Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
కాలికి నల్లదారం.. మగవాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా..?
కాలికి నల్ల దారాన్ని ఎవ్వరైనా కట్టుకోవచ్చు. చిన్నా, పెద్దా, స్త్రీ, పురుషులు అని తేడా లేకుండా ఎవ్వరైనా సరే ఈ నల్లదారాన్ని కట్టుకోవచ్చు. నల్లదారం కట్టుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. నల్లదారం కట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా వుంటుంది. పురుషులు నల్ల దారం గనుక కట్టుకోవాలనుకుంటే కుడి కాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి. స్త్రీలు కట్టుకోవాలనుకుంటే ఎడమకాలికి మాత్రమే నల్ల దారాన్ని కట్టుకోవాలి.
అమావాస్య రోజు ఈ నల్లదారాన్ని కట్టుకోవాలని హిందూ శాస్త్రం చెబుతోంది. అమావాస్య నుంచి వచ్చే అమావాస్య లోపు ఎలాంటి నరదృష్టి వున్న, నరఘోష వున్నా ఈ నల్లదారం మొత్తం ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రతీ 30 రొజులకు ఈ నల్లదారాన్ని మార్చుకోవాలని చెబుతున్నారు. నల్లదారాన్ని ఎప్పుడపడితే అప్పుడు తీసివేయవద్దు. సాయంత్రం సమయంలోనే ఈ నల్లదారాన్ని తీసివేయాలి. నల్లదారాన్ని తీసి, చేతిలో జిల్లేడు ఆకులో కర్పూరం వెలిగించి ఆ కర్పూరంలో వాడిన నల్ల దారాన్ని వేసి కాల్చివేయాలి. ఇలా కాల్చివేసిన నల్లదారాన్ని ఒక కవర్‌లో చుట్టి ఎవ్వరూ లేని ప్రదేశంలో పారవేయాలి.

నల్లదారానికి మూడు పోగులు వేసుకొని కట్టుకోవాలి. అమావాస్య నుంచి అమావాస్య వరకు మాత్రమే ఒక నల్లదారాన్ని కట్టుకోవాలి. తరువాత దానికి మార్చివేయాలి. స్త్రీలు ఎడమకాలికి, పురుషులు కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి.
చిన్నపిల్లలకు కూడా నల్లదారం కట్టడం వల్ల నరదృష్టి తగలకుండా వుంటుంది. సంవత్సరం పాటు చిన్నపిల్లలకు బుగ్గపై కాటుక చుక్క పెట్టడం వల్ల దృష్టి తగలకుండా వుంటుంది. స్త్రీలు కళ్లకు కాటుక ధరించడం వల్ల ఒకవైపు దృష్టి తగలకుండా వుండడమే కాకుండా కళ్లు చాలా ఆకర్శనియంగా వుంటాయ్.
మొలతాడు ధరించడం
ప్రతి ఒక్క పురుషుడు తప్పకుండా మొలతాడును ధరించాలి. హిందూ శాస్త్రం ప్రకారం మగవారు మొలతాడు ధరించకపోతే వారి జీవితంలో అదృష్ట దశక తగ్గిపోతుంది. వెండి మొలతాడు ధరించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. సోమవారం రోజు వెండి మొలతాడును ధరించి శివుడికి పూజచేయడం వల్ల శుభం కలుగుతుందని అంటున్నారు.

ఎర్రని మొలతాడును గనుక ధరిస్తే ఆదివారం రోజు మాత్రమే ధరించాలి. సూర్యుడికి ఆదివారమంటే ఇష్టం, సూర్యుడు ఎర్రగా వుంటాడు కాబట్టి అదే రోజు ఎర్ర మొలతాడును ధరించాలి. దీని వల్ల సూర్యుడి ఆశీస్సులు లభిస్తాయ్. నల్లని మొలతాడు గనుక ధరించాలనుకుంటే కేవలం గురువారం రోజు మాత్రమే ధరించాలని పండితులు చెబుతున్నారు.
స్త్రీలు మంగళసూత్రాన్ని ఎప్పుడంటే అప్పుడు కుచ్చుకోవడం మంచిది కాదు. కేవలం నవమి, దశమి రోజు మాత్రమే మంగళసూత్రాన్ని కుచ్చుకోవాలి. స్త్రీల మంగళసూత్రంలో మొత్తం 9 పూసలు వుండాలి. అందులో నల్లపూజలు 5, ఎర్ర పూసలు రెండు, ముత్యాలు రెండు. మంగళసూత్రంలో తొమ్మిది పూసలు ఖచ్ఛితంగా వుండాలి. మంగళ సూత్రంలో ఇనుపవుస్తువులు వుండకుండా చూసుకోవాలి. కొంత మంది స్త్రీలు సేఫ్టీపిన్నులు, లాకర్ తాళాలు ఇలా మంగళసూత్రానికి కలిపి వేసుకుటారు. ఇనుము దరిద్ర దేవతకు ప్రతీది కాబట్టి ఇలా ఇనుమును మంగళసూత్రానికి జోడించవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. స్త్రీలకు ఎప్పుడు పసుపు, కుంకుమ ఇచ్చినా దాన్ని మంగళసూత్రానికి పెట్టుకోవాలి. తరువాత మిగిలిన కుంకుమను నదుటన పెట్టుకోవాలి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారమంతా ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించడబడింది. దీనిని మేము దృవీకరించము.



Click it and Unblock the Notifications