For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూజలో కొబ్బరికాయ కుళ్లితే అపచారమా ?

By Swathi
|
Spoiled Coconut Alternative Uses || పూజల్లో కొబ్బరికాయ ఎందుకు వాడతారో తెలుసా?? || Boldsky Telugu

పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతారు. అలాగే ఆలయాలకు వెళ్తే కొబ్బరికాయ తీసుకెళ్లే సంప్రదాయం ఉంది. ఇంట్లో కొంతమంది వారం వారం కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. మరికొందరు అమావాస్యకు కొడతారు. మరికొందరు పండుగల సమయంలో మాత్రమే కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం పాటిస్తారు.

During Puja Spoiled Coconut. Is it a bad sign?

పెళ్లి సమయంలో, యగ్నాలు, హోమాల సమయంలో ఎక్కువగా కొబ్బరికాయలు ఉపయోగిస్తారు. పూజలన్నింటిలోనూ కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ.. కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ?

కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?

మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే ఎలాంటి దోషమూ ఉండదు. అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే ఆ కాయను నీటితో శుభ్రంచేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ పక్రియ దోషం చెడిపోయి కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది.

During Puja Spoiled Coconut. Is it a bad sign?

అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. కానీ.. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కొబ్బరికాయ చెడిపోయి ఉంటే.. కుళ్లిన భాగాన్ని తీసేసి.. కాళ్లూ, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజామందిరాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే.. దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహానాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది.

Story first published: Friday, January 22, 2016, 16:39 [IST]
Desktop Bottom Promotion