For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్తీక మాసంలో ప్రభోధ ఏకాదశి రోజున ఈ పనులు చేస్తే.. ఎంతో పుణ్యం లభిస్తుందట...!

2021లో ఈ ఏకాదశి తేదీ, శుభ ముహుర్తం, ఆచారాలు, పూజా విధి మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పురాణాల ప్రకారం, కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో అనేక పండుగలు, వ్రతాలు వస్తాయి. ఈ మాసమంతా ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు.

Devutthana Ekadashi 2021 Vrat Date, Shubh Muhurat, Rituals, Story, Fasting Days and Significance in Telugu

ఇదే మాసంలో దేవుత్తని ఏకాదశి కూడా వస్తుంది. దేవుత్తని ఏకాదశినే ప్రభోధన ఏకాదశి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొంటాడని పురాణాల్లో పేర్కొనబడింది.

Devutthana Ekadashi 2021 Vrat Date, Shubh Muhurat, Rituals, Story, Fasting Days and Significance in Telugu

ఈరోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో దేవుత్తని ఏకాదశి ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం ఎప్పుడు.. ఈ ఏకాదశి యొక్కప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Tulsi Vivah 2021: ఉసిరితోనే తులసి వివాహం ఎందుకు జరుగుతుందో తెలుసా...Tulsi Vivah 2021: ఉసిరితోనే తులసి వివాహం ఎందుకు జరుగుతుందో తెలుసా...

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

హిందూ పంచాంగం ప్రకారం, 2021 సంవత్సరంలో నవంబర్ 14వ తేదీన అంటే ఆదివారం నాడు కార్తీక శుద్ధ ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శ్రీ విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొంటాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఏకాదశి తిథి నవంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 5:48 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 15వ తేదీ ఉదయం 6:39 గంటలకు ముగుస్తుంది.

బృందావన ఏకాదశి..

బృందావన ఏకాదశి..

కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి దేవుత్తని ఏకాదశి, ప్రభోధన ఏకాదశి లేదా బృందావన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు నిద్ర నుండి మేల్కొంటారు కాబట్టి ఈ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అయ్యింది. తొలి ఏకాదశి రోజున ప్రారంభమైన ఛాతుర్మస వత్రం ఈ సమయంలో ముగుస్తుంది.

ఉపవాస నియమాలు..

ఉపవాస నియమాలు..

ఈ పవిత్రమైన రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈరోజున ఉపవాసం ఉండే వారు నీటిని మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అలాగే ఈరోజున దేవ్ ఉత్తని ఏకాదశి కథ చదడం లేదా వినడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే పిత్రు దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుందట.

కార్తీక మాసంలోనే వనభోజనాలెందుకు చేస్తారు.. ఆ చెట్టు కిందే తినాలని ఎందుకంటారో తెలుసా...కార్తీక మాసంలోనే వనభోజనాలెందుకు చేస్తారు.. ఆ చెట్టు కిందే తినాలని ఎందుకంటారో తెలుసా...

పూజా విధానం..

పూజా విధానం..

కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉదయాన్నేస్నానం చేసి ఇంట్లో లేదా దేవాలయంలో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి గంగాజలంతో అభిషేకం చేయాలి. అనంతరం పువ్వులు మరియు తులసి ఆకులను సమర్పించాలి. భగవంతునికి హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. అనంతరం దేవ్ ఉత్తాని మరియు మంత్రాలను కూడా చదవాలి.

కార్తీక ఏకాదశి ప్రాముఖ్యత..

కార్తీక ఏకాదశి ప్రాముఖ్యత..

మహా భారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి రోజునే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ణ వల్క్య మహర్షి కూడా ఈరోజునే జన్మించారు. ఈరోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి వేళ జాగరణ చేయాలి. ఆ తర్వాత ద్వాదశి సమయంలో విష్ణుపూజ చేసి పారణ చేసి (ఆహారం తీసుకుని) వ్రతాన్ని ముగించాలి.

స్కంద పురాణంలో..

స్కంద పురాణంలో..

కార్తీక శుద్ధ ఏకాదశి గురించి స్కంద పురాణంలో ప్రస్తావించారు. దీని ప్రకారం, బ్రహ్మ, నారదునికి మధ్య సంభాషణ జరుగుతుంది. ఎవరైతే దేవుత్తని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వ్రతం చేస్తారో.. వారికి 100 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుందని చెబుతారు. టన్నుల కొద్దీ పత్తిని చిన్న అగ్గిపుల్ల ఎలా కాలుస్తుందో ఒక జీవుడు కూడా తన జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. అలాగే ఈ వ్రతం సమయంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్య గ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుందట.

FAQ's
  • 2021 నవంబర్ లో దేవుత్తని ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడు?

    దేవుత్తని ఏకాదశినే ప్రభోధన ఏకాదశి అని కూడా అంటారు. 2021 సంవత్సరంలో నవంబర్ 14వ తేదీన అంటే ఆదివారం నాడు కార్తీక శుద్ధ ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శ్రీ విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొంటాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఈరోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

English summary

Devutthana Ekadashi 2021 Vrat Date, Shubh Muhurat, Rituals, Story, Fasting Days and Significance in Telugu

Here we are talking about the devatthana ekadashi 2021 vrat date, shubh muhurat, rituals, story, fasting dasy and significance in Telugu. Have a look,
Story first published:Thursday, November 11, 2021, 15:47 [IST]
Desktop Bottom Promotion