For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొక్కులు చెల్లించకుంటే దేవుడు కోప్పడతాడా? అక్కడ ఎంత డబ్బున్న వారైనా బిక్షమెత్తుకుంటారు

ప్రతీ మనిషికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మొదట గుర్తుకువచ్చేది దేవుడే. సుఖాలు రాగానే ఎంజాయ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది.మొక్కులు చెల్లించకుంటే దేవుడు కోప్పడతాడా? అక్కడ ఎంత డబ్బున్న వారైనా బిక్షమెత్తుకుంటార

|

ప్రతీ మనిషికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మొదట గుర్తుకువచ్చేది దేవుడే. సుఖాలు రాగానే ఎంజాయ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది కాని, కష్టంలో మాత్రం ఖచ్చితంగా దేవుడే గుర్తుకువస్తాడు. గుర్తుకు రాగానే గుడికి వెళ్తాం.

గుడికి వెళ్ళగానే మొదట కొంత sమనశ్శాంతి వస్తుంది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని, ఆపద రాగానే ఆ దేవుడిని వేడుకుంటాం. ఈ ఆపద నుంచి గట్టేక్కించు తండ్రి అని వేడుకుని, మొక్కులు మొక్కుకుంటాం. అలా దేవుడిని మొక్కుకుని ఆ ఆపద నుంచి బయట పడతాం.

ఆపద నుంచి బయటపడ్డాక

ఆపద నుంచి బయటపడ్డాక

దేవునికి మొక్కుని, ఆ ఆపద నుంచి బయటపడిన తరవాత కొందరు మొక్కిన మొక్కు గురించి మరచిపోతారు. లేదంటే నిర్లక్ష్యం చేస్తారు. కాని మొక్కిన మొక్కు చెల్లించకపోతే దేవుడు ఏం చేస్తాడని కొందరు, దేవుడు శిక్షిస్తాడని, ఏదైనా అనర్ధం అవుతుందని కొందరు అంటారు. ఇంతకీ అసలు మొక్కిన మొక్కు తీర్చకపోతే, ఏమౌతుందో తెలుసుకుందాం...

ఆపదలు

ఆపదలు

జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఆపదలు ... అవాంతరాలు ఎదురవుతూ వుంటాయి. పరిస్థితి తోటివారి సాయం దాటి పోయినప్పుడు అంతా ఆ దేవుడిపైనే భారం వేస్తుంటారు. ఆ గండం నుంచి గట్టెక్కితే దైవానికి అది చేయిస్తామనీ ... ఇది చేయిస్తామని మొక్కుకుంటూ వుంటారు. ముఖ్యంగా నగదును ... ఆభరణాలను హుండీలో వేస్తామని కుటుంబ సభ్యులు అనుకుంటూ వుంటారు.

ప్రాణాలతో బయటపడాలనే

ప్రాణాలతో బయటపడాలనే

తమ వారు ప్రాణాలతో బయటపడాలనే ఆందోళనలో ... లేదంటే ఏదైనా ఒక క్లిష్టమైన సమస్యను అధిగమించాలనే కంగారులోనో ఎవరికి తోచిన మొక్కులు వాళ్లు మొక్కేస్తుంటారు. తమ కుటుంబ సభ్యుడు కష్టం నుంచి గట్టెక్కాక, వాళ్లకి అనుక్షణం మొక్కులు గుర్తుకు వస్తూనే వుంటాయి. అయితే గండం గడిచిపోయింది కాబట్టి, మొక్కుబడులు తీరిగ్గా చెల్లించుకోవచ్చని అనుకుంటారు.

స్వయంగా వస్తామని

స్వయంగా వస్తామని

ఇక తామే స్వయంగా వస్తామని అనుకున్న క్షేత్రానికి వెళ్లకుండా, అక్కడికి వెళుతోన్న బంధుమిత్రులతో ఆ మొక్కుబడులను పంపించేస్తుంటారు. తమకి వెళ్లడం కుదరడం లేదు కనుక, వారితో పంపించామని మనసుకి సర్దిచెప్పుకుంటూ వుంటారు.

బంధుమిత్రులకు ఇచ్చినప్పుడు

బంధుమిత్రులకు ఇచ్చినప్పుడు

ఇలా కానుకలు హుండీలో వేయమని బంధుమిత్రులకు ఇచ్చినప్పుడు, ఒక్కోసారి వాళ్లు మరిచిపోతుంటారు. మరికొందరు ఆ డబ్బును తమ సొంత ఖర్చులకు వాడేస్తుంటారు. ఇంకొందరమో వాటిలో ఖర్చులుపోను మిగిలినవి మాత్రమే హుండీలో సమర్పిస్తుంటారు. ఇంత జరుగుతున్నా భగవంతుడు ఎవరినీ పల్లెత్తు మాట అనడు ... పరిగెత్తుకు వచ్చేసి శిక్షించడు.

దోష ఫలితాన్ని పొందిన వాళ్లు

దోష ఫలితాన్ని పొందిన వాళ్లు

అయితే కొందరి భక్తుల అనుభవాలను పరిశీలిస్తే మాత్రం, మొక్కుబడుల విషయంలో మాట తప్పిన కారణంగా ఆ తరువాత వాళ్లు తగిన ఫలితాన్ని అనుభవించినట్టు తెలుస్తుంది.ఇక మొక్కుబడులు చెల్లించమని ఇస్తే, ఆ సొమ్మును వాడుకుని ఆ దోష ఫలితాన్ని పొందిన వాళ్లు కూడా లేకపోలేదు.

విశ్వాసం లేనట్టుగా భావిస్తాడు

విశ్వాసం లేనట్టుగా భావిస్తాడు

భగవంతుడు మనం మొక్కుల రూపంలో చెల్లించే సొమ్ముకు ఆశపడడు. ఆ మొక్కు చెల్లించలేదంటే తనపై విశ్వాసం లేనట్టుగా భావించి బాధపడతాడు. ఈ దోషమే మరిన్ని కష్టనష్టాలకు కారణమవుతూ వుంటుంది. అందువలన ఏదైతే దైవానికి మొక్కుకుంటామో అది ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న సమయానికి భగవంతుడికి చెల్లించాలి.

సొమ్మును సొంత ఖర్చులకు ఉపయోగించొద్దు

సొమ్మును సొంత ఖర్చులకు ఉపయోగించొద్దు

మొక్కుబడిగా చెల్లించమంటూ ఒకరిచ్చిన సొమ్మును సొంత ఖర్చులకు ఉపయోగించడంగానీ, ఆ సొమ్ముని హుండీలో సమర్పించకపోవడం గాని చేయకూడదు. మొక్కు చెల్లించడమంటే భగవంతుడి పట్ల భక్తిశ్రద్ధలను కనబరచడం ... ఆయన పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రకటించడమనే విషయాన్ని మరిచిపోకూడదు.

సత్తెమ్మ తల్లి

సత్తెమ్మ తల్లి

ఇక కోరిన కోర్కెలు తీరితే దేవుడికి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. హుండీలో డబ్బులు వేయడం, పూజలు చేయించడం, కొత్త వస్త్రాలు ఇవ్వడం, అభిషేకాలు ..ఇట్లా పలు రకాలు మొక్కులు చెల్లించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే, ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కొప్పవరం ‘సత్తెమ్మ తల్లి' అమ్మవారు ప్రత్యేకమనే చెప్పాలి.

బిచ్చమెత్తుకుంటారు

బిచ్చమెత్తుకుంటారు

ఎందుకంటే, రెండేళ్ల కొకసారి ఇక్కడ జరిగే జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కోరిన కోర్కెలు తీరితే ఇక్కడ మొక్కేమిటంటే.. బిచ్చమెత్తడం. అలా వచ్చిన సొమ్మును, కానుకలను అమ్మవారి హుండీలో వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకోసం చిత్ర, విచిత్ర వేషాలు ధరించి బిచ్చ మెత్తుతుంటారు. కర్రి వంశీకుల ఆడపడచుగా పూజలందుకునే సత్తెమ్మ తల్లి జాతర ఏటా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేలు కూడా బిచ్చమెత్తి తమ మొక్కు తీర్చుకున్న సంఘటనలున్నాయి. అయితే ఏ దేవుడినైనా సరే మనం డిమాండ్ చేయకపోవడం మంచిదట. దేవుడిని భక్తితో మాత్రమే కోరుకోవాలట.

English summary

do not demand anything from god

do not demand anything from god
Desktop Bottom Promotion