For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళికి ముందే మీ ఇంట్లో నుండి ఈ వస్తువులను పడేయండి...

దీపావళి పండుగకు ముందు ఈ వస్తువులను మీ ఇంటి నుండి తొలగించండి...

|

దీపావళి పండుగ అంటే చిన్నారులకు ఎంతగానో ఇష్టం. దసరా తర్వాత వచ్చే ఈ పండుగ కోసం చిన్నారులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. ఈ పండుగ సమయంలో దీపాలు వెలిగించి.. బంధువులు, స్నేహితులతో కలిసి క్రాకర్స్ కాల్చాలని తెగ ఉత్సాహం చూపుతుంటారు.

Diwali 2020: Remove These Things From the House Before festival

ఈ దీపావళి పండుగ అంటే కేవలం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ సమయంలోనే లక్ష్మీదేవి పుట్టిందని చాలా మంది నమ్మకం. అందుకే ఈ పవిత్రమైన సమయంలో లక్ష్మీదేవిని పూజించి ఇంట్లోకి ఆ దేవతను ఆహ్వానించాలని కోరుకుంటూ ఉంటారు.

Diwali 2020: Remove These Things From the House Before festival

పురాణాల ప్రకారం, లక్ష్మీదేవి పుట్టినరోజు నాడు శ్రీవిష్ణువు తనకు ఏం కావాలని అడగగా, ఆ దేవి భూలోకానికి తానే స్వయంగా వెళ్లి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్పగా.. ఆ కోరికను వెంటనే నెరవేర్చారట విష్ణువు.

Diwali 2020: Remove These Things From the House Before festival

అలా అప్పటి ప్రతి దీపావళి సమయానికి ఆ దేవత భూమి మీదకు వస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. అయితే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే సమయంలో మీ ఇంట్లో ఇలాంటి వస్తువులను అస్సలు ఉంచకూడదట. ఒకవేళ అలా ఉంచితే.. మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశముందట. కాబట్టి దీపావళికి నాలుగురోజులు ముందుగానే మీ ఇంట్లో అలాంటి వస్తువులుంటే వెంటనే తొలగించండి. ఇంతకీ ఆ వస్తువులేంటో వాటిని ఎందుకు తొలగించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

దీపావళి సందర్భంగా అత్యంత శక్తివంతమైన కాళి మంత్రం జపిస్తే మీ జీవితంలో అన్నీ విజయాలే..దీపావళి సందర్భంగా అత్యంత శక్తివంతమైన కాళి మంత్రం జపిస్తే మీ జీవితంలో అన్నీ విజయాలే..

పాత దీపాలను వాడితే..

పాత దీపాలను వాడితే..

మీరు గత ఏడాది వాడిన దీపాలను మళ్లీ వాడకూడదంట. ఎవరి స్థాయి మేరకు.. వారు కొత్త దీపాలను అవి కూడా మట్టితో చేసిన వాటిని కొనుగోలు చేసి దీపావళి పండుగను జరుపుకుంటే ఆ తల్లి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది.

ఇవి ఉంటే..

ఇవి ఉంటే..

మీ ఇంట్లో చిన్నారులు ఆడుకునే బొమ్మలలో ఏవైనా విరిగిపోయి ఉంటే, వాటిని కూడా వెంటనే బయట పడేయాలి. అలాగే చినిగిన బట్టలేవైనా ఉంటే, వాటిని కూడా పడేయాలంట. ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదంట.

పగిలిన వస్తవులు..

పగిలిన వస్తవులు..

మీ ఇంట్లో విరిగిపోయిన మంచాలు.. లేదా శబ్దం వచ్చే మంచాలు, పగిలిన అద్దాలు ఉండకూడదట. అలాంటివి ఉంటే మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉందట. ఇక శబ్దం వచ్చే మంచం లాంటివి ఉంటే వెంటనే వాటిని బాగు చేయించాలి, లేదంటే బయటపడేయాలి.

చెద పట్టిన ఫోటోలు..

చెద పట్టిన ఫోటోలు..

మీ ఇంట్లో గానీ.. లేదా మీ చేతికి గానీ ఆగిపోయిన గడియారం.. ఉంటే వెంటనే వాటిని బాగు చేయించాలి. లేదా వాటిని కూడా పడేసి కొత్తవాటిని తీసుకురావాలి. అలాగే చెద పట్టిన ఫొటోలు ఉంటే కూడా బయటపడేయాలంట. మీ ఇంటి గుమ్మం దగ్గర ఏమైనా రిపేరి ఉంటే వాటిని కూడా వెంటనే బాగు చేయించాలి.

ఇవి చేయాలి..

ఇవి చేయాలి..

దీపావళి పండుగ సమయంలో లక్ష్మీదేవిని పూజించే వేళ.. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోనే దీపారాధన చేయడం మంచిది. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు తప్పకుండా లభిస్తుంది. అలా వెలిగించిన దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

ఇంటిని శుభ్రంగా..

ఇంటిని శుభ్రంగా..

లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చే సమయంలో మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే దీపావళికి కనీసం నాలుగు రోజుల ముందు నుండే మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరు మీ ఇంటిని క్లీన్ చేసుకోవడమే కాదు.. పనికిరాని వస్తువులను కూడా ఇంట్లో ఉంచకూడదు. ఒకవేళ అలా ఉంచితే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందట.

English summary

Diwali 2020: Remove These Things From the House Before festival

Here we talking about diwali 2020 : remove these things from the house before festival.
Desktop Bottom Promotion