Latest Updates
-
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త!
కాకి అరిస్తే మంచిది.. తాకితే అశుభం.. ఎందుకు ?
నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నావని ఎగతాలి చేస్తారు. గట్టిగా గోలచేస్తే కాకిలా అరుస్తున్నావు అని గేలీ చేస్తారు. కాకి పిల్ల కాకికి ముద్దు అని దీర్ఘాలు తీస్తారు. కాకిని రకరకాల సందర్భాల్లో వాడుతుంటారు. కొన్నిసార్లు పాజిటివ్ గా, మరికొన్ని సార్లు నెగటివ్ గా తీసుకుంటారు. బామ్మలు ఎక్కువగా కాకి ప్రస్తావన తీసుకొస్తుంటారు.
కుజ దోషం ఉంటే ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఉండాల్సిందేనా ?
ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే.. ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలా మంది నమ్ముతారు. కానీ.. కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాగే కాకి తలపై తాకితే.. దోషమని చాలా మంది బెంబేలెత్తిపోతుంటారు. మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధి అని కూడా పిలుస్తారు. ఇవన్నీ మూఢనమ్మకాలా ? వాస్తవాలా ? అన్న విషయం మాత్రం ఎవరీ క్లారిటీ ఉండదు.

కాకి అరిస్తే చుట్టాలొస్తారన్న నమ్మకానికి రామాయణానికి సంబంధం ఉంది. ఆంజనేయుడు సీతమ్మని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకి శుభవార్త కాబట్టి, కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు.
శనిగ్రహ దోష నివారణకు ఏం చేయాలి..?
కానీ కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయే అంత అపనమ్మకమూ ఉంది. కాకి శని వాహనం కాబట్టి.. కాకి తగిలితే.. శని దోషం జరుగుతుందని, యముడి రాకకి సంకేతమని భయపడతారు. కానీ.. దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. నిత్యం ఏదోఒకటి జరుగుతూ ఉంటుంది. దానికి అనవసరంగా ఖంగారు పడకూడదు. అంతగా అనుమానంగా, భయంగా ఉంటే.. శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం చేసి, అభిషేకం చేయిస్తే దోషం పోతుంది.



Click it and Unblock the Notifications