Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శుక్రవారం పొరపాటున కూడా ఈ పని చేయకండి..చేశారో మీ బతుకు బస్టాండే
డబ్బు అంటే ఆశ లేనిది ఎవరికి చెప్పండి. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపించేది డబ్బు. డబ్బు ఉంటేనే ఎవరైనా గౌరవం,విలువ ఇస్తారు. నీ దగ్గర డబ్బు లేకుంటే తెలిసినోడు పక్కనే ఉన్నా కనీసం పలకరించడు. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. చాలామంది తాము జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి, తనపై తన కుటుంబంపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇళ్లల్లో పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవిని రోజూ పూజిస్తే ఎప్పుడూ సంపద కొరత,ఆర్థిక నష్టాలు ఉండవని నమ్ముతారు.
సంపద, శ్రేయస్సుకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశిస్సుల కోసం శుక్రవారం చాలామంది ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రవారమే ప్రత్యేకంగా ఎందుకంటే హిందూ పురాణాల్లో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది.అలా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయడింది. శుక్రవారం నాడు చేసే పూజ, ఉపవాసం ద్వారా లక్ష్మీ దేవి సంతోషించి ఇంట్లో ఆనందం, సంపదతో నివసిస్తుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.

అయితే ఈ రోజున తెలిసో తెలియకో చేసే చిన్న పొరపాటు కూడా లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటి గుమ్మం నుండి తిరిగి వేళ్లిపోయే చేసే పనులు చేయకండి. అయితే ఇంతకీ శుక్రవారం నాటు పొరపాటున కూడా చేయకూడని పనులు ఏవో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం రోజున మాంసాహారం తినకూడదు లేదా ఇంట్లో మాంసాహారం వండకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు.
శుక్రవారం చేయకూడని పనులివే
శుక్రవారం రోజున పొరపాటున కూడా మహిళలను లేదా బాలికలను అవమానించకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. స్త్రీలను గౌరవించని ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు.
శుక్రవారం ఎవరికైనా పంచదార ఇస్తే ఐశ్వర్యం పోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున పంచదార ఇవ్వడం వల్ల జాతకంలో సంపద, శ్రేయస్సు ఇచ్చే గ్రహం శుక్రుడు బలహీనపడతాడు.
డబ్బుకు సంబంధించిన ఏదైనా లావాదేవీకి శుక్రవారం దూరంగా ఉండాలి. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి లేదా ఎవరి నుండి చాలా అవసరం ఉంటే తప్ప అప్పు తీసుకోకండి.
శుక్రవారం ఆస్తులకు సంబంధించి ఎలాంటి పనులు కూడా చేపట్టకూడదు. శుక్రవారం ఆస్తిని కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించరు. ఎందుకంటే శుక్రవారం నాడు ఆస్తులు కొనుగోలు చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపించినట్లవుతుంది.
శుక్రవారం నాడు పొరపాటున కూడా చిరిగిన, మురికి బట్టలు ధరించకూడదు.పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
శుక్రవారం పూజ గది, వంటగదికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయకూడదు.



Click it and Unblock the Notifications