For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Easter 2021:ఈస్టర్ అంటే అర్థమేంటో తెలుసా...

ఈస్టర్ పండుగ తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

క్రైస్తవులకు క్రిస్ మస్ పండుగ తర్వాత వచ్చే అతి పెద్ద పండుగల్లో ఈస్టర్ ఒకటి. గుడ్ ఫ్రైడే ముగిసిన మూడు రోజుల తర్వాత వచ్చే ఆదివారం రోజున ఈ పండుగను జరుపుకుంటారు.

Easter 2021 Date, Significance, History in Telugu

ప్రతి ఏటా ఈ పండుగ వసంత కాలంలో వస్తుంది. ఈస్టర్ వంటి పవిత్రమైన రోజు ఏసుక్రీస్తు మళ్లీ ప్రాణాలతో తిరిగొచ్చాడని చాలా మంది నమ్మకం. అందుకే ఈ ఆనంద సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈస్టర్ పండుగ చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం...

Easter Sunday 2021 : ఈస్టర్ చరిత్ర గురించి మీకు తెలుసా?

వసంత కాలంలోనే..

వసంత కాలంలోనే..

ఈస్టర్ పండుగ ప్రతి సంవత్సరం మార్చి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున వస్తుంది. ఈ పవిత్రమైన రోజు వసంత కాలంలో వస్తుంది. ఈ సమయంలో ప్రక్రుతి పులకిస్తుంది. అంతేకాదు.. ఈరోజు ఏసుప్రభు మళ్లీ ప్రాణాలతో తిరిగొచ్చారని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం..

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం..

క్రైస్తవ మత ఆచారాల ప్రకారం, విషవత్తును మార్చి 21తేదీగా (ఖగోళ శాస్త్ర పరంగా కచ్చిత తేదీతో సంబంధం లేకుండా) పరిగణిస్తారు. ‘‘పౌర్ణమి'' ఖగోళ శాస్త్ర పరంగా కచ్చితమైన తేదీ కానవసరం లేదు. అందువల్ల ఈస్టర్ తేదీ మార్చి 22 మరియు ఏప్రిల్ 25వ తేదీ మధ్య మారుతూ ఉంటుంది. అయితే 21వ శతాబ్దంలో మార్చి 21వ తేదీ, గ్రెగోరియల్ క్యాలెండర్లో ఏప్రిల్ మూడో సాద్రుశ్యంగా వస్తుంది. అందువలన వారి క్యాలెండర్లో ఈస్టర్ ఏప్రిల్ 4 నుండి మే 8వ తేదీ మధ్య మారుతూ ఉంటుంది.

ఈస్టర్ చరిత్ర..

ఈస్టర్ చరిత్ర..

చరిత్రను పరిశీలిస్తే.. ఏసు ప్రభువు పరమ పదించిన తర్వాత ఆయన అనుయూయులు నిరాశలో ఉన్నప్పుడు ప్రాణాలతో తిరిగొచ్చారనే కథనం ప్రచారంలో ఉంది. క్రీస్తు అనుయూయులందరూ ఉదాసీనంగా కూర్చొని ఉన్నప్పుడు ఎవరో తలుపు తట్టారు. అక్కడ చూస్తే.. ఓ స్త్రీ వచ్చి వారిని ఆశ్చర్యపరిచింది. తాను ఇద్దరు స్త్రీలతో కలిసి ఏసు సమాధిపై నీళ్లు చల్లడానికి వెళ్లగా.. దాని పైభాగం తెరవబడి ఉంది.

దేవదూతలు..

దేవదూతలు..

అక్కడ దేవదూతులు కనబడ్డారని.. వారు తెల్లని వస్త్రాలు వేసుకుని ఉన్నారు. వారి ముఖంలో ప్రకాశవంతమైన కాంతి కనిపిస్తోందని.. వారు నాజరేథ్ కు చెందిన ఏసును వెతుకున్నట్టు చెప్పారు. వారి మాటలను విన్న ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఏసు బతికి ఉంటే.. దయచేసి ఎక్కడున్నాడో చెప్పండి అంటూ కోరారు. ఆ వెంటనే ఆమెకు సమాధానం వినిపించింది.

తొలిసారిగా క్రీస్తును చూసి..

తొలిసారిగా క్రీస్తును చూసి..

ఆ తర్వాత తొలిసారిగా ఆమె క్రీస్తును చూసింది. అప్పుడు ఏసుక్రీస్తు ఇలా అన్నారు. ‘నీవు నా అనుయూయులకు చెప్పిలా.. వారిని నేను అతి త్వరలో కలుస్తానని వారికి చెప్పు. ఈ సందేశాన్ని ప్రభువు నుండి తీసుకుని వారి అనుయూయులకు వినిపించింది. ఈ సందర్భంగానే ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఇదే శబ్దాన్ని జర్మనీ భాషలో ‘ఈఓస్టర్' అని అంటారు. దీని అర్థమేమిటంటే.. ‘దేవీ' అని.. ఈ దేవీని ‘వసంత దేవీ'గా కూడా పిలుస్తారు.

శాంతి లభిస్తుంది..

శాంతి లభిస్తుంది..

ఆ తర్వాత ఏసు ప్రభు 40 రోజుల లోపు తన అనుయాయుల వద్దకు వెళ్లి వారిని ప్రోత్సహించి ఉపదేశించేవారిలా.. ‘మీకందరికీ తప్పకుండా శాంతి లభిస్తుంది'. దీంతో వారిలో ఉత్సాహం, విశ్వాసాన్ని నింపుతుండేవారు. ప్రభు ఏసు జీవించేఉన్నారు. ఆయన మహిమాన్వితుడు కాబట్టి క్రిస్టియన్లందరికీ ఆనందం, జీవితంపై ఆశలు రేకెత్తించి వారిలో ధైర్యాన్ని నింపుతుండేవారు. ఆ ధైర్యంతోనే క్రైస్తవులందరూ తమ కష్టాలను సులభంగా అధిగమించేలా చేయమని ఏసు ప్రభును ప్రార్థిస్తుంటారు.

పునర్జన్మ..

పునర్జన్మ..

మరో కథనం మేరకు.. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. తన మరణంతో, ఏసు మానవజాతి చేసిన పాపాలు పోవాలని తపస్సు చేశాడు. అతని పునరుజ్జీవనంతో, అతను చెడుపై విజయం సాధించాడు. తనను నమ్మిన వారందరికీ పునర్జన్మ ఇచ్చాడు.

English summary

Easter 2021 Date, Significance, History in Telugu

Here we are talking about the easter 2021 date, significance, history in telugu. Read on.
Story first published:Saturday, April 3, 2021, 20:05 [IST]
Desktop Bottom Promotion