Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
శివుడుకి వివిధ రకాల అభిషేకాలు, మరియు వాటి ఫలితములు...
అన్నట్లు శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశీవుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు ... ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలపాటు సకల శుభాలతో అలరారుతుంటాయి. అంతే కాకుండా, మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?
సాధారణంగా శివుడిని నీటితో గానీ ... పాలతోగాని అభిషేకిస్తుంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. మరి ఏ ఏ అభిషేకం వల్ల ఎలాంటి ఫలితం పొందవచ్చో చూద్దాం...

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.

శివుడుకి ప్రీతికరమైన అభిషేకాలు: వాటి ఫలితాలు
పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

Click it and Unblock the Notifications