Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఇవి మీ కలలో కనిపిస్తే.. మీకు అఖండ రాజయోగం.. కష్టాలన్నీ తీరిపోతాయ్..!
మనకు వచ్చే కొన్ని కలలు చెడును సూచిస్తాయ్. మరికొన్ని కలలు మంచిని సూచిస్తాయ్. భవిష్యత్తులో ఏమి జరగబోతోందో కలలు మనకు ముందుగానే ఒక సూచికను పంపిస్తుంది. మన హిందూ శాస్త్రంలోని పండితులు వీటి గురించి ముందుగానే చెప్పారు. బృహస్పతి అనే మహర్షి కలలు గురించి ఎన్నో గొప్ప విషయాలను రచించారు. ఏ కలలు వస్తే ఏమి జరుగుతుందో ఆయన చాలా అద్భుతంగా చెప్పారు.
రామాయణంలో కూడా కలలు నిజమవడం గురించి వాల్మీకి రచించారు. సీతాదేవిని రావణాసురుడు అపహరించి అశోకవనంలో పెడతాడు. అక్కడ సీతాదేవికి చుట్టుపక్కల చాలా మంది రాక్షసినులు వుంటారు. అందులో ఒక రాక్షసి పేరు త్రిజట. ఈ త్రిజట రాక్షసి ఎప్పుడూ నిద్రపోతూనే వుంటుంది. ఆమెకు కలలు విపరీతంగా వస్తాయ్.
ఈ కలల గురించి త్రిజల సీతాదేవికి వివరిస్తూ వుంటుంది.

కలియుగంలో అన్నమాచార్యుల వారికి కూడా కలలు వచ్చాయ్. ఆ కలల నుంచే కలగంటి కలగంటి.. అనే కీర్తన మనం అన్నమయ్య సినిమా ద్వారా విన్న విషయం తెలిసిందే. కలలో దేవుడు కనిపిస్తే తరువాత రోజు వెంటనే స్నానం చేసుకొని గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి.పగటిపూట వచ్చిన కలలు ఫలించవని పండితులు చెబుతున్నారు. మద్యాహ్నం నిద్రపోయినప్పుడు వచ్చిన కలలు కూడా ఫలించవు. రోజంతా దేనిగురించైనా ఆలోచిస్తే.. అవి కలలో వస్తే ఆ కలలు కూడా ఫలించవని చెబుతున్నారు.
ఏనుగు మీద ఎక్కినట్లు, తల్లని గుర్రం మీద ఎక్కినట్లు, తెల్లని ఎద్దుమీద ఎక్కినట్లు గనుక కల వస్తే గొప్ప స్థాయిని చేరుకోబోతున్నామని అర్థం. వారు ఉన్నస్థానంలోంచి మరింత మెరుగైన స్థానంలోకి వెళ్తారని ఇలాంటి కలలు సూచిస్తాయ్. కలలో తెల్లని హంసలు, కోళ్లు, చకోర పక్షలు కనబడితే తొందరలోనే వివాహ యోగం వుందని అర్థం.

సముద్రం దగ్గర, చెరువు దగ్గర తామరాకు మీద కూర్చొని పాయసం తాగుతున్నట్లు గనుక కల వస్తే వారికి త్వరలోనే అఖండ రాజయోగం దక్కుతుందని అర్థం. ఏదో ఒక విధంగా వీరికి అష్టైశ్వర్యాలూ లభిస్తాయ్. జీవితంలో తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది.
విడిపోయిన భార్యా భర్తలో ఎవరికైనా ఒకరికి ఇద్దరూ కలిసి ఒకే కంచంలో తింటున్నట్లు కలవచ్చినా, భర్త తొడమీద భార్య కూర్చున్నట్లు కలవచ్చినా ఇద్దరూ త్వరలోనే కలుసుకోబోతున్నారని అర్థం. మనకు ఎవరైనా తెల్లని గొడుగు పట్టినట్లు కలవచ్చిన, తెల్లని హారం వేసినట్లు కల వచ్చినా, ఎవరైనా విసనకర్రతో మనకు గాలి విసురుతున్నట్లు కలవచ్చినా వారు త్వరలోనే చక్రవర్తి కాబోతున్నట్లు అర్థమని హిందూ స్వప్న శాస్త్రం చెబుతోంది.
కలలో గులాబీలు, ఎర్రని పుష్పాలు, తామర పువ్వులు గనుక కనిపిస్తే తొందరలోనే ఇంట్లో మహాలక్ష్మీ కాలుపెట్టబోతోందని అర్థం. మీకు వున్న అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోతాయని అర్థం. ఇక కలలో దేవతలు గనుక కనిపిస్తే ఇక నక్కతోక తొక్కినట్లేనని పండితులు చెబుతున్నారు. కలలో ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవాలయానికి మరుసటి రోజు స్నానం చేసుకొని వెళ్లి ఆ దేవుడికి నమస్కరించి దేవాలయంలో అర్చన చేయించాలి. కొందరికి దేవుడు కాకుండా కేవలం దేవాలయం, గోపురం లాంటివి కినిపిస్తాయ్. అలా కనిపించినప్పుడు కులదైవానికి నమస్కరించి, దేవాలంలో అర్చన చేయించుకోవాలి.



Click it and Unblock the Notifications