటే..

దత్త జయంతి ఎప్పుడంటే..

పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. ‘దత్తం' అంటే ఇచ్చినవారు.. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడయ్యాడు. దత్తాత్రేయుని ఉపనయనం అయిన వెంటనే అడవికి వెళ్లి తపస్సు చేసి సంపూర్ణ జ్ణానాన్ని పొందాడు. దత్తుడు ప్రదోష్ కాలంలో జన్మించాడని చాలా మంది నమ్ముతారు. 2021 సంవత్సరంలో డిసెంబర్ 18వ తేదీన అంటే శనివారం నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. పూర్ణిమ తిథి డిసెంబర్ 18న ఉదయం 7:24 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 19వ తేదీ ఉదయం 10:05 గంటల కు ముగుస్తుంది.

పూజా విధానం..

పూజా విధానం..

దత్త జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, పవిత్ర గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఉతికిన బట్టలు ధరించి పూజకు సిద్ధమవ్వాలి. ముందుగా గంగాజలంతో దత్తాత్రేయ చిత్రాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఆ స్వామికి పూలమాలలు, పువ్వులు సమర్పించి దీపం వెలిగించాలి. ఆ తర్వాత పూజను ప్రారంభించి హారతి ఇవ్వాలి. అనంతరం ప్రసాదం పంపిణీ చేయాలి.

దత్తాత్రేయుని రూపం..

దత్తాత్రేయుని రూపం..

దత్తాత్రేయుడు 24 మందిని తన గురువులుగా భావించి, వారి నుండి జ్ణానాన్ని పొందాడు. దత్తాత్రేయునికి మూడు తలలు మరియు ఆరు చేతులున్నాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. కార్తవీర్యుడు, పరశురాముడు, యదవు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు తదితర గ్రంథాలను రచించాడు.

దత్త చరిత్ర..

దత్త చరిత్ర..

దత్త పురాణం ప్రకారం.. దత్తుడు పదహారు అంశలు కలవాడు. శ్రీపాదవల్లభులు, శ్రీన్రుసింహ సరస్వతి, శ్రీ అక్కల్ కోట మహారాజ్, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహారాజ్, శ్రీక్రిష్ణ సరస్వతీ మహారాజ్, వాసుదేవానంద సరస్వతీ మహారాజ్ గా దత్తావతారాలుగా వెలసినట్లు దత్త చరిత్ర ద్వారా తెలుస్తోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు. మహర్షి అత్రి ముని భార్య అనసూయ ధర్మాన్ని పరీక్షించే నిమిత్తం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భూలోకానికి చేరుకున్నారు. అత్రి ముని ఆశ్రమానికి చేరుకుని తల్లి అనసూయ ముందు భోజనం చేయాలని కోరారు. అయితే ముక్కోటి దేవతలు మాత్రం వారికి నగ్నంగా భోజనం పెట్టాలని నిబంధన పెడతారు. దీంతో తల్లి అనసూయ కంగారు పడింది. ముందుగా ద్యానం ముగించుకుని.. అనసూయ అత్రిముని కమండలం నుండి నీటిని తీసి ఆ ముగ్గురు సాధువులపై చల్లింది. దీంతో వారు ముగ్గురు వెంటనే ఆరు నెలల శిశువులుగా మారారు. అప్పుడు అమ్మవారు నిబంధన మేరకు వారికి భోజనం పెట్టారు. అనంతరం పార్వతీ, సరస్వతీ మరియు లక్ష్మీ దేవతలు భూలోకానికి చేరుకుని తల్లి అనసూయను క్షమించమని వేడుకున్నారు. ఆ తర్వాత ముక్కోటి దేవతలు కూడా తమ తప్పును అంగీకరించారు. ఆ తర్వాత దేవతలు దత్తాత్రేయునిగా జన్మించారు. అప్పటి నుండి మాత అనసయన పుత్రదాయినిగా పూజిస్తారు మరియు దత్తాత్రేయుని పుట్టినరోజునే దత్త జయంతి జరుపుకుంటారు.

కోర్ల పౌర్ణమి..

కోర్ల పౌర్ణమి..

దత్తజయంతిని మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు అని పండితులు చెబుతుంటారు. మత్స్యపురాణం, స్మ్రుతి కౌస్తుభంలో దత్త చరితం గురించి వివరాలు ఉన్నాయి. మార్గశిర పూర్ణిమ నాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈరోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సకలశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమిని ‘కోర్ల పౌర్ణమి'గా పిలుస్తారు.

దత్తా జయంతి వేడుకలను ఎక్కడ జరుపుకుంటారు?

దత్తాత్రేయ జయంతిని మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ దత్తాత్రేయుడిని శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తారు.

2021లో దత్తా జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు?

2021 సంవత్సరంలో డిసెంబర్ 18వ తేదీన అంటే శనివారం నాడు దత్తా జయంతి వేడుకలను జరుపుకోనున్నారు. దత్త జయంతి రోజున దత్తాత్రేయ భగవంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. మరోవైపు మార్గశిర పూర్ణిమ రోజునే దత్తజయంతి కూడా వస్తుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అంటారు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే కచ్చితంగా శుభఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు.

English summary

Datta Jayanti 2021: Date, history and significance of birth anniversary of Lord Dattatreya in Telugu

Here we are talking about the Datta Jayanti 2021: date, history and significance of birth anniversary of lord dattatreya in Telugu. Have a look
Story first published: Thursday, December 16, 2021, 18:43 [IST]