Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Vastu: మీ జేబులో అవి పెట్టుకుంటే దరిద్రం మీ వెంట ఉన్నట్లే ..అవేంటో చూడండి
వాస్తు శాస్త్రం ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది ఇంటి నిర్మాణ సమయంలోనే వాస్తును ఫాలో అయితే చాలు అనుకుంటారు అయితే కేవలం ఇంటి నిర్మాణానికే కాదు జీవితంలో ప్రతిదీ వాస్తు ప్రకారం ఉంటే మంచిదని వాస్తు శాస్త్రం(Vastu shastram) తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మనకు తీవ్ర కష్టాలను తెచ్చిపెడతాయి. మనకు తెలియకుండానే మన జేబులో ఉంచుకునే కొన్ని పెట్టుకుంటాం. అయితే వాటి వల్ల మన దగ్గర డబ్బు,సంపద ఉండదని ఆర్థిక సంక్షోభానికి గురవుతామని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాస్తు ప్రకారం జేబులో డబ్బు ఉంచుకోవడం సాధారణ విషయం. కానీ చాలా సార్లు మనం డబ్బులతో పాటుగా కొన్ని ఇతర అనవసరమైన వస్తువులను ఉంచుతుంటాం. అయితే ఇలా చేయడం మనల్ని అనుకోని ఖర్చులు, ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు కాకుండా ఇతర వస్తువులను మీ జేబులో ఉంచుకోవడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. ఇది మాత్రమే కాదు డబ్బు ప్రవాహానికి కూడా అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

వాస్తు ప్రకారం జేబులో ఉంచుకోకూడనివి ఇవే
-వాస్తుశాస్త్రం ప్రకారం చిరిగిన వాలెట్ ఆర్థిక సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. అలాంటి వాలెట్ ను జేబులో ఉంచుకోవడం వల్ల జీవితంలో ఆర్థిక కొరత ఏర్పడతాయి.
-చిరిగిన నోటును మీ జేబులో ఉంచుకోవడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. మీ వాలెట్‌లో పాత రసీదులు,విజిటింగ్ కార్డ్‌లు లేదా చిరిగిన నోట్లు వంటివి పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇవి దురదృష్టాన్ని తెస్తాయి. లక్ష్మీదేవికి కోపం కూడా రావచ్చు. కాబట్టి దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-వాస్తుశాస్త్రం ప్రకారం అసూయ లేదా కోపం వంటి భావాలను సృష్టించే ఫొటోలను మీ జేబులో ఉంచుకోవద్దు. ఇలాంటి ఫొటోలు నెగెటివ్ ఎనర్జీని తెస్తాయి. వాస్తు ప్రకారం ఇవి మీ ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేస్తాయి.
-మందులను లేదా మెడిసిన్స్ కొనుగోలు చేసేటప్పుడు అవి మీ జేబులో పెట్టుకోకండి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు. ఔషధంతో సంబంధం ఉన్న శక్తి మీ సంపద, శ్రేయస్సుకు మంచిది కాదు.
Note: మత విశ్వాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications