For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేడు (జులై 13,2018) సూర్య గ్రహణం, గ్రహణం ఏర్పడ్డ ప్రతిసారి ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి

జూలై 13 అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడనుంది. నేడు (జులై 13,2018) సూర్య గ్రహణం, గ్రహణం ఏర్పడ్డ ప్రతిసారి ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.

|

భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనిపించకపోవటం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక జూలై 13 అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడనుంది. జూలై 13 గురువారం రోజున ఉదయం 7 గంటల 18 నిమిషాల నుంచి 9:44 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. కానీ గ్రహణం ప్రభావం ఉండే అవకాశాలున్నందును అందరూ జాగ్రత్తలు పాటించడం మంచిది.

గ్రహణాల రకాలు

గ్రహణాల రకాలు

భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ కప్పినప్పుడు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి సూర్యగ్రహణాలు భూమి మీద చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. అందుకే సంపూర్ణ సూర్యగ్రహణం పట్టే ప్రదేశాలు చాలా దూరంగా ఉన్నప్పటికీ అక్కడకు వెళ్లి చూస్తుంటారు.

సూర్యగ్రహణాన్ని చైనాలో గుర్తించారు

సూర్యగ్రహణాన్ని చైనాలో గుర్తించారు

1999లో యూరప్‌లో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఎక్కువమంది చూసినట్లు రికార్డు అయింది. 2009 జనవరి 26 న కూడా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఈ మధ్య కూడా సంపసూర్యగ్రహణాన్ని మొదటిసారిగా ఎక్కడ గుర్తించారంటే, క్రీస్తు పూర్వం 781 సంవత్సరం, జూన్ 4వ తేదీన మొదటిసారిగా సూర్యగ్రహణాన్ని చైనాలో గుర్తించారు. ఇది అమావాస్య రోజున ఏర్పడింది. ఇక గతేడాది కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది.

చాలా మంది చాలా అనుమానాలతో ఇబ్బందిపడుతుంటారు

చాలా మంది చాలా అనుమానాలతో ఇబ్బందిపడుతుంటారు

గ్రహణం వచ్చే ప్రతిసారి చాలా మంది చాలా అనుమానాలతో ఇబ్బందిపడుతుంటారు. కొందరు బయటకు రారాదని, ఎలాంటి ఆహార పదార్థాలు తినరాదని, గర్భిణులు జాగ్రత్త పడాలని.. ఇలా గ్రహణం రోజు ఎవరి నోట విన్నా ఈ మాటలే వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో అసలు గ్రహణం అంటే ఏమిటి ? గ్రహణం రోజు ఏం చేయాలి ? ఏం చేయరాదు ? శాస్త్రాలు, పంచాంగాలు, పండితులు ఏం చెబుతున్నారనే విషయాలపై ప్రత్యేక కథనం.

అలా సూర్యగ్రహణం ఏర్పడుతుంది

అలా సూర్యగ్రహణం ఏర్పడుతుంది

భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనిపించకపోవటం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే.. సూర్యగ్రహణ ప్రభావం సమస్త జీవరాశిపై ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సూర్యునిలో వచ్చే ప్రతి చిన్న మార్పు సమస్త జీవరాశిపై, ఈ ప్రకృతిపైన ప్రభావం చూపుతుందని వారు పేర్కొంటున్నారు.

సూర్య కిరణాలు విషపూరితమవుతాయి

సూర్య కిరణాలు విషపూరితమవుతాయి

ఈ సూర్యునిలోని కదలికల వలనే ఈ భూమండలంలోని మానవులకు గుండెపోట్లు, విమాన, రైలు ప్రమాదాలు, ప్రకృతి సంబంధమైన ఉపద్రవాలు ఏర్పడతాయని పండితులు అంటున్నారు. ఈ సూర్యగ్రహణ సమయంలో సూర్యుని నుండి వెలువడు సూర్య కిరణాలు విషపూరితమవుతాయి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీల గర్భంలోని శిశువుపై ఈ విషకిరణాలు ప్రభావం కల్గిస్తాయి. అందువల్ల గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ద్రవపదార్థాలలోనికి చొచ్చుకొని పోయి

ద్రవపదార్థాలలోనికి చొచ్చుకొని పోయి

అదేవిధంగా సూర్యగ్రహణం రోజున ఎలాంటి ఆహార పదార్థాలను తయారుచేసి ఉంచి, గ్రహణం తర్వాత తినకూడదు. ఎందుకంటే...? సూర్యగ్రహణం సమయంలో వెలువడే విషకిరణాలు ఆహార, ద్రవపదార్థాలలోనికి చొచ్చుకొని పోయి విషపూరితమగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అట్టి ఆహారాన్ని భుజించిన వారిపై ఈ ప్రభావం కనిపించును.

ఫిల్టర్ గ్లాసులను వేసుకుని సూర్యుడిని చూస్తే

ఫిల్టర్ గ్లాసులను వేసుకుని సూర్యుడిని చూస్తే

ఇంకా ఈ సూర్యగ్రహ విష కిరణాలు నేత్రములోని రెటీనాపై విషప్రభావం చూపుతాయి. దీంతో అంధత్వం ఏర్పడే అపాయం ఉంది. అందుచేత గ్రహణం సమయంలో ఫిల్టర్ గ్లాసులను వేసుకుని సూర్యుడిని చూస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. సూర్యగ్రహణం అనేది చిన్న విషయం కాదు. దీని ప్రభావం వలన మిగిలిన ఎనిమిది గ్రహాలపై తీవ్రమైన పరిణామాలు కల్గి భూమండలంపై అనర్థాలు సంభవిస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

కేతుగ్రస్త చంద్రగ్రహణం

కేతుగ్రస్త చంద్రగ్రహణం

శాస్త్రీయ కోణంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ మూడు ఒకే సరళరేఖపైకి వచ్చే అరుదైన కాలాన్నే గ్రహణం అంటారు. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. వీరి మధ్యలో భూమి ఉంటుంది. ప్రతీ నెల వచ్చే పౌర్ణమీలలో గ్రహణాలు ఏర్పడవు. భూమి, సూర్యుడు, చంద్రుడు అన్ని ఒకే సరళరేఖపై ఉండి కేతుగ్రహం వద్దకు రావడం ద్వారా చంద్రుడు కనిపించకపోతాడు. ఈ సమయాన్నే కేతుగ్రస్త చంద్రగ్రహణమని అంటారు.

సూర్యచంద్రులను రాహుకేతులు మింగడం వల్ల

సూర్యచంద్రులను రాహుకేతులు మింగడం వల్ల

చంద్రుడు పూర్తిగా కనిపించకపోవడాన్ని సంపూర్ణ చంద్రగ్రహణమని, పాక్షికంగా కనబడటాన్ని పాక్షిక చంద్రగ్రహణం అని అంటారు. చంద్రబింబం పూర్తిగా కనిపించకుండా పోయి మళ్లీ పూర్తిగా కనిపించే వరకు కాలాన్ని గ్రహణం అని అంటారు. అయితే సూర్య, చంద్ర గ్రహణాలకు రాహు, కేతులు కారణం అవడం ద్వారా మన పూర్వీకులు చెప్పినట్లుగా సూర్యచంద్రులను రాహుకేతులు మింగడం వల్ల రాహుగస్త గ్రహణమని, లేదా కేతుగ్రస్త గ్రహణమని అంటారు.

గ్రహణ సమయంలో ఏం చేయాలి

గ్రహణ సమయంలో ఏం చేయాలి

ఆచారపరులు గ్రహణ సమయాల్లో గ్రహణం పట్టేముందు పట్టు స్నాన్నాన, వీడే ముందు విడుపుస్నానాన్ని ఆచరించాలి. గ్రహణానికి సంబంధించిన అతి నీలలోహిత కిరణాలను నివారించే శక్తి కలిగిన ప్రకృతి ప్రసాదితమైన దర్బలను ఇళ్లల్లో ఉంచుకోవాలి. దేవతా గదుల్లో, ఆహార పదార్థాల్లో, నీటిలో వేసి ఉంచుకోవడం ద్వారా గ్రహణ కాంతులను ఈ దర్బలు (గరక) దరిచేరనియ్యవు.

పూజలకు విశేష ఫలితం

పూజలకు విశేష ఫలితం

గ్రహణ సమయాల్లో చేసే జపాలు, అనుష్టానాలు కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని, ఈ సమయంలో చేసే జపాలు, దానాలకు విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఇంటితో పాటు పరిసర ప్రాంతాలు శుద్ధి చేసుకొని నిత్య దేవత ఆరాధన చేసి భోజనం చేయకుండా అల్పాహారం తీసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.

ఆరు గంటల ముందుగా భోజనం

ఆరు గంటల ముందుగా భోజనం

ఈ భూమి, సూర్య, చంద్రుడు ఒకే సరళరేఖపై రావడం ద్వారా ఆ రాపిడి వల్ల కలిగే అతి నీలలోహిత కిరణాలు మానవులపై ప్రసరింపజేయడం ద్వారా మనకు కొన్ని అనారోగ్యాలు కలిగే ప్రమాదం లేకపోలేదు. గ్రహణ వేద ప్రారంభం కాకముందే అంటే గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా భోజనం చేయమని శాస్త్రం చెబుతుంది. అంటే తినే పదార్థానికి అరుగుదల కావడానికి సరైన సమయం అన్న మాట.

రేడియేషన్ నివారించే గుణాలు

రేడియేషన్ నివారించే గుణాలు

సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి వుంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారనడానికి కొన్ని కారణాలున్నాయి.గరిక అనేది యాంటీ రేడియేషన్ నివారించే గుణాలు కలిగివున్నది. అందుకే గ్రహణం సమయంలో మన ఇంట్లోని అన్ని పాత్రలపై, నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది.

ఎలాంటి ఆహారం తీసుకోకూడదు

ఎలాంటి ఆహారం తీసుకోకూడదు

సూర్య చంద్ర గ్రహణాల వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని భావిస్తారు. గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు. ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు.గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలి. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గ్రహణం ఏర్పడటానికి మూడు గంటల ముందు, ఏర్పడిన అనంతరం మరో మూడు గంటల వరకు పసి పిల్లలు, వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

గ్రహణానంతరం మరలా స్నానం చేసి

గ్రహణానంతరం మరలా స్నానం చేసి

అలాగే, గ్రహణం రోజున ముందుగా వండిన పదార్థాలను కూడా పారవేస్తారు. అన్ని దేవాలయాలనూ మూసివేస్తారు. దోష నివారణకు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహణాల సమయంలో ముస్లింలు కూడా సలాతుల్-కుసుఫ్ అనే ప్రత్యేక ప్రార్థన చేస్తారు. గ్రహణం పట్టే ముందుగా స్నానం చేసి జపం చేసుకుని గ్రహణానంతరం మరలా స్నానం చేసి మీ ఇంటి లోనున్న పూజా గృహాన్ని శుద్ధి చేసుకుని పటాలు లేక విగ్రహాలను కూడా ఆవుపాలు శుద్ధ జలంతో శుద్ధిపరచుకుని వారికి ఉపచారాదులు చేసుకోవాలి. తదనంతరం మాత్రమే ఏదైనా స్వీకరించాలి. ఇవన్నీ కూడా ఏ గ్రహనం ఏర్పడిన పాటించాలని పండితులు చెబతున్నారు. శాస్రీయంగా కూడా రుజువైనవి. నమ్మకాలను ఎవరూ కాదనలేం కదా.

English summary

Dos and Don'ts On A Solar Eclipse Day, July 13, 2018

Dos and Don'ts On A Solar Eclipse Day, July 13, 2018
Story first published:Thursday, July 12, 2018, 18:43 [IST]
Desktop Bottom Promotion