For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali 2021: దీపావళి వేళ ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుందట...!

దీపావళి సందర్భంగా ఇంట్లో లక్ష్మీపూజ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన హిందూ సంప్రదాయం ప్రకారం, దీపావళి పండుగ వేళ ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని విధిగా పూజిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అశ్వీయుజ మాసంలో బహుళ అమావాస్య రోజున దీపాలను వెలిగించి దీపావళి పండుగను జరుపుకుంటారు.

Diwali lakshmi puja vidhi at home in Telugu

మరి కొన్ని ప్రాంతాల్లో అమావాస్య తర్వాతి రోజున అంటే పాడ్యమి రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా వ్యాపారులు ఎక్కువగా లక్ష్మీదేవిని ఇంట్లో, వారి షాపులో పూజిస్తారు.

Diwali lakshmi puja vidhi at home in Telugu

లక్ష్మీదేవిని ఇలా పూజించడం వల్ల ఏడాదంతా తమకు ఆర్థిక పరంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా... అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని.. శ్రేయస్సు పొందుతామని నమ్ముతారు.

Diwali lakshmi puja vidhi at home in Telugu

ఈ సందర్భంగా దీపావళి పండుగ వేళ లక్ష్మీదేవిని ఇంట్లో పూజించే విధానం.. కార్తీక మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలి.. ఏ సమయంలో అమ్మవారిని ఆరాధించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

దీపావళి వేళ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే.. ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి...దీపావళి వేళ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే.. ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి...

శుభ సమయం..

శుభ సమయం..

ఉత్తర భారతంలో నవంబర్ 4వ తేదీన అంటే గురువారం నాడు అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అదే దక్షిణ భారతంలో అయితే అమావాస్య మరుసటి రోజున అంటే పాడ్యమి రోజున శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో నవంబర్ 4వ తేదీన శుభ ముహుర్తం ఉదయం 6:03 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 2:44 గంటలకు శుభ ముహుర్తం ఉంది. అలాగే సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకు లక్ష్మీపూజకు శుభ ముహుర్తం ప్రారంభమై.. రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ముగియనుంది.

ఇలా చేయాలి..

ఇలా చేయాలి..

ఈరోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేస్తారు. కొత్త బట్టలను ధరిస్తారు. లేదంటే ఉతికిన బట్టలను ధరించి పూజా గదిని శుభ్రం చేస్తారు. అలాగే తమ ఇంటిని మొత్తం శుభ్రంగా చేసుకుని పూజకు సిద్ధమవుతారు. అదే సమయంలో పాత వస్తువులను ఇంట్లో నుండి తొలగిస్తారు. ముఖ్యంగా విరిగిన పాత్రలను బయటపడేయాలి.

పూజా సామాగ్రి..

పూజా సామాగ్రి..

ఇంట్లో లక్ష్మీదేవిని పూజించే సమయంలో లక్ష్మీదేవి, వినాయకుని విగ్రహాలు లేదా చిత్రపటాలు ఉంచాలి. ముందుగా వీటిని ఒక శుభ్రమైన వస్త్రం తీసుకుని పూజించాలి. బంగారం, వెండి నాణేలు ఉంటే వాటిని కూడా అక్కడ ఉంచాలి. సువాసన వచ్చే అగర్ బత్తీలు, చిన్న మట్టి దీపాలు, పత్తితో తయారు చేసిన వత్తులు, ఆవాల నూనె, నువ్వుల నూనెల లేదా ఆవు నెయ్యి, పాలు, పెరుగు, తేనే, స్వచ్ఛమైన నీరు, పసుపు, సున్నపు పొడి, రోలి, గంధపుపొడి, అరకిలో బియ్యం, కలశం, రెండు మీటర్ల తెల్లటి గుడ్డ, రెండు మీటర్ల ఎర్రటి గుడ్డ, కర్పూరం, కొబ్బరికాయ, డ్రై ఫ్రూట్స్, పువ్వులు (గులాబీ లేదా బంతిపూలు), తమలపాకులు, పండ్లు, స్వీట్లు, కుంకుమపువ్వు, మూడు రౌండ్ ప్లేట్లు, గరిటె, గిన్నె, చెంచాలను సిద్ధం చేసుకోవాలి.

Diwali 2021 : దీపావళి నుంచి ఈ రాశుల జీవితాల్లో సంతోషం వెలిగిపోతుందట...!Diwali 2021 : దీపావళి నుంచి ఈ రాశుల జీవితాల్లో సంతోషం వెలిగిపోతుందట...!

పూజా విధానం..

పూజా విధానం..

లక్ష్మీగణేశుని విగ్రహాలను తూర్పు దిశలో ఉంచాలి. పూజకు కూర్చునే వారు విగ్రహాల ఎదుట కూర్చోవాలి. లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పంచామ్రుతం ఉంచి, కలశం ఉంచాలి. కొబ్బరికాయను ముందు భాగం స్పష్టంగా కనిపించేలా ఎర్రటి గుడ్డలో చుట్టి కలశంపై ఉంచాలి. ఒక పెద్ద దీపంలో నెయ్యి లేదా నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వినాయక విగ్రహం వద్ద ఉంచాలి. అనంతరం కలశం వైపు ఒక పిడికెడు బియ్యంతో ఎర్రటి వస్త్రాన్ని సూచించే తొమ్మిది కుప్పల నవగ్రహాలను తయారు చేయండి. మధ్యలో తమలపాకులను ఉంచాలి.

పూజా విధానం..

పూజా విధానం..

కొన్ని నీళ్లను కుండలో నుండి తీసుకుని కొన్ని నీటి చుక్కలను విగ్రహాలపై చల్లాలి. ఇలా చిలకరించడం వల్ల మిమ్మల్ని మరియు పూజా సామాగ్రి మరియు మిమ్మల్ని పవిత్రం చేసుకున్నట్టే. అనంతరం లక్ష్మీదేవి మంత్రాలను పఠిస్తూ పువ్వులను అమ్మవారికి సమర్పించండి. ‘ఓం కేశవాయ నమః' ‘ఓం నారాయణయ నమః' అనే మంత్రాన్ని తప్పక పఠించండి.

English summary

Diwali lakshmi puja vidhi at home in Telugu

Here we are talking about the diwali lakshmi puja vidhi at home in Telugu. Have a look
Story first published:Thursday, November 4, 2021, 15:18 [IST]
Desktop Bottom Promotion