Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
బల్లికి మనుషుల భవిష్యత్ నిర్ణయించే సత్తా ఉంటుందా ?
బల్లిని చూడగానే.. కెవ్వు మంటారు. లేదా మనమీద ఎక్కడ పడుతుందో అని పరుగులు పెడతారు. బల్లిని చూస్తే చాలు.. చాలా మందికి నచ్చదు. అయితే మరికొందరికి బల్లి అంటే అశుభమన్న అపోహలున్నాయి. బల్లి తాకితే అపచారమూ, ఫలితమూ రెండూ ఉన్నాయని ఒక నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. అయితే.. బల్లి అరిచినా.. కొన్ని సంకేతాలున్నాయని మూఢ నమ్మకం కూడా ఉంది. ఇంతకీ బల్లి శాస్ర్తం నిజమేనా ? బల్లికి మనుషుల భవిష్యత్ నిర్ణయించే సత్తా ఉందా ?
పాములు 12ఏళ్లు పగ పట్టడం వాస్తవమేనా ?
ఇంట్లో గోడలపై పాకుతూ.. అన్ని రూముల్లోనూ తిష్టవేసే బల్లులు మనుషుల్లో ఎక్కడలేని భయం క్రియేట్ చేశాయి. దీనికి బల్లిశాస్ర్తమే ఒకరకంగా కారణం. అయితే చిన్న పురుగులను తింటూ బతికేసే బల్లులకు ఎలాంటి శక్తి లేదు. అవి మనుషుల అనారోగ్యాలను దెబ్బతీసేంత క్రూరమైనవి కావట. బల్లిల చుట్టూ మనుషులు పెట్టుకున్న నమ్మకాలు, మూఢనమ్మకాలు మాత్రమే అని అధ్యయనాలు చెబుతున్నాయి.

బల్లి మనుషులపై పడే స్థానాన్ని బట్టి.. వాళ్లకు జరిగే మంచి చెడులను చాలా ఏళ్ల నుంచి నమ్ముతూ వస్తున్నాం. మగవాళ్ల తలపై పడితే మరణం, ముఖం మీద పడితే సంపద, గడ్డం మీద పడితే అవరోధాలు, పాదం మీద పడితే అనారోగ్యం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. అలాగే స్త్రీలకు చేతి మీద పడితే ఆర్థిక సమస్యలు, భుజం మీద పడితే ఆభరణాలు, వీపు మీద పడితే మరణమని, ఛాతి మీద పడితే అశాంతి కలుగుతుందని నమ్మకం ఉంది.
బల్లులను వదిలించుకోవటం కొరకు ఉత్తమ హోం రెమిడీస్
అంతేకాదు బల్లి తాకితేనే కాదు.. బల్లి అరుపుకి అద్భుతమైన నిర్వచనాలున్నాయి. తూర్పు వైపు బల్లి శబ్దం చేస్తే అశుభం, ఆగ్నేయం వైపు అరిస్తే కలహాలు, తగాదాలు, దక్షిణంవైపు అరిస్తే శుభకార్యాలు, అదృష్టం వరిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. ఇలా రకరకాల నమ్మకాలతో బల్లి అంటే.. చిన్నప్పటి నుంచి ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశారు. కానీ బల్లి శాస్ర్తం వెనక ఉన్న అసలు రహస్యం ఇది కాదు.
గతంలో ఉండే బల్లలు చాలా ప్రమాదకరమైనవట. అవి విషప్రభావం కలిగి ఉండేవట. వాటి ద్వారా పడే ద్రావణం విషపూరితమైనది కావడంతో మనుషులపై అది పడితే.. రకరకాల జబ్బులు, చర్మ వ్యాధులు వచ్చేవట. దీనివల్ల ఏ అవయవంపై బల్లి విషం పడితే.. ఎలాంటి ప్రమాదం ఉంటుందో వివరిస్తూ బల్లి శాస్త్రాలు రాశారు. కానీ.. ప్రస్తుతమున్న ఈ బల్లుల వల్ల అలాంటి చెడు ప్రభావం ఉండదట. కాబట్టి ఇకపై అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకండి.



Click it and Unblock the Notifications