Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
దీపావళి స్పెషల్: కలర్ఫుల్, డిఫెరెంట్ దివ్వెలు, కొవ్వొత్తులతో దీపావళి
దీపావళి దీపాల వెలుగులతో ముడిపడి ఉంది, అందుకే దీనిని దివ్వెల దీపావళి అని పేరుగు తగ్గట్టు పిలుస్తారు. ఆరోజున ఇళ్ళు దివ్వెలు, కొవ్వొత్తుల వెలుగులతో దీపావళిని సూచిస్తుంది. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ బహుమతులు ఇచ్చిపుచ్చు కోవడం అనేది ఒక పురాతన సంప్రదాయం.
ఇది ప్రజలు వారికి ఇష్టమైనవారిని, బంధువులను కలుసుకునే సమయం, స్నేహితులు, బహుమతులు ప్రేమకు, మంచి అభినందనలకు చిహ్నంగా భావిస్తారు. ఈ పండుగ రోజు దీపావళి దివ్వెలు, కొవ్వొత్తులు అత్యంత అందమైన, ప్రసిద్ది చెందిన బహుమతులకు ప్రత్యేకమైనది.

దివ్వెలు, కొవ్వొత్తులు వివిధ రకాల నమూనాలు, రూపాలు, సైజులలో దొరుకుతాయి. మార్కెట్టు అనేక రకాల ఆకర్షణీయమైన దివ్వెలతో నిండి ఉంటుంది. చిత్రించిన వరుసలతో, అద్భుతమైన చేక్కుళ్ళతో, అద్దాలు, గాజులతో చేతితో తయారు చేయబడిన దివ్వెలు చాలా అందంగా అలంకరించబడి ఉంటాయి.
అంతేకాకుండా క్లే తో, మెటల్ తో తయారుచేసిన దివ్వెలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇత్తడి, రాగి, కంచు, వెండి, బంగారు దివ్వెలు కూడా ఉన్నాయి. వీటి లోపలిభాగం చెక్కబడి, వైవిధ్యభరితమైన ఆకారాలలో అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్లు, దీపావళి మేళాలు, హాట్స్ దేశం మొత్తం మీద పింగాణీ, హస్త కళాకారులు తయారుచేసిన వస్తువులు పెక్కు తార్కాణాలుగా ఉన్నాయి. దీపావళి దివ్వెలు ప్రధాన ఆకర్షణలలో ఒకటి. రంగురంగుల, అద్భుతమైన రంగులతో కూడిన దివ్వెలు అద్భుతంగా కనిపిస్తాయి.
దివ్వెల లాగానే, దీపావళి రోజు కొవ్వొత్తులను కూడా బహుమతులుగా ఇస్తారు. అందమైన నమూనాలు, రంగులు, ఆకారాలు, సున్నితమైన కొవ్వొత్తులు మార్కెట్లో కనిపిస్తాయి.

కొవ్వొత్తులు తయారు చేసేవారు కొవ్వోత్తులకు చక్కదనం, రాయల్టీ ని తీసుకురావడానికి వాటితో మిరుమిట్లు గొలిపే నమూనాలను తయారుచేస్తారు. వాటిలో టీ కాంతి కొవ్వొత్తులు, వోటివ్ కొవ్వొత్తులు, సువాసన కొవ్వొత్తులు, వివిధ రంగులతో నీటిలో తేలియాడే కొవ్వొత్తులు కూడా ఉన్నాయి.

దివ్వెలు, కొవ్వొత్తులు దీపావళి బహుమతులలో ప్రత్యేకమైనవి. దివ్వెలు, కొవ్వొత్తులు వెలిగించకపోతే దీపావళి అసంపూర్తిగా ఉన్నట్టే. ఇంటిని అలంకరించడంతో పాటు, ప్రవేశ మార్గాన్ని కూడా దివ్వెలతో నింపాలి, సాయంత్రం లక్ష్మీ పూజ నిర్వహించడానికి దివ్వెలు కూడా చాలా అవసరం.

దీపావళి రోజు బహుమతులు ఇవ్వడం అనేది అత్యంత ముఖ్యమైనది. అందమైన దివ్వెలు, కొవ్వొత్తులను ప్రదర్శించడం అనేది గౌరవాన్ని, స్నేహాన్ని, కృతజ్ఞతని అందించే ఒక మార్గం.



Click it and Unblock the Notifications
