For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనొద్దు...!

శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కొనకూడని వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హిందువులు ప్రతి రోజూ దేవుళ్లకు ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. హిందూ మతం ప్రకారం, శనివారం రోజున శ్రీ వేంకటేశునికి, హనుమంతుడికి అంకితం ఇవ్వబడింది.

Do Not Buy These Things and Do This on Saturday

ఈ పవిత్రమైన రోజున ఈ దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే, తమకు వారి నుండి మంచి ఆశీస్సులు లభిస్తాయని, అన్నింటా శుభఫలితాలొస్తాయని నమ్ముతారు. ఇదిలా ఉండగా.. శనివారం రోజున కొన్ని పనులు చేయకూడదని మరియు కొన్ని వస్తువులు పొరపాటున కూడా కొనకూడదనే ఒక ఆచారం ఉంది.

Do Not Buy These Things and Do This on Saturday

ఒకవేళ ఈరోజున అలాంటి వస్తువులను కొంటే ఏం జరుగుతుంది? శనివారం రోజున ఇలాంటి వస్తువులు కొనకూడదు.. ఈ పనులు చేయకూడదనే ఆచారాలు ఎలా వచ్చాయి? వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? ఇంతకీ ఈరోజున ఏయే పనులు చేయకూడదు.. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

July 2021 Festivals List:జులైలో బోనాలు, రథయాత్ర, బక్రీద్ తో వచ్చే పండుగలు, వ్రతాలివే...July 2021 Festivals List:జులైలో బోనాలు, రథయాత్ర, బక్రీద్ తో వచ్చే పండుగలు, వ్రతాలివే...

నల్లని వస్తువులు..

నల్లని వస్తువులు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు. అయితే ఈరోజున నల్లని వస్తువులను దానం చేయొచ్చు. ఈరోజున ఎంత అత్యవసరమైనా కూడా నల్లని వస్తువులను కొనుగోలు చేయకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

నువ్వుల దీపం..

నువ్వుల దీపం..

శనివారం రోజున మీ ఇంట్లో నువ్వులనూనెతో దీపం వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది. నువ్వుల దీపాలను వెలిగించి శని దేవుడిని ఆరాధిస్తే.. ఆ భగవంతుని అనుగ్రహం పొందొచ్చు. అయితే ఈరోజు నల్ల రంగులో ఉండే నువ్వులు, ఒలియోరెసిన్ వంటి వస్తువులను కొనుగోలు చేయకండి. అయితే వీటిని ఈరోజు దానం చేయొచ్చు. దీని వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున శనివారాలలో నల్ల నువ్వులను కొనుగోలు చేస్తే, దాని వల్ల మీకు జీవితంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి.

ఇనుము ఉత్పత్తులు..

ఇనుము ఉత్పత్తులు..

కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మీరు శనివారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే, అది చెడు పరిణామాలకు కారణమవుతుందని నమ్ముతారు. ఇది కుటుంబ సభ్యులు మరియు బంధువుల మధ్య తగాదాలకు కూడా దారితీస్తుంది.

జులైలో ఈ రాశులకు శృంగార పరంగా అద్భుతంగా ఉంటుదట.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!జులైలో ఈ రాశులకు శృంగార పరంగా అద్భుతంగా ఉంటుదట.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

పర్స్, బూట్లు..

పర్స్, బూట్లు..

పర్సులు, బూట్లు, సంచులు వంటి తోలు వస్తువులను శనివారం రోజున కొనకూడదు. ఎందుకంటే ఇవి విజయానికి అవరోధంగా ఉంటాయి మరియు జీవితంలో సమస్యలను కలిగిస్తుంది.

ఉప్పు..

ఉప్పు..

మీరు శనివారాలలో కొనకూడని మరొక వస్తువు ఉప్పు. శనివారాలలో ఉప్పు కొనడం వల్ల ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతాయి. దీని వల్ల మీకు ఎక్కువ అప్పులు కూడా చేయాల్సి వస్తుందట.

స్టేషనరీ..

స్టేషనరీ..

శనివారాలలో పెన్నులు, పుస్తకాలతో పాటు స్టేషనరీ వస్తువులను కొనకండి. ఈ విధంగా కొనుగోలు చేస్తే, మీరు అధ్యయనాలు సరిగ్గా చేయలేరు. ఇంటర్వ్యూలలో కూడా పేలవమైన ప్రదర్శన ఇస్తారు. మీరు ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ కాకపోవచ్చు.

Monthly Horoscope July 2021: జులై మాసంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...Monthly Horoscope July 2021: జులై మాసంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

కొత్త వాహనాలు, దుస్తులు..

కొత్త వాహనాలు, దుస్తులు..

శని వారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట. ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి. శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు. అలాగే కొత్త బట్టలను కూడా కొనడం మంచిది కాదట. ఎందుకంటే ఇనుము శనితో సంబంధం ఉన్న మరో లోహం. అయితే ఈరోజున ఇనుము వంటి లోహాలను దానం చేస్తే మంచి ప్రయోజనాలు వస్తాయట.

ఇతర విషయాలు..

ఇతర విషయాలు..

కొంతమంది శనివారాలలో గోళ్లు కత్తిరించరు. ఎందుకంటే గోర్లు లోహాలతో కత్తిరించబడతాయి. అదేవిధంగా, పైన పేర్కొన్నవన్నీ హిందూ బోధనలు లేదా వేదాల మీద ఆధారపడి ఉండవని గుర్తుంచుకోవాలి. ఇది చాలాకాలంగా అన్ని నమ్మకాలు అనుసరిస్తున్న ఒక అభ్యాసం. ప్రజలు ఇటువంటి ఆచారాలు ఆచరించడానికి భయం ప్రధాన కారణమని మరికొందరు చెబుతుంటారు.

English summary

Do Not Buy These Things and Do This on Saturday

There are certain things that are avoided on Saturday (Shanivar) by Hindus who strictly follow astrology and horoscope. Here is a list of things not to buy on Saturday.
Story first published:Saturday, July 3, 2021, 9:03 [IST]
Desktop Bottom Promotion