Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
మాఘ అమావాస్య నాడు 12 రాశుల వారు ఇవి దానం చేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా...
మౌని అమావాస్య సందర్భంగా ఏ రాశి వారు ఎలాంటి వస్తువులను దానం చేయాలో చూడండి.
Donate According to Your Zodiac on the Day of Mauni Amavasya:హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెల ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీన మాఘ అమవాస్య వచ్చింది. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పగా ఉంటుంది. మౌని అమావాస్య అర్థం ఏంటంటే..

మౌని అంటే - మాట్లాడకుండా మౌనంగా ఉండటం.. అమా అంటే చీకటి.. వాస్య అంటే కామం.. అని అర్థం. ఈ అమావాస్య రోజున పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవడం. మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉండి, మౌనవ్రతం పాటిస్తూ.. ఎంతో నిష్టతో ఉంటారు. ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం ఆచరిస్తారు.

ఈ రోజున చేసే దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మౌని అమావాస్య రోజున ద్వాదశ రాశుల వారు ఏమి దానం చేస్తే శుభఫలితాలొస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మాఘ అమావాస్య రోజున మేష రాశి వారు నువ్వులు, గోధుమలు దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

వృషభ రాశి..
ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు మాఘ అమావాస్య రోజున బార్లీ, చక్కెరను దానం చేయాలి.

మిధున రాశి..
ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి స్త్రీలు మాఘ అమావాస్య రోజున పచ్చని దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు మాఘ అమావాస్య రోజున పాలు, పెరుగు, బియ్యం, చక్కెర మరియు చెరకు వంటి పదార్థాలను దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. అందుకే మాఘ అమావాస్య రోజున సింహ రాశి వారు సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. దీని వల్ల మీ సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మాఘ అమావాస్య రోజున ఆవులకు పచ్చి మేత తినిపించాలి. అలాగే పప్పులు, తిలకం వంటి తదితరాలను దానం చేయాలి.

తుల రాశి..
ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. మాఘ అమావాస్య రోజున తుల రాశి వారు తీపి పదార్థాలను దానంగా ఇస్తే, శుభ ఫలితాలను పొందొచ్చు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మాఘ అమావాస్య రోజున రాగి వస్తువులతో కూడిన దానం చేయాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మాఘ అమావాస్య రోజున ఆలయంలో పప్పులు, బెల్లం, తేనే మొదలైన వస్తువులను దానం చేయాలి.

మకర రాశి..
ఈ రాశి వారికి శని గ్రహం అధిపతిగా ఉంటాడు. మాఘ అమావాస్య రోజున నల్లని వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

కుంభ రాశి..
ఈ రాశి వారు మౌని అమావాస్య రోజున ఇనుము వస్తువులు, నువ్వులు, ఆవ నూనెను దానం చేయాలి. దీంతో వ్యాపారులకు ఇబ్బందులు తొలగిపోతాయి.

మీన రాశి..
ఈ రాశి వారు మౌని అమావాస్య రోజున పసుపు, చందనం, పప్పులు, దుప్పట్లు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలనేవి తగ్గిపోతాయి.
2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన అంటే మంగళవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది.మౌని అమావాస్య అర్థం ఏంటంటే.. మౌని అంటే - మాట్లాడకుండా మౌనంగా ఉండటం.. అమా అంటే చీకటి.. వాస్య అంటే కామం.. అని అర్థం. ఈ అమావాస్య రోజున పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవడం. మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉండి, మౌనవ్రతం పాటిస్తూ.. ఎంతో నిష్టతో ఉంటారు. ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం ఆచరిస్తారు. ఈ రోజున చేసే దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.



Click it and Unblock the Notifications