For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భీమున్ని ఈతకు పిలిచి దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? తొడగొట్టి చెప్పి చేసి చూపించిన మగాడు భీముడు

భీమా మాతో పాటు ఈతపడుదువురా అంటూ నదికి తీసుకెళ్తాడు దుర్యోధనుడు. భీముడి కౌరవుల మాట నమ్మి ఈతకు వెళ్తాడు. తర్వాత దుర్యోధనుడు విషయం కలిపిన అన్నం భీముడికి పెడతాడు.

|

భీముడంటే ఎంతో పరాక్రమవంతుడు.. ధైర్యవంతుడు అని అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి దుర్యోధనుడికి భీముడంటే అస్సలు పడదు. ఇద్దరూ చిన్నప్పటి నుంచే పొట్లాడుకునేవాళ్లు. భీముడు ఎప్పుడు దొరుకుతాడా? ఎప్పుడు చంపుదామా అన్నట్లు వేచి చూసేవాడు దుర్యోధనుడు.

సూతుడిని చంపేస్తాడు

సూతుడిని చంపేస్తాడు

చాలా సార్లు భీమున్ని చంపేందుకు ప్రయత్నించాడు దుర్యోధనుడు. అయితే భీమున్ని ఎన్నిసార్లు చంపాలనుకున్నా కూడా అతను చనిపోకపోవడంతో భీముడి రథసారథిని అయిన సూతుడిని చంపేస్తాడు దుర్యోధనుడు. పాండవుల్లో రెండో వాడే భీమసేనుడు. పాండురాజుకు, కుంతీదేవీకి వాయు దేవుడి అనుగ్రహంతో పుడతాడు భీమసేనుడు. భీముడు పుట్టినప్పటి నుంచే ఎంతో బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే.. ఒక

సారి కుంతీ దేవి భీముడిని ఎత్తుకుని అడవిలో ఉండేటటువంటి వనదేవతను పూజించేందుకు వెళ్తుంది.

ముక్కలైపోతుంది

ముక్కలైపోతుంది

అయితే అక్కడ ఆమెపై పులి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో ఆమె పరుగు తీస్తుంది. ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న భీముడు జారి బండపై పడతాడు. అంతలో ఆమె చుట్టు ఉన్న సైనికులు, పాండురాజు పులిని తరిమికొడతారు. అయితే భీముడికి దెబ్బలు తాకాయోనని పాండురాజు చూస్తాడు. కానీ భీముడు నవ్వుతూ కనపడతాడు. భీముడి పడ్డ బండ మాత్రం ముక్కలైపోయి ఉంటుంది. అలా చిన్నప్పటి నుంచే భీముడు ఎంతో బలవంతుడు.

వారిద్దరినీ అంతమొందిస్తే

వారిద్దరినీ అంతమొందిస్తే

అయితే పాండురాజు చనిపోయిన తర్వాత కౌరవులు, పాండువులు మధ్య విభేధాలు మరింత ఎక్కువైపోతాయి. ఇరు వర్గాల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా వైరం ఉంటుంది. దుర్యోధనుడు, ధర్మరాజులిద్దరూ అధికారం కావాలనుకుంటారు. అయితే ధర్మరాజుకు వెన్నుగా నిలిచేది భీమార్జునలే. వారిద్దరినీ అంతమొందిస్తే మనకు తిరిగేది అనుకుంటాడు దుర్యోధనుడు.

భీమున్ని చంపేయాలనుకుంటాడు

భీమున్ని చంపేయాలనుకుంటాడు

ఎలా అయినా సరే భీమున్ని చంపేయాలనుకుంటాడు దుర్యోధనుడు. యుద్ధంలో భీమున్ని ఎదురించడం సాధ్యం కాదనుకుంటాడు. అయితే భీమున్ని చంపేందుకు దుర్యోధనుడు చిన్నతనం నుంచే చాలా కుట్రలు పన్నాడు. చాలా పన్నాగాలు పన్నాడు. భీమున్ని నీటిలోకి తోసి చంపాలనుకుంటాడు దుర్యోధనుడు. అందుకోసం ఒక వ్యూహ్యం రచిస్తాడు. మొదట భీముడి చేత విషం కలిపిన అన్నం తినేలా చేస్తాడు. తర్వాత అత్యంత విషము కలిగిన పాములుండే నదిలో భీమున్ని పడేసి రావాలని పన్నాగం పన్నుతాడు దుర్యోధనుడు.

ఈతపడుదువురా అంటూ నదికి తీసుకెళ్తాడు

ఈతపడుదువురా అంటూ నదికి తీసుకెళ్తాడు

భీమా మాతో పాటు ఈతపడుదువురా అంటూ నదికి తీసుకెళ్తాడు దుర్యోధనుడు. భీముడి కౌరవుల మాట నమ్మి ఈతకు వెళ్తాడు. తర్వాత దుర్యోధనుడు విషయం కలిపిన అన్నం భీముడికి పెడతాడు. దాన్ని తిన్న భీముడు పడిపోతాడు. తర్వాత కౌరవులు భీముడ్ని నదిలో పడేస్తారు. ఇక తమకు తిరుగులేదు అనుకుంటాడు దుర్యోధనుడు. నదిలో పాములు మొత్తం కాటేస్తాయి. కానీ భీముడికి పెట్టిన విషం పాముల విషానికి వ్యతిరేకంగా పని చేస్తుంది. అయితే అదృష్ఠవశాత్తూ భీముడు తిన్న విషాహారం, అతన్ని కాటేసిన పాముల విషానికి విరుగుడుగా పనిచేసింది. అలా తిరిగి మళ్లీ బతుకుతాడు భీముడు.

తొడగొట్టి చెప్పి చేసి చూపించిన మగాడు భీముడు

తొడగొట్టి చెప్పి చేసి చూపించిన మగాడు భీముడు

భీముడు ధైర్యసాహసాలు మనకు మహాభారతంలో చాలా ఘట్టాల్లో కనపడతాయి. బకాసురునకు బండి మీద ఆహారాన్ని తీసుకెళ్లి అతన్ని అంతమొందించే ఘట్టంలో భీముడు వీరోచితంగా పోరాడుతాడు. ఇక బ్రాహ్మణుడి మాదిరిగా జరాసంధుడి కోటలోకి వెళ్లి అతణ్ని చంపడం కూడా భీముడి ధైర్యసాహసాలకు ప్రతీక. ద్రౌపదిని కౌరవులు నానా ఇబ్బందులుపెడుతున్నప్పుడు దుర్యోధనుడి తొడలు విరగొట్టి ఆ రక్తంతో ద్రౌపది శిరోజాలను ముడివేస్తానని తొడగొట్టి చెప్పి చేసి చూపించిన మగాడు భీముడు.

English summary

Duryodhana Attempts to Kill Bhima

Duryodhana Attempts to Kill Bhima
Story first published:Saturday, July 21, 2018, 10:45 [IST]
Desktop Bottom Promotion