Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇంట్లో ఈ రకమైన హనుమంతుడి ఫోటోలను ఉంచకూడదు.. ఉంచితే ఏమవుతుందంటే?
జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని ప్రార్థిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. హనుమంతుడిని ప్రార్థిస్తే శని దోషాల నుంచి కూడా తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల అనేక మంచి పనులు జరుగుతాయని చెబుతుంటారు. అయితే ఎంత హనుమంతుడి భక్తుడైనా కొన్ని రకాల ఆంజనేయ స్వామి ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎలాంటి హనుమంతుడి ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదు, ఉంచుకుంటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం.
ఛాతిని చీల్చుతున్న హనుమంతుని ఫోటో
హనుమంతుడు శ్రీరామునికి గొప్ప భక్తుడు. అతను శ్రీరాముడిని ఎంతగా ఆరాధిస్తాడనే దానికి గుర్తుగా, అతను తన ఛాతీని చీల్చుకుంటాడు. తన ఛాతీని చీల్చినప్పుడు తన గుండెల్లో రాముడు-సీత కనిపిస్తారు. అయితే ఇలాంటి ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఉంచుకోవడం వల్ల హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నారు.

సంజీవిని కొండను ఎత్తుకున్న హనుమంతుడి ఫోటో
రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు చనిపోయినప్పుడు హనుమంతుడు సంజీవని కొండను తీసుకొని వెళ్తారు. అయితే ఇలా హనుమంతుడు కొండను తీసుకొని వెళ్తున్న ఫోటోను ఇంట్లో ఉంచుకోకూడదట. ఇది అస్థిరత్వానికి నిదర్శనమని, అందుకే ఈ తరహా ఫోటోలను ఉంచుకోకూడదని చెబుతున్నారు.
లంక దహనం చేస్తున్న ఫోటో
సీత జాడను తెలుసుకోవడానికి హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు.. అక్కడ లంక దహనం చేస్తారు. అలాంటి అలాంటి ఫోటోలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదట. ఇది ప్రతికూల ప్రాభవాన్ని ఇస్తుందని, లంక దహనం మాదిరిగా ఇల్లు కూడా నాశనమవుతుంది పేర్కొంటున్నారు.
రాముడు, లక్ష్మణుడిని భుజాన మోస్తున్న ఫోటోలు
సీత జాడ తెలుసుకున్న తరువాత సీతను రక్షించేందుకు హనుమంతుడు రాముడు, లక్ష్మణుడిని తన భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్తారు. ఇలాంటి ఫోటోలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదని, ఇలా ఉంచడం వల్ల యజమానిపై భారం ఎక్కువగా పడుతుందని, అలాగే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. పైన పేర్కొనబడిన హనుమంతుడి ఫోటోలు తప్ప ఇతర ఫోటోలను వినియోగించుకోవచ్చని ఎలాంటి సమస్యలు రావని పేర్కొంటున్నారు.
ఈ ప్రదేశాల్లో హనుమంతుడి ఫోటో పెట్టవద్దు
హనుమంతుడి ఫోటోను ఎట్టి పరిస్థితుల్లో పడకగదిలో పెట్టకూడదని పండిత నిపుణులు చెబుతున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి, పడకగదిలో ఆయన ఫోటోలను ఉంచడం మంచిది కాదని, ఇది చెడు కాలాన్ని సూచిస్తుందని పేర్కొంటున్నారు. దీనికి బదులు ప్రత్యేకమైన పూజ గదిలో లేదా, ఇతర ప్రదేశాల్లో హనుమంతుడిని ఉంచాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సులు ఎప్పుడూ మీపైనే ఉంటాయని చెబుతున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను కూడా ఎంతో ఇష్టంగా దాటేస్తారట.
ఇలా పూజించకూడదు
హనుమంతుడిని పూజించాలంటే కొన్ని కఠిన నియమాలు, కఠోర దీక్షలు చేయాల్సి ఉంటుంది. సాదాసీదాగా ఇంట్లోని విగ్రహానికి పూజలు చేస్తే మంచి జరగదు. దోషం కూడా పోయే అవకాశం లేదు. అందుకే హనుమంతుడిని పూజించాలనుకునే భక్తులు, ప్రతి మంగళ, శని వారాల్లో హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందచ్చు. అలాగే హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం ఇంట్లో హనుమంతుడి ఫోటోలను ఉంచుకోవడం కంటే, బదులుగా ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదివితే ప్రయోజనం కలుగుతుంది.



Click it and Unblock the Notifications